మీకు తెలుసా... రూపాయి కన్నా దాని తయారీ ఖర్చు ఎక్కువని

మీకు తెలుసా... రూపాయి కన్నా దాని తయారీ ఖర్చు ఎక్కువని

రూపాయి నాణం

రూపాయి నాణంతో పోలిస్తే మిగిలిన నాణాల ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంది. రూ. 1.28 ఖర్చుతో రూ.2 నాణెం తయారవుతుండగా , రూ.5 నాణానికి రూ.3.69, పది రూపాయల నాణానికి రూ.5.54 ఖర్చు అవుతుంది.

 • Share this:
  రూపాయి నాణం తయారు చేయడానికి అయ్యే ఖర్చు అక్షరాల రూ. 1.11. అవునండి ఇది నిజం. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. ఆర్బీఐ అధికారికంగా అందించిన సమాచారం ప్రకారం ఒక రూపాయి నాణం తయారీకి అయ్యే ఖర్చు అక్షరాలా రూపాయి పదకొండు పైసలు. అంటు దాని మార్కెట్ వాల్యూ కంటే అధికంగా ఖర్చు అవుతోందన్న మాట.

  రూపాయి నాణంతో పోలిస్తే మిగిలిన నాణాల ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంది. రూ. 1.28 ఖర్చుతో రూ.2 నాణెం తయారవుతుండగా , రూ.5 నాణానికి రూ.3.69, పది రూపాయల నాణానికి రూ.5.54 ఖర్చు అవుతుంది. ఇండియన్ గవర్నమెంట్ మింట్ అందించిన సమాచారం ప్రకారం గడిచిన రెండు దశాబ్దాలుగా తగ్గుముఖం పట్టిన ఖర్చు ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. దీంతో ప్రస్తుత సంవత్సరంలో నాణాల తయారీని భారీగా నిలిపివేసింది మింట్. 2015-2016లో 2151 మిలియన్ల నాణాల్ని , 2016-17లో 2201 మిలియన్ నాణాల్ని తయారు చేసింది మింట్. అయితే వీటిలో రూపాయి నాణాలు 903 మిలియన్ల నుంచి 630 మిలియన్లకు తగ్గించింది.

  హైదరాబాద్ మింట్ కూడా గత నాలుగేళ్ల గణాంకాల్ని అందించింది. ముంబైతో పాటు... హైదరాబాద్‌లో ఉండే మింట్ కేంద్రాల్లో రూ.10, రూ.5, రూ.2, రూ. 1 నాణాలు తయారవుతున్నాయని మింట్ తెలిపింది. ఖర్చు పెరిగినప్పటికీ నాణాల తయారీని నిలిపివేసే అవకాశం లేదని పేర్కొంది. అయితే రూపాయి నాణంతో పోల్చితే మిగిలిన నాణాల ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉందని తెలిపింది.
  Published by:Sulthana Begum Shaik
  First published: