Credit Card: ఏ క్రెడిట్ కార్డు తీసుకోవాలా అని ఆలోచిస్తున్నారా?.. అయితే వీటి ఆధారంగా ఎంచుకోండి.. 

ప్రతీకాత్మక చిత్రం

మార్కెట్లో దాదాపు 130 రకాల కార్డులు ఉన్నాయి. అందులో మీకు నప్పే కార్డు ఏంటో ఎంచుకొని దాన్నే తీసుకోవాలి. క్రెడిట్ కార్డును ఎంచుకునే ముందు ఎలాంటి విషయాలు గమనించాలంటే..

  • Share this:
డిజిటల్ పేమెంట్ సిస్టమ్‌కు ఆదరణ లభించిన తరువాత క్రెడిట్ కార్డులను వాడేవారి సంఖ్య భారీగా పెరిగింది. బ్యాంకులు తక్కువ ఛార్జీలతో, స్పెషల్ ఆఫర్లతో క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయనే ఉద్దేశంతో.. అవసరం లేకున్నా తీసుకుంటారు చాలామంది ఖాతాదారులు. అయితే క్రెడిట్ కార్డు ద్వారా లభించే ప్రయోజనాల గురించి తెలుసుకున్న తరువాతే వాటిని ఎంచుకోవాలి. మార్కెట్లో దాదాపు 130 రకాల కార్డులు ఉన్నాయి. అందులో మీకు నప్పే కార్డు ఏంటో ఎంచుకొని దాన్నే తీసుకోవాలి. క్రెడిట్ కార్డును ఎంచుకునే ముందు ఎలాంటి విషయాలు గమనించాలంటే..

డిస్కౌంట్లు, బెనిఫిట్స్.. 
కొన్ని కార్డుల ద్వారా పేమెంట్ చేస్తే రెస్టారెంట్లలో, పెట్రోల్ బంకుల్లో డిస్కౌంట్లు వర్తిస్తాయి. మరికొన్ని కార్డులు రివార్డు పాయింట్లు అందిస్తాయి. కొన్నేళ్ల క్రితం సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లన్నింటినీ హోటల్ రూమ్ బుకింగ్స్ గా మార్చుకునే పద్ధతిని అందించింది. ఇలాంటి ఫీచర్లు ఎక్కువ మంది కార్డులు తీసుకునేలా చేస్తాయి. మీ అవసరాలకు తగినట్లుగా ఉండే కార్డులను ఎంచుకోవాలి. కొన్ని కార్డులు మీ రివార్డు పాయింట్లను ఎయిర్ లైన్స్ టికెట్స్ తీసుకునే అవకాశాన్ని అందిస్తాయి. మీరు ఎక్కువగా ప్రయాణం చేయకపోతే ఇలాంటివి ఎంచుకోవడం సరి కాదు. షాపింగ్ వోచర్ల లాంటివి అందించే కార్డును ఎంచుకోవడం మంచిది.

క్యాష్ బ్యాక్, రివార్డ్స్..
రివార్డ్ పాయింట్స్ మీ క్రెడిట్ కార్డుకు బోనస్ లాంటివి. మీరు ఎంత డబ్బు ఖర్చు చేస్తారో అన్ని రివార్డ్ పాయింట్లు వస్తాయి. ఉదాహరణకు హెచ్ డీఎఫ్ సీ ఇన్పినియా క్రెడిట్ కార్డును ఎంచుకుంటే ప్రతి రూ.150 ఖర్చు చేస్తే 5 రివార్డు పాయింట్లు అందుతాయి. స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు కూడా ఉంటాయి. అందుకే ఈ కార్డుపై పెద్ద పెద్ద వస్తువులు కొనడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కానీ సిటీ బ్యాంక్ క్యాష్ బాక్ కార్డ్ చాలా తక్కువ క్యాష్ బ్యాక్ ఇస్తూ మీ సేవింగ్స్ పెంచడానికి ప్రయత్నిస్తుంది. చిన్న చిన్న వస్తువులను కొనుగోలు చేసేవారి కోసం ఇది చక్కటి ఎంపిక.

ఇంటర్నేషనల్ బెనిఫిట్స్..
కొన్ని క్రెడిట్ కార్డులు ఇతర అదనపు ఖర్చులు లేకుండా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ సేవలను అందిస్తాయి. తరచూ అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారికి అది చాలా ఉపయోగపడుతుంది. కొన్ని ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులు విదేశాల్లో కూడా ఖర్చు చేసేందుకు సహాయపడతాయి. కానీ కరెన్సీ ఎక్ఛ్సేంజ్ ఛార్జీలను కూడా గమనించాల్సి ఉంటుంది. మీ ఖర్చును ఇండియన్ రూపాయల్లో కన్వర్ట్ చేసి వడ్డీ వేస్తుంది. ఇది సాధారణంగా మూడు శాతంగా ఉంటుంది. అయితే ఎస్బీఐ ఎలైట్, హెచ్డీఎఫ్సీ ఇన్ఫినియా కాస్త తక్కువగా అంటే రెండు శాతం ఛార్జీలను వేస్తాయి. తరచూ విదేశాలకు వెళ్లే వారు దీన్ని ఎంచుకోవడం మంచిది.

ఇతర ఫీచర్స్..
కొన్ని క్రెడిట్ కార్డులపై ఇతర ఫీచర్లు కూడా లభిస్తాయి. ఇన్స్యూరెన్స్ కవర్, ఇతర సర్వీసులు అందిస్తాయి. కొన్ని లక్షల రూపాయల ట్రావెల్, హెల్త్ ఇన్స్యూరెన్స్ ని ఇవి ఉచితంగా అందిస్తాయి. ఒకవేళ కార్డు పోగొట్టుకున్నా, అనుకోకుండా హాస్పిటల్లో చేరాల్సి వచ్చినా కొన్ని కార్డులు సహాయం అందిస్తాయి. అయితే ఇవన్నీ ఒకే కార్డులో రావు కాబట్టి మీకు ఎలాంటి ప్రయోజనాలు కావాలో ఎంచుకొని అది అందించే కార్డును ఎంచుకోవాలి. ఈ సర్వీసులు మీరు వేరే నగరాల్లో హాలిడేస్, గిఫ్టులు, డిన్నర్ రిజర్వేషన్ల కోసం ఉపయోగించుకోవచ్చు.

బెనిఫిట్స్ అన్నింటినీ చూసి క్రెడిట్ కార్డును తీసుకోవడం ఆనందంగానే ఉంటుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. క్రెడిట్ కార్డు తీసుకోవడం అంటే ఒక రుణం తీసుకుంటున్నట్లే. ఒకవేళ మీరు పేమెంట్ సరైన సమయానికి కట్టకపోతే వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎన్ని అదనపు బెనిఫిట్స్ ఉన్నా కానీ కార్డుతో జాగ్రత్తగా ఉండడం మంచిది.
Published by:Sumanth Kanukula
First published: