Credit Card: క్రెడిట్ కార్డుపై మీరు చెల్లిస్తున్న వడ్డీ ఎంతో తెలిస్తే షాకే

Credit Card Interest Rates | క్రెడిట్ కార్డుపై బ్యాంకుకు చెల్లించే వడ్డీ రేట్లు ఎంతో తెలుసుకుంటే షాకవ్వాల్సిందే. పర్సనల్ లోన్ వడ్డీ రేట్ల కన్నా క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ రెండుమూడు రెట్లు ఎక్కువగా ఉంటాయి.

news18-telugu
Updated: February 19, 2020, 5:25 PM IST
Credit Card: క్రెడిట్ కార్డుపై మీరు చెల్లిస్తున్న వడ్డీ ఎంతో తెలిస్తే షాకే
Credit Card: క్రెడిట్ కార్డుపై మీరు చెల్లిస్తున్న వడ్డీ ఎంతో తెలిస్తే షాకే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్నారా? క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని ఈఎంఐలపై వస్తువులు కొంటున్నారా? నెలనెలా ఈఎంఐలు చెల్లిస్తున్నారా? ఈఎంఐలు కడుతున్నారు సరే... వడ్డీ ఎంత చెల్లిస్తున్నారో ఎప్పుడైనా గమనించారా? పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ రేట్లకు క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లకు ఎంత తేడా ఉందో ఎప్పుడైనా లెక్క చేశారా? ఇవేవీ మీకు తెలియకపోతే భారీగా నష్టపోతున్నట్టే. క్రెడిట్ కార్డుపై మీరు చెల్లిస్తున్న వడ్డీ ఎంతో తెలుసా? బ్యాంకును బట్టి వార్షికంగా 15 నుంచి 46 శాతం వరకు ఉంటాయి. అంటే క్రెడిట్ కార్డుపై మీరు రూ.10,000 ఖర్చుపెట్టి ఈఎంఐగా కన్వర్ట్ చేస్తే మీరు చెల్లించే వడ్డీ రూ.1,500 నుంచి రూ.4600 మధ్య ఉంటుంది. ఈ వడ్డీ బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. అందుకే క్రెడిట్ కార్డు తీసుకునే ముందు వడ్డీ రేటు ఎంత ఉందని తప్పనిసరిగా గమనించాలి. లేకపోతే తర్వాత వడ్డీలు చెల్లించలేక తిప్పలు పడాల్సి వస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు క్రెడిట్ కార్డులపై ప్రస్తుతం వసూలు చేస్తున్న వడ్డీ రేట్లు తెలుసుకునేందుకు ఈ చార్ట్ చూడండి.

Credit Card Interest Rates, credit card interest rate hdfc, credit card interest rate sbi, what is credit card interest rate, Credit Card benefits, Credit Card disadvantages, క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ రేట్, క్రెడిట్ కార్డ్ లాభాలు, క్రెడిట్ కార్డు నష్టాలు
Source: bankbazaar.com


క్రెడిట్ కార్డుపై మీరు చేసే కొనుగోళ్లకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఉంటుంది. అంటే కొన్ని రోజులు వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. కనీసం 20 రోజుల నుంచి 50 రోజుల వరకు వడ్డీ లేకుండా తప్పించుకోవచ్చు. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అయ్యే తేదీ ప్రతీ నెల 10 అనుకుందాం. అంటే మీరు ప్రతీ నెల 11 నుంచి వచ్చే నెల 10 వరకు జరిపే లావాదేవీలన్నీ ఆ నెల స్టేట్‌మెంట్‌లో వస్తాయి. 10వ తేదీన బిల్ జనరేట్ అయితే మీరు 29వ తేదీన బిల్లు చెల్లించాలి. అంటే బిల్లు జనరేట్ అయిన తర్వాత 20 రోజుల గడువు ఉంటుంది. ఒకవేళ మీరు ఈ నెలలో 11వ తేదీన షాపింగ్ చేస్తే ఆ బిల్లు వచ్చే నెల 29న చెల్లించొచ్చు. అలా మీకు 20 నుంచి 50 రోజుల వరకు జీరో ఇంట్రెస్ట్ వర్తిస్తుంది.

Credit Card Interest Rates, credit card interest rate hdfc, credit card interest rate sbi, what is credit card interest rate, Credit Card benefits, Credit Card disadvantages, క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ రేట్, క్రెడిట్ కార్డ్ లాభాలు, క్రెడిట్ కార్డు నష్టాలు
ప్రతీకాత్మక చిత్రం




గడువు లోపు క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లిస్తే వడ్డీ చెల్లించాల్సిన అవసరమే లేదు. అదే గడువు దాటినట్టైతే బ్యాంకు నియమనిబంధనల్లో చెప్పినట్టుగా వడ్డీ వర్తిస్తుంది. అంటే మీరు క్రెడిట్ కార్డ్ బిల్లుతో పాటు వడ్డీ కూడా చెల్లించాలి. ఒకవేళ డబ్బులు లేవని ఈఎంఐగా కన్వర్ట్ చేసినా వడ్డీ చెల్లించాల్సిందే. దాంతో పాటు ఈఎంఐగా కన్వర్ట్ చేసినందుకు ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది. 15 నుంచి 46 శాతం వడ్డీ చెల్లించడమంటే అది మోయలేని భారమే. సాధరణంగా పర్సనల్ వడ్డీ రేటు 10 నుంచి 18 శాతం మధ్య ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ లభిస్తుంది. అదే క్రెడిట్ కార్డ్ వడ్డీ చూస్తే పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ కన్నా రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకసారి మీ బ్యాంకుకు కాల్ చేసి మీ క్రెడిట్ కార్డుకు ఎంత వడ్డీ రేటు ఉందో తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి:

Credit Card: క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి ఈ ప్లాన్‌‌తో అనేక లాభాలుCredit Card: క్రెడిట్ కార్డు ఉందా? ఈ తప్పులు మీరూ చేస్తున్నారా?

Credit Card: మీ క్రెడిట్ కార్డుపై లిమిట్ తక్కువగా ఉంటే పెంచుకోండి ఇలా
First published: February 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు