హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPF: రూ.15,000 లోపు జీతం ఉన్నవారికి త్వరలో గుడ్ న్యూస్?

EPF: రూ.15,000 లోపు జీతం ఉన్నవారికి త్వరలో గుడ్ న్యూస్?

EPF: రూ.15,000 లోపు జీతం ఉన్నవారికి త్వరలో గుడ్ న్యూస్?
(ప్రతీకాత్మక చిత్రం)

EPF: రూ.15,000 లోపు జీతం ఉన్నవారికి త్వరలో గుడ్ న్యూస్? (ప్రతీకాత్మక చిత్రం)

కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మరిన్ని వరాలు కురిపించే అవకాశం ఉంది.

కరోనా వైరస్ సృష్టిస్తున్న ఆర్థిక సంక్షోభం అంతా ఇంతా కాదు. ప్రతీ రంగంపై కరోనా వైరస్ ప్రభావం ఉంది. అనేక వ్యవస్థలు సంక్షోభంలో పడుతున్నాయి. ఉద్యోగాలకు ముప్పు తప్పట్లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఆర్థిక రంగాన్ని గాడినపెట్టే చర్యలు చేపడుతోంది. అంతేకాదు... ఉద్యోగులకు భరోసా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. కొద్ది రోజుల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంఘటిత రంగంలోని ఉద్యోగులకు రెండు వరాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈపీఎఫ్ అకౌంట్‌లోని బ్యాలెన్స్‌లో 75 శాతం లేదా మూడు నెలల బేసిక్ వేతనం విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో పాటు 100 లోపు ఉద్యోగులు ఉన్న సంస్థల్లో రూ.15,000 లోపు వేతనం ఉన్నవారికి పీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీ షేర్ 12%, ఎంప్లాయర్ షేర్ 12% మూడు నెలల పాటు ప్రభుత్వమే చెల్లిస్తుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే ఇది కేవలం 100 మంది ఉద్యోగుల లోపు ఉన్న చిన్న సంస్థలకే వర్తిస్తుంది.

అయితే ప్రభుత్వం త్వరలో 100 పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలకు కూడా ఈ రిలీఫ్ ప్యాకేజీ వర్తింప చేయొచ్చన్న వార్తలొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోయే రెండే ఆర్థిక ప్యాకేజీలో ఈ వరాన్ని చేరుస్తారని భావిస్తున్నారు. అంటే పెద్ద కంపెనీల్లో కూడా రూ.15,000 లోపు జీతం ఉన్నవారికి పీఎఫ్ పీఎఫ్ ఎంప్లాయీ షేర్ 12%, ఎంప్లాయర్ షేర్ 12% మూడు నెలల పాటు కేంద్ర ప్రభుత్వం చెల్లించే అవకాశముంది. ఉద్యోగుల తొలగింపును తగ్గించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకునే అవకాశముంది. అదే జరిగితే ఇంకొన్ని లక్షల మంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది.

ఇవి కూడా చదవండి:

EPF Withdrawal: ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయడానికి స్టెప్స్ ఇవే

PF Balance: మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? సింపుల్‌గా తెలుసుకోండి ఇలా

PF Balance: పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు తీస్తున్నారా? ఎంత నష్టమంటే

First published:

Tags: Business, BUSINESS NEWS, Corona, Corona virus, Coronavirus, Covid-19, EPFO, Lockdown, Personal Finance

ఉత్తమ కథలు