Home /News /business /

COST OF OWNING AND RUNNING AN ELECTRIC SCOOTER VS A PETROL SCOOTER GH VB

Petrol vs EV scooter: పెట్రోల్ వర్సెస్ ఈవీ స్కూటర్.. కొనుగోలు చేయడానికి, నడపడానికి అయ్యే ఖర్చులు ఎంతంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు బాగా జనాదరణ పెరిగిపోయింది. ఏథర్(Ather), ఓలా (Ola) వంటి సంస్థలు ఎలక్ట్రిక్ స్కూటర్లు (electric scooters) తీసుకొచ్చాక ఎక్కువమంది వీటికే మొగ్గుచూపుతున్నారు. అలాగే ఈవీల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే ఈ-స్కూటర్ కొనడానికి, నడపడానికి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం.

ఇంకా చదవండి ...
భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు బాగా జనాదరణ పెరిగిపోయింది. ఏథర్(Ather), ఓలా (Ola) వంటి సంస్థలు ఎలక్ట్రిక్ స్కూటర్లు (electric scooters) తీసుకొచ్చాక ఎక్కువమంది వీటికే మొగ్గుచూపుతున్నారు. అలాగే ఈవీల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే ఈ-స్కూటర్ కొనడానికి, నడపడానికి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. వాహన ప్రియులు ఎవరైనా సరే తక్కువ ఫీచర్లతోపాటు తక్కువ ధరకే లభించే స్కూటర్లను కొనుగోలు చేయాలనుకుంటారు. అలాగే తక్కువ ధరకే ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించగల స్కూటర్లకు మొగ్గు చూపుతారు. కాస్ట్ కంపారిజన్ అనేది మొదట ధర, తర్వాత రన్నింగ్ కాస్ట్, మెయింటెనెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ కంపారిజన్ చేసేందుకు ప్రస్తుతం దేశంలో అత్యంత విస్తృతంగా అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450ఎక్స్ (Ather 450X)ని సెలక్ట్ చేసుకుందాం.

Ola Scooter: ఓలా స్కూట‌రా మ‌జాకా.. రూ.24తో 130 కి.మీ. ప్ర‌యాణం.. తొలి ఓన‌ర్ మాటల్లో…


ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేస్తే..
భారతదేశంలోని హోండా యాక్టివా 6G, టీవీఎస్ జూపిటర్ 125కి బదులుగా ఏథర్ 450X వంటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయడానికి అయ్యే ఖర్చు తెలుసుకుంటే... ప్రస్తుతం తెలంగాణలో ఏథర్ స్కూటర్ ధర రూ.1,46,296గా ఉంది. హోండా యాక్టివా 6G ధర రూ.72,236... టీవీఎస్ జూపిటర్ 125 ధర రూ.74,225 గా ఉంది. దీన్నిబట్టి ఏథర్ 450X ధర హోండా యాక్టివ్ 6G, టీవీఎస్ జూపిటర్ 125 కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

స్కూటర్‌ నడపడం, మెయింటెనెన్స్ ఖర్చు
ఎలక్ట్రిక్ స్కూటర్ల ఛార్జింగ్, రేంజ్ విషయాలు వాహనదారులను ఆందోళనకు గురిచేస్తాయి. ప్రముఖ నగరాల్లోని ప్రతి చోటా ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తేనే... ఈవీలు కొనేందుకు జనాలు ముందుకు వస్తారు. ఇక పెట్రోల్ స్కూటర్ల విషయానికి వస్తే, ఇంధన ధర అతిపెద్ద సమస్య. పెట్రోల్ ధర రూ.100కి చేరువలో ఉందంటే... స్కూటర్ నడిపేందుకు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో అర్థం చేసుకోవచ్చు. పెట్రోలు స్కూటర్‌ నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మొదటి రెండేళ్లకు హోండా యాక్టివా మెయింటెనెన్స్‌కు సగటున రూ.4,822 ఖర్చవుతుంది. అయితే ఈ ఖర్చులు వినియోగంతో పాటు వాహనం పాతది అవుతున్న కొద్దీ గణనీయంగా పెరుగుతాయి. ఏథర్ 450ఎక్స్ మెయింటెనెన్స్‌కు యేటా రూ.2,400 ఖర్చవుతుంది.

Women’s Shabarimala: ఈ టెంపుల్ మహిళల శబరిమల.. ఆడవాళ్లు ఇరుముడితో వెళ్లే ఈ ఆలయం ప్రత్యేకతలివే..


కిలోమీటరుకు ధర ఎంత?
ఏథర్ 450X ఒక్కో ఛార్జ్‌కు సగటున 85 కి.మీ (KM) రేంజ్ కలిగి ఉంది. అయితే యాక్టివా, జూపిటర్లు లీటరుకు 45-48 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తాయి. ఏథర్ ప్రకారం, దేశీయ విద్యుత్ ధరల ఆధారంగా, పూర్తి ఛార్జీకి రూ.15-20 వరకు ఖర్చు అవుతుంది. లెక్క చేసేందుకు ఫుల్ ఛార్జీకి రూ.20 అనుకుందాం. ఇప్పుడు ఏథర్ స్కూటర్‌పై ఒక కిలోమీటర్ ప్రయాణించడానికి 24 పైసలు అవుతుంది. హోండా యాక్టివా లేదా టీవీఎస్ జూపిటర్ కోసం రూ.2.24 ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ లెక్కన ఏథర్ స్కూటర్‌పై 30,000 కిలోమీటర్ల ప్రయాణిస్తే... రూ.7,200 ఖర్చవుతుంది. అదే పెట్రోల్ స్కూటర్ అయిన యాక్టివా లేదా జుపిటర్ పై 30,000 కిలోమీటర్లు ప్రయాణిస్తే... దాదాపు రూ.64 వేలు ఖర్చవుతుంది.

Indian Post Office: మీకు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉందా.. అయితే ఇది తప్పక తెలుసుకోండి..


దీన్నిబట్టి పెట్రోల్ స్కూటర్ తో పోలిస్తే... ఎలక్ట్రిక్ స్కూటర్‌ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ.. మీరు ఎంత ఎక్కువ ఈ-స్కూటర్‌ నడిపితే అంత ఎక్కువ డబ్బు ఆదా చేసుకోవచ్చని చెప్పవచ్చు. ప్రతి కిలోమీటరు ప్రాతిపదికన విద్యుత్‌తో పోల్చినప్పుడు పెట్రోల్ ధర గణనీయంగా ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. కాబట్టి, మీరు ఎక్కువగా ప్రయాణించే వారైతే, ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎంచుకోవడం మరింత మంచిది. మీ రోజువారీ ప్రయాణం ఎక్కువగా లేకుంటే, మీరు ముందుగా ఎక్కువ డబ్బు ఖర్చు చేయకూడదనుకుంటే, పెట్రోల్ స్కూటర్‌ను కొనుగోలు చేయడం మంచిది.
Published by:Veera Babu
First published:

Tags: Bikes, Electric Bikes, Petrol bikes

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు