RBI Moratorium On EMI: బ్యాంకు ఈఎంఐలు 3 నెలల పాటు కట్టక్కర్లేదు...ఆర్బీఐ కీలక ప్రకటన...

బ్యాంకు ఈఎంఐలు 3 నెలల పాటు కట్టక్కర్లేదు...ఆర్బీఐ కీలక ప్రకటన...

news18-telugu
Updated: March 27, 2020, 11:19 AM IST
RBI Moratorium On EMI: బ్యాంకు ఈఎంఐలు 3 నెలల పాటు కట్టక్కర్లేదు...ఆర్బీఐ కీలక ప్రకటన...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా బ్యాంకు ఈఎంఐలు 3 నెలల పాటు కట్టక్కర్లేదని ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. అన్ని రకాల బ్యాంకుల నెల వాయిదాలపై ఆర్బీఐ మారిటోయం విధించింది. దీనికిందకు టర్మ్ లోన్స్ తో పాటు అన్ని రకాల నెల వాయిదాలు ఉన్నాయి. ఈ నిబంధన అటు కమర్షియల్, రీజనల్, రూరల్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వర్తిస్తుంది. అంటే మారిటోరియం కాలంలో మీ వేతనం నుంచి ఈఎంఐ పేరిట నెలసరి వాయిదా కట్ కాదు. ఇలా మూడు నెలల పాటు మీరు వాయిదా కట్ అవ్వని డబ్బుతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఆ మొత్తం వినియోగ దారులకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. కాగా 3 నెలల మారిటోరియం అనంతరం తిరిగి ఈఎంఐ మొత్తాన్ని బ్యాంకులు వసూలు చేసుకోవచ్చు.

మధ్య తరగతికి ఊరట...
గృహ, వాహన, పర్సనల్ లోన్స్ తీసుకునే వినియోగ దారులకు ఆర్బీఐ ప్రకటన వరమనే చెప్పాలి. నెల ప్రారంభంలోనే వేతనం పడగానే ఈఎంఐ రూపేణా బ్యాంకులు వారి వేతనాన్ని వాయిదాల్లో ఆటోమేటిగ్గా జమచేసేసుకుంటాయి. ఈ ఊరటతో వినియోగదారులకు మూడు నెలల పాటు ఈఎంఐ డబ్బు సేవ్ అవుతుందనే చెప్పాలి. అలాగే మూడు నెలల పాటు రుణ కాల పరిమితి కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు రుణ కాల పరిమితి 12 నెలలు ఉంటే అది 15 నెలలపాటు పొడిగిస్తారు. అంటే మూడు నెలల పాటు మీకు రుణాల నుంచి విముక్తి దక్కుతుంది. ఇదిలా ఉంటే గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రుణాలపై 6 నెలల పాటు మారిటోరియం విధించాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో కోరడం కొసమెరుపు.

First published: March 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు