• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • CORONAVIRUS PANDEMIC HAS IMPACTED 82 PERCENT OF SMALL BUSINESSES NS

Corona: చిన్న వ్యాపారాలను కోలుకోలేని దెబ్బ కొడుతున్న కరోనా.. తాజా సర్వేలో షాకింగ్ విషయాలు

Corona: చిన్న వ్యాపారాలను కోలుకోలేని దెబ్బ కొడుతున్న కరోనా.. తాజా సర్వేలో షాకింగ్ విషయాలు

ప్రతీకాత్మక చిత్రం

కరోనా మహమ్మారి దాదాపు అన్ని రంగాలను దెబ్బ కొడుతుంది. పెద్ద కంపెనీలతో పోల్చితే చిన్న కంపెనీలపై కరోనా ఎఫెక్ట్ అధికంగా ఉన్నట్లు తాజాగా నిర్వహించిన సర్వే వెల్లడించింది.

  • Share this:
    కరోనా కారణంగా అనేక రంగాలు కుదేలయ్యాయి. అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు ఈ మహమ్మారి ధాటికి చితికిపోయాయి. తాజాగా డాటా సంస్థ డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ సర్వే నిర్వహించిన సర్వేలో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో దాదాపు 82 శాతం చిరు వ్యాపారులు కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నారని సంస్థ సర్వే తెలిపింది. తయారీ రంగం ముఖ్యంగా అనేక సంక్షోభానికి గురైందని వెల్లడించింది. ఈ సర్వేను రూ.100 నుంచి 250 కోట్ల వార్షిక టర్నోవర్‌ కలిగిన సంస్థల అభిప్రాయాలు, వాటి తీరుతెన్నుల ఆధారంగా నిర్వహించారు. ఉత్పత్తి, సేవల రంగాల నుంచి మొత్తం 250కి పైగా కంపెనీల నుంచి వివరాలను సేకరించారు. దాదాపు 70 శాతం కంపెనీలు కరోనాకు ముందు ఉన్న డిమాండ్‌ను తిరిగి పొందడానికి దాదాపు ఏడాది సమయం పడుతుందని అంచనా వేస్తున్నాయి. 60 శాతం వివిధ కంపెనీలు ప్రభుత్వం నుంచి పథకాలతో మద్దతును ఆశిస్తున్నట్లు తెలిపాయి. 42 శాతం కంపెనీలు మార్కెట్ యాక్సెస్, 37 శాతం ఉత్పాదకతను మెరుగుపరచడం, 34 శాతం ఫైనాన్స్‌ను సాధించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వెల్లడించాయి.

    ఇదిలా ఉంటే.. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల రిటైల్‌ రుణాలకూ కరోనా షాక్ తగులుతోంది. పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధిస్తున్న నేపథ్యంలో వసూళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం భారత వృద్ధిరేటు 11 శాతంగా నమోదు అయ్యే అవకాశం ఉంటుందని ఎస్‌అండ్‌పీ అంచనా వేస్తోంది. అయితే కరోనా విజృంభించి లాక్‌డౌన్లు పెరిగితే ఆ ప్రభావం వృద్ధిరేటుపై ఉంటుందని హెచ్చరించింది.
    Cashless Insurance claims: క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ లు తిరస్కరిస్తే చర్యలు.. బీమా కంపెనీలకు సర్క్యూలర్

    ఇదిలా ఉంటే.. మన దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. గురువారం 3,32,730 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,93,279 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. 2263 మంది మరణించారు. తాజా లెక్కలతో భారత్‌లో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,62,63,695 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1,36,48,159 మంది కోలుకోగా.. 1,86,920 మంది చనిపోయారు. ప్రస్తుతం 24,28,616 మంది మరణించారు. మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 67,013 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యూపీలో 34,254, కేరళలో 26,995, ఢిల్లీలో 26,169, కర్నాటకలో 25,795, ఛత్తీస్‌గఢ్‌లో 16,750 కొత్త కేసులు నమోదయ్యాయి.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు