బంపర్ ఆఫర్...గో మూత్రం‌, పేడ స్టార్టప్స్‌కు కేంద్రం నుంచి 60 శాతం ఫండింగ్...

ప్రతీకాత్మ చిత్రం

ఆవుల పేడ, మూత్రం ఆధారంగా ఎవరైతే ఔత్సాహికులు స్టార్టప్స్ ప్రారంభిస్తారో వారికి 60 శాతం ఫండింగ్ ఇస్తామని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ చైర్మన్ వల్లభ్ కథిరియా ప్రకటించారు.

  • Share this:
    కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రీయ కామధేను ఆయోగ్ వినూత్న పథకాన్ని ప్రకటించింది. దేశంలో ఊపందకుంటున్న స్టార్టప్స్ ద్వారా గోవుల సంరక్షణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆవుల పేడ, మూత్రం ఆధారంగా ఎవరైతే ఔత్సాహికులు స్టార్టప్స్ ప్రారంభిస్తారో వారికి 60 శాతం ఫండింగ్ ఇస్తామని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ చైర్మన్ వల్లభ్ కథిరియా ప్రకటించారు. ముఖ్యంగా యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గో ఆధారిత బిజినెస్ మోడల్స్ కు ప్రోత్సాహం కల్పించేందుకే రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ను ఏర్పాటు చేసి కేంద్రం రూ.500కోట్లు కేటాయించిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

    గో ఆధారిత ఉత్పత్తుల్లో పలు ఔషధ గుణాలున్నాయని, కేవలం పాల ద్వారా మాత్రమే కాకుండా వాటి విసర్జితాల నుంచి కూడా పలు ఉత్పత్తులకు కూడా మంచి డిమాండ్ ఉందని యువతీయువకులు ముందుకు వచ్చి స్టార్టప్స్ ప్రారంభిస్తే కేంద్రప్రభుత్వం నుంచి 60 శాతం నిధులు అందిస్తామని తెలిపారు.
    Published by:Krishna Adithya
    First published: