CORPORATE FDS TIRED OF LOW FD RATES CONSIDER CORPORATE FDS THAT OFFER UP TO 7 25 PERCENT INTEREST GH VB
Corporate FDs: తక్కువ ఎఫ్డీ రేట్లతో విసిగిపోయారా..? 7.25% వరకు వడ్డీ అందిస్తున్న కార్పొరేట్ ఎఫ్డీలను పరిశీలించండి..
ప్రతీకాత్మక చిత్రం
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC)/ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (HFC) జారీ చేసే కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లు.. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు(FD) కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి.
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC)/ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (HFC) జారీ చేసే కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లు(Fixed Deposits).. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు(FD) కంటే ఎక్కువ వడ్డీ రేట్లను(Interest Rates) అందిస్తాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు(Government Banks), ప్రధాన ప్రైవేటు రంగ బ్యాంకులు(Private Banks) అందించే వడ్డీ రేట్లు కంటే ఎక్కువ చెల్లిస్తాయి. అయితే బ్యాంక్ FDల తరహాలో DICGC కార్పొరేట్ FD లకు రూ.5 లక్షల డిపాజిట్ బీమా కవరేజీ లభించదు. CRISIL, ICRA, CARE వంటి రేటింగ్ ఏజెన్సీలు కేటాయించిన FDల క్రెడిట్ రేటింగ్లను పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చు. ఈ రేటింగ్‌లు కంపెనీల వడ్డీలను సకాలంలో చెల్లించగల సామర్థ్యాన్ని, FD పదవీకాలం ముగిసే సమయానికి అందే మొత్తాన్ని పరిశీలించి రేటింగ్‌ను అంచనా వేస్తాయి. ఉత్తమ సేవలు, అధిక వడ్డీని అందిస్తున్న కొన్ని సంస్థలు ఇవే..
శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కో.లిమిటెడ్ మూడు సంవత్సరాల కాలానికి చేసిన FDలపై(నెలవారీ చొప్పున) 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. మెచ్యూర్డ్ డిపాజిట్ల పునరుద్ధరణలపై ఏడాది చొప్పున 0.25 శాతం అదనపు వడ్డీని కూడా అందిస్తుంది. CRISIL ఈ NBFCకి FAAA/ స్టేబుల్ క్రెడిట్ రేటింగ్‌ను కేటాయించింది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ICRA ఈ NBFCకి MAA+/ Stable క్రెడిట్ రేటింగ్‌ను కేటాయించింది.
శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ కో.లిమిటెడ్ 3 సంవత్సరాల గడువుతో చేసిన FDలపై(నెలవారీ చొప్పున) 7.25 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. మెచ్యూర్డ్ డిపాజిట్ల రెన్యువల్‌పై ఏడాది చొప్పున 0.25 శాతం అదనపు వడ్డీని కూడా అందిస్తుంది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ICRA ఈ NBFCకి MAA+/ స్టేబుల్ క్రెడిట్ రేటింగ్‌ను కేటాయించింది.
బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ 3 సంవత్సరాల కాలానికి చేసిన FDలపై ఏడాదికి 7.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. CRISIL ఈ NBFCకి FAAA/ స్టేబుల్ క్రెడిట్ రేటింగ్‌ను కేటాయించింది. రేటింగ్ ఏజెన్సీ ప్రకారం FAAA NBFCకి సకాలంలో వడ్డీ, అసలు తిరిగి చెల్లించే సామర్థ్యం ఉంది. ICRA MAAA/ స్టేబుల్ క్రెడిట్ రేటింగ్‌ను కేటాయించింది.
ముత్తూట్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ 3 సంవత్సరాల సమయానికి చేసిన FDలపై 6.75 శాతం వడ్డీ (కాంపౌండెడ్ యాన్యువల్లీ) రేటును అందిస్తుంది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ CRISIL ముత్తూట్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్‌కు FA+/ స్టేబుల్ క్రెడిట్ రేటింగ్‌ను కేటాయించింది.
PNB హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ 3 సంవత్సరాల కాలానికి చేసిన FDలపై 6.60 శాతం వడ్డీ రేటును (కాంపౌండెడ్ యాన్యువల్లీ) అందిస్తుంది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ CRISIL ఈ HFCకి FAA+/ నెగెటివ్ క్రెడిట్ రేటింగ్‌ను కేటాయించింది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ CARE ఈ HFCకి AA/ స్టేబుల్ క్రెడిట్ రేటింగ్ ఇచ్చింది.
ICICI హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ మూడు సంవత్సరాల కాలానికి చేసిన ఎఫ్డీలపై 6.20 శాతం వడ్డీ రేటును(కాంపౌండెడ్ యాన్యువల్లీ) అందిస్తుంది. CRISIL ఈ HFCకి FAAA/ స్టేబుల్ క్రెడిట్ రేటింగ్‌ను కేటాయించింది. ICRA MAAA/ స్టేబుల్ క్రెడిట్ రేటింగ్‌ను కేటాయించింది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ CARE ఈ HFCకి AAA/స్టేబుల్ క్రెడిట్ రేటింగ్‌ను కేటాయించింది.
HDFC Ltd మూడు సంవత్సరాల కాలానికి చేసిన ఎఫ్డీలపై 6.30 శాతం వడ్డీ రేటును(కాంపౌండెడ్ యాన్యువల్లీ) అందిస్తుంది. ఈ HFC మెచ్యూర్డ్ డిపాజిట్ల పునరుద్ధరణలపై ఏడాది చొప్పున 0.05 శాతం అదనపు వడ్డీని కూడా అందిస్తుంది. CRISIL ఈ HFCకి FAAA/ స్టేబుల్ క్రెడిట్ రేటింగ్‌ను కేటాయించింది. ICRA MAAA/స్టేబుల్ క్రెడిట్ రేటింగ్‌ను కేటాయించింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.