కేంద్ర ప్రభుత్వం (Central Government) నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) స్కీమ్‌ను 2011 డిసెంబర్లో పీఎస్‌యూలు (PSU) సహా కార్పొరేట్ ఉద్యోగులకు విస్తరించింది. అంతకు ముందు, 2004 జనవరి 1 నుంచి ఈ పథకం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు(సాయుధ దళాలకు మినహా) మాత్రమే అందుబాటులో ఉంది. కార్పొరేట్ ఎన్పీఎస్ మోడల్ ప్రైవేట్ సెక్టార్ జీతభత్యాల ఉద్యోగులకు రిటైర్మెంట్ (Retirement) అనంతరం పెన్షన్ కోసం మంచి కార్పస్‌ను క్రియేట్ చేసుకోవడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అర్హత కలిగిన కార్పొరేట్లలో పని చేస్తున్న ఉద్యోగులు తమ పదవీ విరమణను ప్లాన్ చేసుకోవడానికి ఈ పథకం ఒక గొప్ప ఆప్షన్‌గా చెబుతున్నారు.
* కాంట్రిబ్యూషన్ ప్రాసెస్
కార్పోరేట్ ఎన్పీఎస్ మోడల్ ఉద్యోగులు, పని సంవత్సరాలలో స్కీమ్‌కు కాంట్రిబ్యూట్ చేయడం ద్వారా పదవీ విరమణ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. యజమానులు తమ ఉద్యోగుల పదవీ విరమణ నిధులకు కాంట్రిబ్యూట్ చేయవచ్చు. కార్పొరేట్ మోడల్ కింద యజమాని, ఉద్యోగి నుంచి మూడు రకాల కాంట్రిబ్యూషన్లు ఉన్నాయి. అవి.. ఇద్దరూ సమానంగా కాంట్రిబ్యూట్ చేయవచ్చు, లేదా ఇద్దరూ వేర్వేరు మొత్తాలను కాంట్రిబ్యూట్ చేయవచ్చు. అదే విధంగా ఇద్దరిలో ఎవరో ఒకరు కూడా కాంట్రిబ్యూట్ చేయవచ్చు.
* మినిమం కాంట్రిబ్యూషన్
ఎన్పీఎస్ నిబంధనల ప్రకారం, ఎన్పీఎస్ టైర్-I అకౌంట్ యాక్టివ్‌గా ఉండటానికి, ఒక సంవత్సరంలో మినిమం రూ.1000 కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎన్పీఎస్ అకౌంట్‌కు మల్టిపుల్ కాంట్రిబ్యూషన్లు చేయవచ్చు. అయితే కాంట్రిబ్యూట్ చేసే మినిమం విలువ రూ.500గా ఉండాలి. ఎన్పీఎస్ టైర్-I అకౌంట్‌కు ప్రతి నెలా కాంట్రిబ్యూట్ చేస్తుంటే.. ఒక సంవత్సరంలో కనీసం రూ.6000 (రూ.500×12) డిపాజిట్ చేయగలరు.
ఎన్‌పీఎస్‌కి నెలవారీ కాంట్రిబ్యూట్లు చేయడం తప్పనిసరి కాదు. టైర్ I అకౌంట్ సబ్‌స్క్రైబర్ కనీసం సంవత్సరానికి ఒకసారి కాంట్రిబ్యూట్ చేయాలి. యాక్టివేషన్ సమయంలో ఎన్పీఎస్ టైర్ II అకౌంట్‌కు అవసరమైన మినిమం కాంట్రిబ్యూషన్ రూ.1000, తర్వాత చేసే కాంట్రిబ్యూషన్ల మినిమం విలువ రూ.250గా ఉండాలి.
* మ్యాగ్జిమం కాంట్రిబ్యూషన్ లిమిట్
ఉద్యోగి లేదా యజమాని చేసే ఏవైనా కాంట్రిబ్యూషన్లు, సబ్‌స్క్రైబర్ ఎంచుకున్న ఏ సమయంలోనైనా కూడా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టగల మొత్తానికి గరిష్ట పరిమితులు లేవు.
* ట్యాక్స్ బెనిఫిట్స్
ఎన్పీఎస్ పెట్టుబడి కొన్ని ట్యాక్స్ బెనిఫిట్లను అందిస్తుంది. జీతం పొందే ఉద్యోగి అయితే, సంబంధిత కంపెనీ కాస్ట్ టూ కంపెనీ స్ట్రక్చర్ ఎన్‌పీఎస్‌కి సహకరించడానికి యజమాని అనుమతిస్తే, జీతంలో 10% వరకు (బేసిక్ ప్లస్ డియర్నెస్ అలవెన్స్) డిడక్షన్‌కు అర్హులు. ప్రభుత్వ రంగంలో ఈ పరిమితి 14 శాతంగా ఉంది. ఓన్ కాంట్రిబ్యూషన్లు సెక్షన్లు 80CCD (1), 80CCD (2), (1B) కింద డిడక్షన్ పొందడం కొనసాగుతుంది.
* ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్
పథకం నిబంధనల ప్రకారం.. కార్పొరేట్లు తమ స్కీమ్ కోసం పెట్టుబడి ఆప్షన్లను స్వయంగా ఎంచుకోవచ్చు లేదా వాటిని వ్యక్తిగత ఉద్యోగికి వదిలివేయవచ్చు. కార్పొరేట్ పెట్టుబడి ఆప్షన్ సెలక్ట్ చేస్తే, అది ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. ఉద్యోగులు తమ పెట్టుబడి ఆప్షన్లను ఎంచుకోవడానికి కార్పొరేట్ అనుమతిస్తే.. వారు వారి ప్రాధాన్యతల ప్రకారం యాక్టివ్ లేదా ఆటో ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఉద్యోగులు ఏ సమయంలోనైనా సంస్థ నుంచి బయటకు వస్తే పెట్టుబడి ఆప్షన్లను మార్చుకోవచ్చు.
ఇది కూడా చదవండి : సావరిన్ గోల్డ్ బాండ్లతో ఈజీగా లోన్ పొందే అవకాశం.. ఇలా చేయండి
* ఎలా నమోదు చేసుకోవాలి
ఎన్పీఎస్ కోసం నమోదు చేసుకోవాలనుకునే కార్పొరేట్లు, ఉద్యోగుల నమోదును సులభతరం చేయడంలో సహాయపడే ఒక PoP ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. PoPని యజమాని వారి ప్రాధాన్యత ఆధారంగా తర్వాత మార్చవచ్చు. ఈ PoPలు సబ్స్క్రైబర్లు టైర్ I, టైర్ II ఎన్పీఎస్ అకౌంట్లను క్రియేట్ చేయడంలో సహాయపడతాయి.
* ఉద్యోగం మారిన తర్వాత ఇప్పటికే ఉన్న NPS అకౌంట్ ఏమవుతుంది?
ఇప్పటికే ఉన్న ఎన్పీఎస్ సబ్స్క్రైబర్లు, అర్హత ఉన్న కార్పొరేట్ సంస్థలో ఉద్యోగంలో చేరిన తర్వాత.. కొన్ని ఫారమ్‌లను నింపి, వాటిని PoPకి సమర్పించడం ద్వారా వారి ప్రస్తుత ఎన్పీఎస్ అకౌంట్ కార్పొరేట్ మోడల్‌కు మారవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Money, Nps, NPS Scheme, Retirement