Home /News /business /

CREDIT CARD INCOME TAX RULES TDS ON CRYPTO 5 FINANCE RULE CHANGES FROM JULY 1 UMG GH

Finance Rule: బీ అలర్ట్..! జులై 1 నుంచి కొత్త ఫైనాన్షియల్ రూల్స్‌.. మార్పులివే..!!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జులై 1వ తేదీ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ప్రారంభాన్ని సూచిస్తుంది. అంటే ఈ నెలలో ఆర్థిక విషయాలకు సంబంధించిన నియమాల మార్పులు ఉంటాయని గమనించాలి. క్రిప్టో ఆస్తులు, క్రెడిట్‌ కార్డులు, టీడీఎస్‌, డీమ్యాట్‌ అకౌంట్ విషయంలో ఈ మార్పులు కనిపించనున్నాయి.

ఇంకా చదవండి ...
జులై నెల ప్రారంభంతో కొన్ని ఆర్థిక (Financial) సంబంధమైన నియమాలలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. క్రిప్టో (Crypto) ఆస్తులు, క్రెడిట్‌ కార్డులు (Credit Card), టీడీఎస్‌ (TDS), డీమ్యాట్‌ అకౌంట్ విషయంలో ఈ మార్పులు కనిపించనున్నాయి. జులై 1వ తేదీ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ప్రారంభాన్ని సూచిస్తుంది. అంటే ఈ నెలలో ఆర్థిక విషయాలకు సంబంధించిన నియమాల మార్పులు ఉంటాయని గమనించాలి. క్రెడిట్ కార్డ్ నిబంధనల మార్పు, ఆదాయపన్ను నియమాల మార్పు, క్రిప్టోకరెన్సీలపై TDS వరకు.. జులైలో అనేక కొత్త ఆర్థిక నియమాలు అమల్లోకి రానున్నాయి. వీటిలో ముఖ్యమైన 5 ఫైనాన్షియల్ రూల్స్ ఏవో తెలుసుకుందాం.

మారిన క్రెడిట్ కార్డ్ రూల్స్‌
జులై 1 నుంచి క్రెడిట్ కార్డ్ క్లోజర్‌, బిల్లింగ్ సైకిల్, ఇతర వాటికి సంబంధించిన నియమాలు మారుతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ - ఇస్యూయన్స్‌, కండక్ట్‌) కింద ఆర్‌బీఐ ఈ నిబంధనలను నోటిఫై చేసింది. క్రెడిట్ కార్డ్ కంపెనీలు వినియోగదారుల స్పష్టమైన అంగీకారం లేకుండా క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయకూడదు. క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్ మునుపటి నెల 11వ తేదీన ప్రారంభమై ప్రస్తుత నెల 10వ తేదీన ముగుస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది. ఏడు పనిదినాల్లోగా కస్టమర్ అభ్యర్థన మేరకు క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయకపోతే, కార్డ్‌ను క్లోజ్‌ చేసేవరకు కంపెనీ కస్టమర్‌కు ప్రతిరోజూ రూ.500 చెల్లించవలసి ఉంటుంది.

పాన్-ఆధార్ లింకింగ్ జరిమానా పెంపు
ఇంకా పాన్ ఆధార్ లింక్ చేసుకోని వారు జులై 1 నుంచి రెండు డాక్యుమెంట్లను లింక్ చేయడానికి ప్రయత్నిస్తే రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 30 వరకు జరిమానా రూ.500గా ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ పాన్- ఆధార్‌ను లింక్ చేయడానికి గడువును మార్చి 23 వరకు పొడిగించింది, అయితే జులై 1 లేదా ఆ తర్వాత ప్రయత్నిస్తే మాత్రం రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

క్రిప్టోకరెన్సీలపై TDS
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT) వర్చువల్ డిజిటల్ ఆస్తులు (VDA) లేదా క్రిప్టో ఆస్తులపై టీడీఎస్‌(TDS) విధింపుపై వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త నియమాలు జులై 1 నుంచి అమలులోకి వస్తాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వర్చువల్ ఆస్తుల బదిలీపై చేసిన చెల్లింపులపై 1 శాతం టీడీఎస్‌ నిబంధనను ప్రవేశపెట్టారు.

డాక్టర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు ఆదాయపన్ను నిబంధనల మార్పు
కంపెనీల నుంచి ఉచితంగా వస్తువులు పొందే వైద్యులు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, ఇతర వ్యక్తులు వాటిని స్వీకరించేందుకు జులై 1 నుంచి పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ఆదాయ పన్ను శాఖ ప్రకటించింది. ఆర్థిక చట్టం 2022, ఆదాయ పన్ను చట్టం, 1961లో కొత్త సెక్షన్ 194Rని తీసుకొచ్చింది. దీని ప్రకారం, ప్రయోజనాలు పొందేవారు 10 శాతం చొప్పున TDS చెల్లించాలి.

డీమ్యాట్ KYC రూల్ మార్పు
డీమ్యాట్ అకౌంట్ కోసం మీ KYCని అమలు చేయడానికి గడువు జూన్ 30, ఆ తర్వాత అకౌంట్ డీయాక్టివేట్ అవుతుంది. KYCని పేరు, చిరునామా, PAN, చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్, ఆదాయ పరిధి, చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ID వంటి వివరాలతో అప్‌డేట్ చేయాలి. ఇది చేయకుంటే, జులై 1 నుంచి డీమ్యాట్ అకౌంట్ చెల్లదు.
Published by:Mahesh
First published:

Tags: Bank, Credit card, Taxes, Tds

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు