ఏదైనా అవసరాలకు అదనంగా డబ్బు అవసరమైనప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్న తక్షణ మార్గాలు క్రెడిట్ కార్డులు (Credit Cards) లేదా పర్సనల్ లోన్‌లు(Personal Loans). ఈ రెండింటి ద్వారా అవసరాలను తీర్చుకొని తిరిగి వాయిదాలలో చెల్లించవచ్చు. అయితే రెండింటిలో ఏది వినియోగించడం మేలు, దేనికి తక్కువ వడ్డీ(Low Interest Rates) చెల్లించాల్సి వస్తుందనే విషయాన్ని తెలుసుకోవడం ప్రధానం. ఎప్పటికప్పుడు క్రెడిట్ కార్డ్(Credit Card) మార్కెట్ అభివృద్ధి చెందుతోంది. ఆర్థిక సేవల్లో కీలకంగా మారుతోంది. మిలీనియల్స్ ప్రతిష్టాత్మక లక్ష్యాలతో పాటుగా కొత్త క్రెడిట్ కస్టమర్లలో(Customers) గణనీయమైన పెరుగుదలను నమోదు చేస్తోంది. విస్తృతమవుతున్న డిజిటల్(Digital) సేవలతో ప్రజలు తమ అవసరాల నిమిత్తం క్రెడిట్ కార్డ్ కోసం వెంటనే దరఖాస్తు చేసుకోగలుగుతున్నారు.
చాలా సందర్భాల్లో ప్రజలకు అదనంగా డబ్బు అవసరం అవుతుంది. విదేశాల పర్యటన, స్థానికంగా చేపట్టిన పర్యటన పొడిగింపు, పెళ్లి, వివిధ గాడ్జెట్‌ల కొనుగోలు, ఫర్నిచర్ కొనుగోలు, ఇంటిని పునరుద్ధరించడం వంటి పనులకు అదనంగా నగదు అవసరం అవుతుంది.
* క్రెడిట్ కార్డ్ వర్సెస్ పర్సనల్ లోన్
క్రెడిట్ కార్డ్ లేదా వ్యక్తిగత రుణం(Personal Loan) ద్వారా డబ్బు అవసరాలను తీర్చుకొనే అవకాశం ఉంది. అయితే ఈ రెండు మంజూరు కావడానికి తిరిగి చెల్లించే సామర్థ్యం, నిధులు, ఉద్యోగం వంటివి పరిశీలిస్తారు. క్రెడిట్ హిస్టరీ ఆధారంగా బ్యాంకులు క్రెడిట్ కార్డ్‌ను గానీ, పర్సనల్ లోన్‌ను గానీ అందిస్తాయి. క్రెడిట్ హిస్టరీలో లోపాలు ఉన్నవారికి ఎటువంటి రుణం మంజూరు కాదు. క్రెడిట్ కార్డ్‌లు, వ్యక్తిగత రుణాలు రెండూ అసురక్షిత క్రెడిట్ సౌకర్యాలు. అయితే వాటి స్ట్రక్చర్ భిన్నంగా ఉంటుంది. క్రెడిట్ కార్డ్ రివాల్వింగ్ క్రెడిట్‌ను అందిస్తుంది, ఇది గడువు తేదీలో లేదా అంతకు ముందు బిల్లులు చెల్లిస్తే, మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు.
మరోవైపు పర్సనల్ లోన్ తీసుకొన్న వ్యక్తులు ఒకేసారి ఆ మొత్తాన్ని ఉపయోగించుకోవాలి. లోన్ మొత్తాన్ని మంజూరు చేయడానికి ముందు రుణగ్రహీత , రుణదాత మధ్య అంగీకరించిన షెడ్యూల్ ప్రకారం తిరిగి వాయిదాల ప్రకారం డబ్బును చెల్లించాలి. సక్రమంగా వాయిదాలలో నగదు చెల్లించలేక పోతే అదనంగా వడ్డీ వసూలు చేస్తారు. ఇది క్రెడిట్ హిస్టరీపై ప్రభావం చూపుతుంది.
* రెండింటికీ పోలిక..
పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డుకు పోలికలను ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఓ వ్యక్తికి విదేశీ విహారయాత్రకు, ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి, ఇంట్లో చిన్న చిన్న అవసరాలకు రూ.5 లక్షలు అవసరం. అతనికి నెలవారీ ఆదాయం రూ. 80,000. క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నాడు. క్రెడిట్ కార్డ్‌తో విమాన టిక్కెట్‌లు , హోటల్ రిజర్వేషన్‌లను బుక్ చేసుకోవచ్చు, స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు, ఇంటి అభివృద్ధికి అవసరమైన మెటీరియల్‌ని కూడా కొనుగోలు చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ ద్వారా ఖర్చు చేసిన మొత్తాన్ని సమానమైన నెలవారీ వాయిదాలుగా (EMI)లుగా విభజించుకొని చెల్లించవచ్చు.
Business Idea: ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే సర్కార్ సాయం.. లక్షల కొద్దీ సంపాదన.. తెలుసుకోండి
చాలా బ్యాంకులు పెద్ద టికెట్ ట్రాన్సాక్షన్‌లపై ప్రాసెసింగ్ రుసుము విధించకుండా చిన్న EMIలుగా విభజించుకొనేందుకు అనుమతిస్తాయి. ఉదాహరణకు 6 రాత్రులు, 7 రోజుల విదేశీ పర్యటనకు హోటల్ రిజర్వేషన్‌లు, విమాన టిక్కెట్ బుకింగ్‌ల మొత్తం రూ.2.5 లక్షలు వచ్చింది. ఈ మొత్తాన్ని 14 శాతం వడ్డీ చొప్పున 24 నెలల EMI స్ట్రక్చర్‌గా మార్చుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి నెలా తిరిగి చెల్లించాల్సిన మొత్తం రూ.12,003.
24 నెలల్లో క్రెడిట్ కార్డ్‌తో రూ.5 లక్షల విలువై ట్రాన్సాక్షన్‌లు చేసి ఉన్నారు అనుకొంటే.. అదే మొత్తాన్ని పర్సనల్ లోన్‌గా తీసుకొని ఉంటే ఎంత వడ్డీ చెల్లించాలనే అంశం పరిశీలిస్తే. పర్సనల్ లోన్ వడ్డీ కంటే క్రెడిట్ కార్డ్‌పై వచ్చే వడ్డీ తక్కువగా ఉంటుంది.
Money Tips: అప్పుల్లో మునిగిపోకుండా జాగ్రత్త పడాలనుకుంటున్నారా..అయితే ఈ టిప్స్ పాటించండి..
* ఏ క్రెడిట్ లైన్ ఎంచుకోవాలి?
రెండింటి మధ్య ఎంచుకోవడం అనేది వ్యక్తి తిరిగి చెల్లింపు సామర్థ్యం, అప్పటికే ఉన్న EMIల భారం, భవిష్యత్తులో జరగబోయే ఖర్చులు, నెలవారీ ఖర్చులపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత రుణం కంటే వడ్డీ దాదాపు 26 శాతం తక్కువగా ఉన్నందున క్రెడిట్ కార్డ్ అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా చాలా మంది రుణదాతలు ముందస్తు ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేస్తారు. ఇది వ్యక్తిగత రుణ మొత్తంలో 0.99 శాతం నుండి 1.99 శాతం వరకు ఉంటుంది. ఇది క్రెడిట్ కార్డ్ ఎంపికను మరింత ప్రయోజనకరంగా చేస్తుంది.అయితే కొన్ని ఖర్చులు, అధిక జీవన వ్యయం కారణంగా మొదటి సంవత్సరానికి రూ.34,365ల EMI లను చెల్లించలేకపోతే వ్యక్తిగత రుణాన్ని ఎంచుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Credit card, Personal Finance, Personal Loan