దలాల్ స్ట్రీట్ నష్టాల దెబ్బతో కంపించింది. చరిత్ర కనీవినీ ఎరుగని రీతిలో. గురువారం మార్కెట్లు నష్టపోయాయి. ఆరంభం నుంచే మదుపరులకు భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా నష్టాలను కంటిన్యూ అయ్యాయి. ఒకే సెషన్లో దాదాపు రూ.12 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 829 పాయింట్లు నష్టపోయి 9,633.10 పాయింట్ల స్థిరపడగా, సెన్సెక్స్ -2,919.26 (-8.18%) పాయింట్లు నష్టపోయి 32,778.14 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ సూచీలో 867 స్టాక్స్ 52 వారాల నష్టాన్ని చవిచూశాయి. నిఫ్టీ ఒక దశలో 9600 పాయింట్ల దిగువన నష్టపోయింది. సెన్సెక్స్ సైతం 3000 పాయింట్లు నష్టపోయింది. అన్ని సెక్టార్లలో హెవీ సెల్లింగ్ చోటు చేసుకుంది. దాదాపు అన్ని సెక్టార్స్ సూచీలు 52 వారాల కనిష్ట స్థాయిని నమోదు చేశాయి. దీంతో ఈ దశాబ్దంలోనే భారీ పతనానికి గురువారం నాంది అయ్యింది.
అటు నిఫ్టీ సైతం 2018 మార్చ్ తర్వాత 10 వేల పాయింట్ల దిగువకు పతనమైంది. మార్కెట్ ప్రారంభమైన కాసేపటికి సెన్సెక్స్ 34000 వేల పాయింట్ల దిగువకు పతనమై 17 నెలల దిగువకు పతనమైంది. అటు ఇండెక్స్ లో హెవీ వెయిట్ స్టాక్స్ అయిన HDFC, HDFC Bank, Reliance Industries, TCS, Infy స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. నిఫ్టీ బ్యాంక్ కూడా 25 వేల పాయింట్ల దిగువకు పతనమైంది. నిఫ్టీ సూచీలోని అన్ని షేర్లు పతనం బాటపట్టాయి. టాటా మోటార్స్ టాప్ లూజర్ గా నిలిచాయి. టాటా మోటార్స్ 11 సంవత్సరాల దిగువకు పతనమైంది.
వరల్డ్ హెల్త్ అర్గనైజేషన్ కరోనాను మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లన్నీ భారీగా పతనం బాటపట్టాయి. అటు అమెరికా మార్కెట్లు సైతం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. డోజోన్స్ సూచీ 1464 పాయింట్లు పతనమవగా, ఎస్ అండ్ పీ 140 పాయింట్లు నష్టపోయింది. అటు ఆసియా మార్కెట్లు సైతం భారీగా పతనం బాట పట్టాయి. షాంఘై సూచీ 1.54 శాతం, నిక్కీ 4.41 శాతం పతనమయ్యాయి. మరోవైపు అమెరికా నుంచి యూరప్‌కు చెందిన 26 దేశాలకు నెల రోజుల పాటు ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లలో అల్లకల్లోలం చెలరేగింది.
#MarketsWithMC | Closing Bell 🔔: #CoronavirusPandemic grips Dalal Street; #Sensex at 2017 levels; bluechips end at decade lows#StocksToWatch #StockMarket | https://t.co/81KrKfo6lP pic.twitter.com/51BF6qetq5
— moneycontrol (@moneycontrolcom) March 12, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nifty, Sensex, Stock Market