Home /News /business /

CREDIT CARD RULES CHANGE FROM JULY 1 NEED TO REMEMBER THESE THINGS UMG GH

Credit Card Rules: జూలై 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్.. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

క్రెడిట్ కార్డ్

క్రెడిట్ కార్డ్

జూలై 1 నుంచి క్రెడిట్ కార్డ్‌ల జారీ, బిల్లింగ్, కార్డ్‌లను క్లోజ్‌ చేయడానికి సంబంధించిన కొత్త నియమాలు అమలులోకి వస్తాయి. కొత్త క్రెడిట్ కార్డ్ నియమాలు భారతదేశంలో పనిచేస్తున్న అన్ని షెడ్యూల్ బ్యాంక్స్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు(NBFC) వర్తిస్తాయి.

ఇంకా చదవండి ...
జూలై 1 నుంచి క్రెడిట్ కార్డ్‌ల జారీ, బిల్లింగ్, కార్డ్‌లను క్లోజ్‌ చేయడానికి సంబంధించిన కొత్త నియమాలు అమలులోకి వస్తాయి. కొత్త క్రెడిట్ కార్డ్ నియమాలు భారతదేశంలో పనిచేస్తున్న అన్ని షెడ్యూల్ బ్యాంక్స్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు(NBFC) వర్తిస్తాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (క్రెడిట్ కార్డ్. డెబిట్ కార్డ్ - ఇష్యూయెన్స్‌, కండక్ట్‌) ఆదేశాలు, 2022 ప్రకారం సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది.

** జూలై 1 నుంచి అమలులోకి వచ్చే క్రెడిట్ కార్డ్ నియమాలు ఇవే..

* వినియోగదారుల అంగీకారం లేకుండా కంపెనీలు క్రెడిట్ కార్డ్ జారీ చేయలేవు
ఆర్‌బీఐ తన కొత్త క్రెడిట్ కార్డ్ నిబంధనలలో వినియోగదారుల అంగీకారం లేకుండా క్రెడిట్ కార్డ్‌ల జారీని నిషేధించింది. ఒకవేళ గ్రహీత స్పష్టమైన సమ్మతి లేకుండా ఒక కార్డ్ జారీ చేసినా, ఉన్న కార్డ్ అప్‌గ్రేడ్ చేసినా, యాక్టివేట్ చేసి ఉంటే కార్డ్-జారీ చేసిన కంపెనీ వెంటనే ఛార్జీలను రివర్స్ చేయడమే కాకుండా, ఎటువంటి సందేహం లేకుండా పెనాల్టీని కూడా చెల్లించాలి. రివర్స్ చేసిన ఛార్జీల విలువ కంటే రెండు రెట్లు ఎక్కువ మొత్తంలో వినియోగదారుకు అందించాలని ఆర్‌బీఐ తెలిపింది. అదనంగా వినియోగదారుడు ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ను కూడా ఫిర్యాదు చేయవచ్చు. అతను కార్డు జారీ చేసిన కంపెనీ చెల్లించాల్సిన పరిహారం మొత్తాన్ని నిర్ణయిస్తారు. క్రెడిట్ కార్డ్‌లను ఉచితంగా జారీ చేసేటప్పుడు ఛార్జీలు ఉండవు.

* అభ్యర్థనపై క్రెడిట్‌ కార్డ్‌ క్లోజ్‌ చేయకపోతే భారీ జరిమానా
క్రెడిట్ కార్డ్-జారీ చేసిన కంపెనీలు తమ క్రెడిట్ కార్డ్‌లను క్లోజ్‌ చేయమని కార్డ్ హోల్డర్ల నుంచి వచ్చిన ఏదైనా అభ్యర్థనను ఏడు పని దినాలలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ క్లోజ్‌ చేసిన తర్వాత వెంటనే కార్డ్ హోల్డర్‌కు ఇమెయిల్, SMS ద్వారా సమాచారం తెలపాలని ఆర్‌బీఐ తన మార్గదర్శకాలలో పేర్కొంది. కార్డు జారీ చేసిన కంపెనీ ఏడు పనిదినాల్లోగా కార్డ్‌ను క్లోజ్‌ చేయడంలో విఫలమైతే ఆలస్యానికి రోజుకు రూ.500 జరిమానా చెల్లించాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

* క్రెడిట్ బ్యాలెన్స్ కార్డ్ హోల్డర్ ఖాతాలో జమ
కార్డ్ హోల్డర్ ఖాతాలో క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే, కొత్త నిబంధనల ప్రకారం వారి బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది. క్రెడిట్ కార్డ్ ఖాతాను మూసివేసిన తర్వాత, క్రెడిట్ కార్డ్ ఖాతాలలో అందుబాటులో ఉన్న ఏదైనా క్రెడిట్ బ్యాలెన్స్ కార్డ్ హోల్డర్ బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. కార్డ్ కంపెనీల వద్ద కస్టమర్ల ఇతర బ్యాంక్ అకౌంట్ వివరాలు అందుబాటులో లేకుంటే, కార్డ్ హోల్డర్ బ్యాంక్ ఖాతా వివరాలను కంపెనీలే సొంతంగా పొందాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

* క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ని ఎంచుకోండి
క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్ అనేది క్రెడిట్ కార్డ్ బిల్లును రూపొందించే టైమ్‌ ఫ్రేమ్‌గా చెప్పవచ్చు. జూలై 1 నుంచి, క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్ మునుపటి నెల 11వ తేదీన ప్రారంభమవుతుంది, ప్రస్తుత నెల 10వ తేదీన ముగుస్తుంది. కార్డ్-జారీదారులు జారీ చేసిన అన్ని క్రెడిట్ కార్డ్‌లకు ప్రామాణిక బిల్లింగ్ సైకిల్‌ను అనుసరించరు. ఈ విషయంలో సౌలభ్యాన్ని అందించడానికి, కార్డ్ హోల్డర్‌లు వారి సౌలభ్యం ప్రకారం క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ను సెలక్ట్‌ చేయాలి.

* క్రెడిట్ కార్డ్ కంపెనీలు తప్పుడు బిల్లులను పంపలేవు
క్రెడిట్ కార్డ్ కంపెనీలు తప్పుడు బిల్లులను పంపలేవు. ఒకవేళ కార్డుదారులు ఏదైనా బిల్లుకు సంబంధించి ఫిర్యాదు చేస్తే.. సంబంధిత సంస్థ వివరణను అందిస్తుంది. ఫిర్యాదు తేదీ నుంచి గరిష్టంగా 30 రోజుల వ్యవధిలోగా డాక్యుమెంటరీ సాక్ష్యాలను కార్డ్ హోల్డర్‌కు అందించాలి.
Published by:Mahesh
First published:

Tags: Banks, Credit card, Debit card, New rules

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు