Credit Card: క్రెడిట్ కార్డ్ కావాలా? సెలెక్ట్ చేసుకోండి ఇలా...

Credit Cards | సరైన క్రెడిట్ కార్డ్ ఎంచుకోకపోతే బెనిఫిట్స్ పూర్తిగా పొందలేరు. అనవసరంగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. అందుకే క్రెడిట్ కార్డ్ ఎంచుకునేప్పుడు కొంచెం అధ్యయనం చేయడం మంచిది.

news18-telugu
Updated: May 3, 2019, 5:03 PM IST
Credit Card: క్రెడిట్ కార్డ్ కావాలా? సెలెక్ట్ చేసుకోండి ఇలా...
Credit Card: క్రెడిట్ కార్డ్ కావాలా? సెలెక్ట్ చేసుకోండి ఇలా... (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: May 3, 2019, 5:03 PM IST
క్రెడిట్ కార్డ్... ఈ రోజుల్లో అందరికీ అవసరమైపోయింది. ఉద్యోగులు, వ్యాపారులు క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారు. ఒకప్పుడు క్రెడిట్ కార్డ్ దొరకడం అంత సులువయ్యేది కాదు. ఇప్పుడు బ్యాంకులు పోటీపడి మరీ క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI లెక్కల ప్రకారం 2018 డిసెంబర్ నాటికి 4.42 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయని అంచనా. ఏటేటా క్రెడిట్ కార్డులు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే బ్యాంకులు వందల రకాల క్రెడిట్ కార్డులు ఆఫర్ చేస్తుంటాయి. వీటిలో ఏది ఎంచుకోవాలో అవగాహన లేక ఏదో ఓ కార్డు తీసుకోవడం చాలామందికి అలవాటు. సరైన క్రెడిట్ కార్డ్ ఎంచుకోకపోతే బెనిఫిట్స్ పూర్తిగా పొందలేరు. అనవసరంగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. అందుకే క్రెడిట్ కార్డ్ ఎంచుకునేప్పుడు కొంచెం అధ్యయనం చేయడం మంచిది. మరి ఎవరు ఎలాంటి క్రెడిట్ కార్డులు ఎంచుకోవాలో తెలుసుకోండి.

విద్యార్థులు: విద్యార్థులకు యాన్యువల్ ఛార్జీలు లేకుండా క్రెడిట్ కార్డులు ఆఫర్ చేసే బ్యాంకులున్నాయి. విద్యార్థులు అలాంటివి తీసుకోవడం మంచిది. లేదంటే తమ తల్లిదండ్రులకు ఉన్న క్రెడిట్ కార్డులకే యాడ్ ఆన్ కార్డులు తీసుకోవచ్చు. యాడ్ ఆన్ కార్డులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు.

Read this: Amazon-SBI offer: అమెజాన్‌లో ఈ 8 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్... ఎస్‌బీఐ కార్డుపై 10 శాతం డిస్కౌంట్

how to choose credit card, credit cards, compare credit cards, best credit cards, how to decide which credit card to use, which credit card is suitable for me, credit card tips, credit card tips for beginners, credit card tips india, first time credit card tips, క్రెడిట్ కార్డ్, బెస్ట్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ టిప్స్, క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్, క్రెడిట్ కార్డ్ రివార్డ్స్, స్టూడెంట్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లిమిట్



యువత: యువత వినోదానికి ఎక్కువగా ప్రియార్టీ ఇస్తుంది. కాబట్టి కార్డు ఎంచుకునే విషయంలో ఇలాంటి అంశాలనే పరిగణలోకి తీసుకోవాలి. రెస్టారెంట్లు, ట్రావెల్, సినిమా టికెట్లపై రివార్డ్ పాయింట్లు ఎక్కువగా ఇచ్చే క్రెడిట్ కార్డులు తీసుకోవాలి. యువతకు క్రెడిట్ కార్డులపై మంచి ఆఫర్లు ఇస్తుంటాయి బ్యాంకులు.

తక్కువ జీతం ఉండే వ్యక్తులు: ప్రతీ క్రెడిట్ కార్డుకు వార్షిక ఫీజు ఉంటుంది. రూ.250 నుంచి యాన్యువల్ ఛార్జీలు మొదలవుతాయి. మీ జీతం తక్కువైతే యాన్యువల్ ఛార్జీలు తక్కువగా ఉండే క్రెడిట్ కార్డులే ఎంచుకోండి. ఎక్కువ ఛార్జీలు వసూలు చేసే కార్డుల వల్ల జేబుకు నష్టం తప్ప లాభం ఉండదు. రివార్డ్ పాయింట్స్ వచ్చే కార్డు ఎంచుకోవాలి.

ఉద్యోగులు: వేతనజీవులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు బ్యాంకులు పోటీపడుతుంటాయి. వారి జీతాన్ని బట్టి క్రెడిట్ కార్డులు, క్రెడిట్ లిమిట్ ఆఫర్ చేస్తుంటాయి. అయితే ఇలాంటి ఉద్యోగులు తమ అవసరాలకు తగ్గట్టుగా క్రెడిట్ కార్డులు ఎంచుకోవాలి. ట్రావెల్, రెస్టారెంట్, ఎంటర్‌టెన్‌మెంట్, షాపింగ్... ఇలా ప్రతీదానికి ఓ కార్డు ఉంటుంది. మీ ఖర్చు ఎక్కువగా ఏదుంటే అలాంటి కార్డు ఎంచుకోవాలి.
Loading...
Read this: Realme Rs.1 Sale: ఒక్క రూపాయికే సొంతం చేసుకోండి టెక్ బ్యాక్ ప్యాక్... కొనండి ఇలా

how to choose credit card, credit cards, compare credit cards, best credit cards, how to decide which credit card to use, which credit card is suitable for me, credit card tips, credit card tips for beginners, credit card tips india, first time credit card tips, క్రెడిట్ కార్డ్, బెస్ట్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ టిప్స్, క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్, క్రెడిట్ కార్డ్ రివార్డ్స్, స్టూడెంట్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లిమిట్
(ప్రతీకాత్మక చిత్రం)


మహిళలు: కేవలం మహిళలు, వారి లైఫ్‌స్టైల్‌కు తగ్గట్టుగా కార్డులు అందిస్తాయి బ్యాంకులు. రీటైల్ స్టోర్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫుడ్, ట్రావెల్‌పై ఖర్చు చేసే మహిళలకు అదనంగా రివార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉంటాయి.

చిరు వ్యాపారులు: ఉద్యోగులకు మాత్రమే కాదు... చిరు వ్యాపారులకు కూడా వారి ఆదాయం, టర్నోవర్ పరిశీలించి బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఇస్తాయి. వార్షిక ఛార్జీలు తక్కువగా ఉండటం, వడ్డీ లేకపోవడంతో ఈ క్రెడిట్ కార్డులు చిరు వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే వీరికి రివార్డ్ పాయింట్స్ అంతగా ఉండవు.

వృద్ధులు: రిటైరైన వారికి కూడా వారి ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ లేదా రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌పై బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఇస్తాయి. వారి ఇన్వెస్ట్‌మెంట్ ఎంత ఉంటే అంత క్రెడిట్ లిమిట్ ఉంటుంది.

Photos: బిల్‌బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్‌లో మెరిసిన అందాల తారలు

ఇవి కూడా చదవండి:

PAN Card: పాన్ కార్డు దరఖాస్తు... ఈ 10 తప్పులు చేయొద్దు

Railway Jobs: రైల్వేలో టీచర్ ఉద్యోగాలు... దరఖాస్తు చేసుకోండి ఇలా

LIC Policy: మీ జీతం తక్కువా? ఈ ఎల్‌ఐసీ పాలసీ మీ కోసమే...
First published: May 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...