CREDIT CARD CREDIT CARD USAGE IS NOT WRONG EXPERTS SAY IT REQUIRES AWARENESS ON HOW TO USE IT WISELY GH EVK
Credit Card: క్రెడిట్ కార్డు వాడకం తప్పేం కాదు.. తెలివిగా ఉపయోగించడంపై అవగాహన అవసరం అంటున్న నిపుణులు
(ప్రతీకాత్మక చిత్రం)
Credit Cards | క్రెడిట్ కార్డ్‌లు చాలా ఉపయోగకరమని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. కానీ అప్పుడప్పుడు కొంతమంది దుర్వినియోగం చేస్తే వారికి చెడ్డ పేరు వస్తుంది. అయినా కొందరు దుర్వినియోగం చేయడం ద్వారా క్రెడిట్ కార్డులు ఉపయోగకరం కాకుండా పోవని గుర్తించాలి.
క్రెడిట్ కార్డ్‌లు(Credit Cards) చాలా ఉపయోగకరమని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. కానీ అప్పుడప్పుడు కొంతమంది దుర్వినియోగం చేస్తే వారికి చెడ్డ పేరు వస్తుంది. అయినా కొందరు దుర్వినియోగం చేయడం ద్వారా క్రెడిట్ కార్డులు ఉపయోగకరం కాకుండా పోవని గుర్తించాలి. క్రెడిట్ కార్డ్‌ల ద్వారా తమకు అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేసేలా ప్రలోభపెట్టగలవని కొందరు భావిస్తున్నారు. కానీ అదే వాస్తవం అయితే.. కార్డ్ హోల్డర్‌తో(Card Holders) సమస్య కానీ.. కార్డులో కాదని నిపుణులు చెబుతున్నారు.
ఓ నిపుణుడు ఓ వ్యక్తిని ఉదాహరణగా తీసుకొని క్రెడిట్ కార్డ్ దుర్వినియోగాన్ని వివరించారు. అతను ఏడు క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నాడు. అతను అన్నింటినీ వినియోగిస్తున్నట్లు కూడా చెప్పాడు. అది కూడా నిర్లక్ష్యంగా వినియోగిస్తున్నట్లు తెలిసి ఆశ్చర్యపోయానని నిపుణుడు చెప్పారు. ఉన్న క్రెడిట్ కార్డుల ద్వారా అధికంగా ఖర్చు చేస్తున్నాడని, ప్రతి నెలా పూర్తి బకాయిలను చెల్లించలేకపోయాడని, కొన్ని సార్లు కనీస బకాయి చెల్లించాడని, కొన్ని నెలలు అతని ఖర్చులు ఎక్కుడ అయినప్పుడు కనీస బకాయిలు కూడా చెల్లించలేక పోయాడని వివరించారు. ఇక్కడ సమస్య కార్డు కాదు. క్రెడిట్ కార్డ్‌ల అధిక వడ్డీ రేట్లు, వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేదానిపై వినియోగదారులకు అవగాహన అవసరం.
డోంట్ బీ మ్యాడ్.. కేవలం MAD చెల్లించండి
క్రెడిట్ కార్డ్ పరిభాషలో MAD (Minimum Amount Due) అంటే 'చెల్లించాల్సిన కనీస మొత్తం’. ఇది కార్డ్ ఖాతాను సక్రమంగా ఉంచుకోవడానికి గడువు తేదీకి ముందు చెల్లించాల్సిన కనీస మొత్తం. కనీస మొత్తాన్ని చెల్లించడం ద్వారా, లేట్ పేమెంట్ ఫీజు తప్పించుకుంటూ క్రెడిట్ స్కోర్‌పై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపకుండా నివారించవచ్చు. ఇప్పటికీ బకాయి ఉన్న వాటిపై వడ్డీని చెల్లించాలి. క్రెడిట్ కార్డ్‌లపై వడ్డీ సంవత్సరానికి దాదాపు 40 శాతం ఉంటుంది.
2. వడ్డీ (నెలకు) రూ.28,500 (రూ.30,000 - రూ. 1,500) వసూలు చేస్తారు.
3. పూర్తి రూ.30,000పై వడ్డీ విధిస్తారు. అదనంగా చెల్లించాల్సిన కనీస మొత్తం (రూ.1,500) కూడా చెల్లించకపోవడంతో ఆలస్య రుసుము కూడా విధిస్తారు.
చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుందని కార్డుదారులు తరచుగా పొరబడుతుంటారు. ఆ విధంగా ఆలస్య చెల్లింపు రుసుమును నివారించవచ్చు. ఇప్పటికీ బకాయి మొత్తంపై అధిక వడ్డీని చెల్లించాల్సిందే.
కార్డ్ బిల్లును పూర్తిగా చెల్లించకపోతే, తదుపరి లావాదేవీలకు వడ్డీ రహిత క్రెడిట్ వ్యవధిని పొందలేరు. ఇది క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై ఆర్థికంగా భారం పెంచుతుంది. రూ.30,000 బిల్లు వచ్చిన తర్వాత, కనీసం రూ. 1,500 మాత్రమే చెల్లిస్తే.. రూ.28,500 బకాయి ఉంది.
ఇప్పుడు క్రెడిట్ కార్డ్‌ని మళ్లీ వినియోగించి.. గడువు తేదీ తర్వాత రూ.15,000 ఖర్చు చేస్తే, ఒక్కరోజు వడ్డీ రహిత వ్యవధి కూడా లభించదు. ట్రాన్సాక్షన్ జరిగిన మొదటి రోజు నుంచే దానిపై వడ్డీ వసూలు చేస్తారు. కాబట్టి రూ.28,500 (అసలు బకాయి) + రూ.15,000 (కొత్త ఖర్చు) + మునుపటి బకాయి నుంచి వడ్డీపై ఎక్కువ వడ్డీని వసూలు చేస్తారు.
వీటన్నింటి చుట్టూ ఏదైనా ట్రిక్ ఉందా?
ఈ రోజుల్లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ప్రోత్సహిస్తున్న విధంగా ఎక్కువ వడ్డీ రహిత కాలాలను పొందడానికి, ఎక్కువ కార్డులను వినియోగించడం సరికాదు. ఖర్చు చేయాలనే కోరికను నియంత్రించడం కష్టమని అనిపిస్తే, కార్డ్‌ల వినియోగాన్ని తగ్గించండి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.