సమర్థంగా ఉపయోగించుకోవడం తెలియాలే కానీ.. క్రెడిట్ కార్డులతో (Credit Cards) ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వీటితో వివిధ రకాల ఉత్పత్తులను కొనుగోలు చేయడం, టిక్కెట్లు బుక్ చేయడం, బిల్లులు చెల్లించడం ద్వారా రివార్డులను (Rewards) సైతం పొందవచ్చు. విస్తృతంగా ఆమోదం పొందడం వల్ల ఇవి ఎక్కడైనా, ఎలాంటి అవసరాలకైనా చెల్లుబాటు అవుతాయి. నెలవారీ అద్దె చెల్లింపులు వంటి రికరింగ్ ఖర్చులకు సైతం క్రెడిట్ కార్డులను (Credit Cards) ఉపయోగిస్తూ లబ్ధి పొందవచ్చు. అయితే చాలామంది యజమానులు క్రెడిట్ కార్డు చెల్లింపులను అంగీకరించరు. ఈ సమస్యకు పరిష్కారం చూపుతోంది క్రెడ్ మాక్స్ (CRED Max) సంస్థ. రెంట్ పేమెంట్ సేవల కోసం ఈ సంస్థ RentPay తో జట్టుకట్టింది. ఇప్పుడు కస్టమర్లు క్రెడిట్ మీద నెలవారీ అద్దె చెల్లింపులు చేయడంతో పాటు భారీ రివార్డులు సైతం పొందవచ్చని క్రెడ్ సంస్థ చెబుతోంది.
నెలవారీ రికరింగ్ ఖర్చుల చెల్లింపులకు క్రెడ్ సంస్థ CRED Max విభాగాన్ని ప్రారంభించింది. ఈ సేవలను ఉపయోగించుకునే వారు ఐప్యాడ్, మాల్దీవుల పర్యటన లేదా 300 శాతం క్యాష్‌బ్యాక్ (మూడు నెలలు అద్దె చెల్లింపులు ఉచితం) వంటి ఆఫర్లను గెలుచుకునే అవకాశం ఉంది. CRED మాక్స్ ద్వారా కస్టమర్లు క్రెడిట్ కార్డు ఖర్చులను పెంచుకోవడంతో పాటు ఎక్కువ రివార్డ్ పాయింట్లను సంపాదించుకోవచ్చు. ఇలా వచ్చిన క్యాష్తో వడ్డీ సైతం సంపాదించవచ్చు. క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లించడం.. క్యాష్ లేదా చెక్ ద్వారా చెల్లించడం కంటే సౌకర్యవంతంగా ఉంటుంది. దీని ద్వారా లభించే రివార్డులతో గృహ వినియోగ ఖర్చులను సైతం కవర్ చేసుకోవచ్చు.
రెంట్ పేమెంట్ వంటి పెద్ద లావాదేవీల కోసం క్రెడిట్ కార్డును తరచుగా ఉపయోగించడం వల్ల క్రెడిట్ స్కోరు సైతం మెరుగవుతుంది. మంచి క్రెడిట్ స్కోర్.. మెరుగైన చెల్లింపు పద్ధతులను సూచిస్తుంది. కస్టమర్లు వివిధ రకాల లోన్లకు అర్హులా కాదా అని నిర్ణయించడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వారి క్రెడిట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి. క్రెడిట్ కార్డు ఉపయోగించే వారు బిల్లులను సకాలంలో చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ మెరుగవుతుంది. మంచి క్రెడిట్ స్కోర్ కోసం కస్టమర్లు సకాలంలో చెల్లింపులు చేయాలి.
మీ క్రెడిట్ కార్డులను ఇప్పటికే సేవ్ చేసినందువల్ల CRED మాక్స్ తక్షణ లావాదేవీలను సులభతరం చేస్తుంది. కస్టమర్లు అద్దె మొత్తం, యజమాని పేరు, వారి బ్యాంక్ వివరాలను నమోదు చేసి తక్షణమే రెంట్ పేమెంట్ చేయవచ్చు. తరువాత కస్టమర్లకు, యజమానులకు SMS ద్వారా నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి నెలా నిర్దిష్ట తేదీన సులభంగా రెంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి చెల్లింపులను ఆటోమేట్ చేయవచ్చు. దీంతోపాటు డిజిటల్ రెంట్ రిసిప్ట్‌లను ఈమెయిల్‌కు సెండ్ చేసుకోవచ్చు. కేవలం మూడు స్టెప్స్‌లోనే క్రెడిట్ కార్డ్ ద్వారా CRED మాక్స్‌తో పాఠశాలలు, కళాశాలల సింగిల్ పేమెంట్ ఖర్చులు, నెలవారీ అద్దె వంటి రికరింగ్ ఖర్చులు చెల్లించవచ్చు. అయితే కస్టమర్లు తమ ఇతర ఖర్చులు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడం మంచిది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.