హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI: మారటోరియం ఎంచుకునేవారికి ఎస్‌బీఐ హెచ్చరిక

SBI: మారటోరియం ఎంచుకునేవారికి ఎస్‌బీఐ హెచ్చరిక

SBI: మారటోరియం ఎంచుకునేవారికి ఎస్‌బీఐ హెచ్చరిక
(ప్రతీకాత్మక చిత్రం)

SBI: మారటోరియం ఎంచుకునేవారికి ఎస్‌బీఐ హెచ్చరిక (ప్రతీకాత్మక చిత్రం)

SBI on moratorium | ఈఎంఐలు వాయిదా వేసేవారికి హెచ్చరికలు జారీ చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. కస్టమర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.

మీరు మారటోరియం ఎంచుకుంటున్నారా? మీ ఈఎంఐలు వాయిదా వేస్తున్నారా? అయితే జాగ్రత్త అంటోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. మారటోరియం ఎంచుకునే కస్టమర్లను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నట్టు బ్యాంకు గుర్తించింది. అందుకే కస్టమర్లను అప్రమత్తం చేసింది. మారటోరియం ఎంచుకోవడానికి, ఈఎంఐలు వాయిదా వేయడానికి ఓటీపీ అవసరం లేదని సూచిస్తోంది ఎస్‌బీఐ. సైబర్ మోసగాళ్లు కస్టమర్లకు కాల్ చేసి లోన్ ఈఎంఐలు వాయిదా వేయడానికి ఓటీపీ చెప్పాలని అడుగుతున్నారు. ఓటీపీ తెలుసుకొని అకౌంట్‌లో ఉన్న డబ్బులు నొక్కేస్తున్నారు. అందుకే ఈఎంఐ వాయిదా వేయడానికి ఓటీపీ షేర్ చేయాల్సిన అవసరం లేదని, ఎవరికీ ఓటీపీ చెప్పొద్దని ఎస్‌బీఐ కస్టమర్లను కోరుతోంది.

సైబర్ నేరగాళ్లు జనాన్ని టార్గెట్ చేస్తూ, వారి డబ్బులు కొట్టేయడానికి ఎప్పుడూ కొత్తకొత్త పద్ధతుల్ని పాటిస్తుండటం మామూలే. కరోనా వైరస్ కారణంగా ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రుణగ్రహీతలకు మూడు నెలల ఈఎంఐలు వాయిదా వేయడానికి ఆర్‌బీఐ మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న నేరగాళ్లు మీ ఈఎంఐలు వాయిదా వేస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకులు కస్టమర్లను ఎప్పుడూ ఓటీపీ అడగవు. అందుకే కస్టమర్లు ఇలాంటి సున్నితమైన సమాచారాన్ని షేర్ చేయకూడదు. మీరు ఎస్‌బీఐ కస్టమర్ అయితే మారటోరియంకు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

Moratorium: మారటోరియంపై బ్యాంకులకు కీలక ఆదేశాలు ఇచ్చిన ఆర్‌బీఐ

EMI moratorium: ఈఎంఐ వాయిదాకు అప్లై చేయండిలా...

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లు వాయిదా వేస్తే ఎంత నష్టమంటే...

Coronavirus: ఆస్పత్రులుగా మారిపోతున్న రైళ్లు... 40,000 ఐసోలేషన్ బెడ్స్ రెడీ

First published:

Tags: Bank loans, Corona, Corona virus, Coronavirus, Covid-19, CYBER CRIME, Home loan, Housing Loans, Lockdown, Personal Finance, Personal Loan, Rbi, Reserve Bank of India, Sbi, State bank of india

ఉత్తమ కథలు