Money Transfer: జన్ ధన్ అకౌంట్‌లోకి నేటి నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్... ఎవరికి ఎప్పుడంటే

PM Gareeb Kalyan Yojana | ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా ఇవాళ్టి నుంచి లబ్ధిదారులకు నగదు బదిలీ జరగనుంది. జన్ ధన్ అకౌంట్లలోకి డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాయి బ్యాంకులు.

news18-telugu
Updated: April 3, 2020, 12:12 PM IST
Money Transfer: జన్ ధన్ అకౌంట్‌లోకి నేటి నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్... ఎవరికి ఎప్పుడంటే
Money Transfer: జన్ ధన్ అకౌంట్‌లోకి నేటి నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్... ఎవరికి ఎప్పుడంటే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీలో భాగంగా పలు వర్గాలకు నేరుగా డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఎవరెవరికి ఎంత ట్రాన్స్‌ఫర్ చేస్తుందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. జన్ ధన్ అకౌంట్లు ఉన్న 20.4 కోట్ల మహిళలకు నెలకు రూ.500 చొప్పున మూడు నెలలు రూ.1,500 ఇస్తామని కేంద్రం ప్రకటించింది. వారికి శుక్రవారం నుంచి విడతల వారీగా నగదు బదిలీ జరుగుతుంది. ఇది మూడు నెలల ఇన్‌స్టాల్‌మెంట్‌లో మొదటి వాయిదా మాత్రమే. మళ్లీ మేలో, జూన్‌లో రెండు వాయిదాలు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఎవరికి ఎప్పుడు డబ్బులు బదిలీ అవుతాయో తెలుసుకోండి.

ఏప్రిల్ 3- అకౌంట్ నెంబర్‌ చివర్లో 0 లేదా 1 నెంబర్ ఉన్నవారికి

ఏప్రిల్ 4- అకౌంట్ నెంబర్‌ చివర్లో 2 లేదా 3 నెంబర్ ఉన్నవారికి
ఏప్రిల్ 7- అకౌంట్ నెంబర్‌ చివర్లో 4 లేదా 5 నెంబర్ ఉన్నవారికి
ఏప్రిల్ 8- అకౌంట్ నెంబర్‌ చివర్లో 6 లేదా 7 నెంబర్ ఉన్నవారికి
ఏప్రిల్ 9- అకౌంట్ నెంబర్‌ చివర్లో 8 లేదా 9 నెంబర్ ఉన్నవారికి

ఏప్రిల్ 3న మొదలయ్యే నగదు బదిలీ ఏప్రిల్ 9న ముగుస్తుంది. ఒకేసారి నగదు బదిలీ చేస్తే డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి మహిళలంతా ఏటీఎంల దగ్గరకు వస్తే రద్దీ పెరుగుతుందని భావించిన కేంద్రం 5 రోజులు 5 విడతల్లో నగదు బదిలీ చేయనుంది. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలన్న ఆలోచనతో ఇలా 5 విడతల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తోంది. డబ్బులు అకౌంట్‌లో పడగానే విత్‌డ్రా చేయడానికి హడావుడిగా వెళ్లొద్దని, ఏప్రిల్ 9 తర్వాత లబ్ధిదారులు ఎప్పుడైనా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చని బ్యాంకులు సూచిస్తున్నాయి. లబ్ధిదారులు ఏటీఎంలు, బ్యాంకు మిత్రాలు, సీఎస్పీల దగ్గర డబ్బులు డ్రా చేసుకోవచ్చు.ఇవి కూడా చదవండి:

EMI payment: హోమ్ లోన్ ఈఎంఐ వాయిదా వేస్తే రూ.2.34 లక్షల నష్టం... ఈ లెక్క చూడండి

SBI Good News: ఈఎంఐ చెల్లించారా? వెనక్కి తీసుకోండి ఇలా

EPF Withdrawal: మీ పీఎఫ్ డబ్బులు 3 రోజుల్లో మీ అకౌంట్‌లోకి... విత్‌డ్రా చేయండి ఇలా

Digital Payments: ఈ పేమెంట్స్ అన్నీ ఇంటి నుంచే చేయొచ్చు
First published: April 3, 2020, 12:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading