CREDIT CARDS FROM LOUNGE VISITS TO VOUCHERS THESE ARE THE CREDIT CARDS THAT OFFER SPECIAL OFFERS FOR DOMESTIC TRAVEL GH VB
Credit cards: లాంజ్ విజిట్స్ నుంచి వోచర్స్ వరకు.. దేశీయ ప్రయాణానికి ఆఫర్స్ అందిస్తున్న క్రెడిట్ కార్డ్‌లు ఇవే..
(ప్రతీకాత్మక చిత్రం)
వివిధ బ్యాంకులు అందిస్తున్న క్రెడిట్ కార్డులలో ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లు(Travel Credit Cards) ఒక రకం. వీటి ద్వారా కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లేదా రైల్వే లాంజ్ యాక్సెస్, ట్రావెల్ సంబంధిత కొనుగోళ్లపై స్పెషల్ డీల్స్, డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
వివిధ బ్యాంకులు(Banks) అందిస్తున్న క్రెడిట్ కార్డులలో(Credit Cards) ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లు(Travel Credit Cards) ఒక రకం. వీటి ద్వారా కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్(Air Port) లేదా రైల్వే లాంజ్ యాక్సెస్, ట్రావెల్(Travel) సంబంధిత కొనుగోళ్లపై స్పెషల్ డీల్స్(Special Deal), డిస్కౌంట్లు(Discount) లభిస్తున్నాయి. ట్రావెల్ వెబ్సైట్లతో(Website) కో-బ్రాండెడ్ బెనిఫిట్స్, విమాన, హోటల్ బుకింగ్‌లు(Hotel Booking) చేసుకొంటే రీడీమ్ చేయగల రివార్డ్‌లు(Reward) పొందే అవకాశం ఉంది. దేశీయ ప్రయాణ ఖర్చులపై గణనీయమైన ఆఫర్లు(Offers) అందిస్తున్న క్రెడిట్ కార్డ్‌లు(Credit Cards) ఏంటో తెలుసుకోండి.
* ICICI బ్యాంక్
మేక్ మై ట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ కాంప్లిమెంటరీ MMTBLACK సభ్యత్వం, రూ. 1,500 మై క్యాష్ ప్లస్‌ను వెల్కమ్ బెనిఫిట్‌గా అందిస్తోంది. రూ.2,500 విలువైన MakeMyTrip హాలిడే వోచర్, కాంప్లిమెంటరీ MMT క్యాబ్‌ల ప్రయోజనాలను పొందే సదుపాయం కల్పిస్తోంది. ఇది సంవత్సరానికి నాలుగు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, నాలుగు డొమెస్టిక్ రైల్వే లాంజ్ యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ కార్డ్‌కు ఎలాంటి వార్షిక రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
* IDFC ఫస్ట్ బ్యాంక్
ఐడీఎఫ్సీ ఫస్ట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ నాలుగు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, త్రైమాసికానికి నాలుగు డొమెస్టిక్ రైల్వే లాంజ్ యాక్సెస్‌ను అందిస్తుంది. కార్డ్ హోల్డర్ రూ.22,500 విలువైన సమగ్ర ప్రయాణ బీమాను పొందుతారు. ఇది రూ.20,000 వరకు ఖర్చు చేసే ఆఫ్‌లైన్, ఆన్లైన్ కొనుగోళ్లపై 6x, 3x రివార్డ్ పాయింట్లను అందిస్తుంది. రూ.20,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే 10x రివార్డ్ పాయింట్లను అందిస్తుంది. ప్రయాణ ఆఫర్లపై సేకరించిన రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేయవచ్చు. ఈ కార్డ్‌కు ఎలాంటి వార్షిక రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
* SBI కార్డ్
ఐఆర్సీటీసీ ఎస్బీఐ కార్డ్ ప్రీమియర్ క్రెడిట్ కార్డ్ రైల్వే టిక్కెట్ బుకింగ్‌లపై ఒక శాతం ఆదా, ఎయిర్‌లైన్ టిక్కెట్ బుకింగ్‌లపై 1.8 శాతం ఆదాను అందిస్తుంది. ఇది సంవత్సరానికి ఎనిమిది దేశీయ రైల్వే లాంజ్ యాక్సెస్‌లను కూడా అందిస్తుంది. IRCTC యాప్ లేదా వెబ్సైట్ ద్వారా AC కోచ్‌లు, చైర్ కార్లలో టిక్కెట్లను బుక్ చేసుకోవడంపై కార్డ్ హోల్డర్ 10 శాతం విలువను తిరిగి రివార్డ్ పాయింట్లుగా పొందుతారు. ఈ కార్డుకు వార్షిక రుసుము రూ.1,499 చెల్లించాలి.
* Axis బ్యాంక్
యాక్సిస్ విస్తారా సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు కాంప్లిమెంటరీ క్లబ్ విస్తారా సిల్వర్ మెంబర్షిప్, నాలుగు కాంప్లిమెంటరీ ప్రీమియం ఎకానమీ టిక్కెట్లను అందిస్తుంది. ఇది ఖర్చు చేసిన ప్రతి రూ.200కి నాలుగు క్లబ్ విస్తారా పాయింట్లను కూడా అందిస్తుంది. కార్డ్ హోల్డర్ ప్రతి త్రైమాసికానికి రెండు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్‌లను పొందుతారు. ఈ కార్డుపై వార్షిక రుసుము రూ.3,000 చెల్లించాలి.
* Citibank
సిటీ ప్రీమియర్ మైల్స్ క్రెడిట్ కార్డ్ త్రైమాసికంలో ఎనిమిది దేశీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్, భాగస్వామి రెస్టారెంట్లలో 20 శాతం రాయితీని అందిస్తుంది. ఎయిర్‌లైన్ ఖర్చుల కోసం వెచ్చించే రూ.100కి 10 మైళ్లు సంపాదించవచ్చు. 100 హోటల్లు, ఎయిర్‌లైన్ భాగస్వాములకు పైగా మైళ్లను రీడీమ్ చేయవచ్చు. సేకరించిన మైళ్ల వినియోగానికి గడువు ఉండదు. ఈ కార్డుపై వార్షిక రుసుము రూ.3,000.
క్రెడిట్ కార్డ్‌లను తెలివిగా, బాధ్యతాయుతంగా ఉపయోగించడం చాలా కీలకం. క్రెడిట్ కార్డ్‌లు గణనీయమైన వడ్డీ-రహిత వ్యవధిని అందిస్తాయి. తిరిగి చెల్లించగలిగే దానికంటే ఎక్కువ ఖర్చు చేసి, క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో చెల్లించ లేకపోతే, మీకు ఆలస్య చెల్లింపు రుసుములతో పాటు సంవత్సరానికి 28- 49 శాతం వరకు భారీ వడ్డీ విధిస్తారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.