• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • CORONAVIRUS OUTBREAK POULTRY FIRMS FARMERS HIT DUE TO MASSIVE CULLING MK

పౌల్ట్రీరంగం నష్టం ఎంతో తెలిస్తే...షాక్ తింటారు..ఆదుకోమని ప్రధానికి వినతి...

పౌల్ట్రీరంగం నష్టం ఎంతో తెలిస్తే...షాక్ తింటారు..ఆదుకోమని ప్రధానికి వినతి...

ప్రతీకాత్మక చిత్రం

ఫిబ్రవరి ప్రారంభం నుంచి దేశంలోని కోళ్ల పరిశ్రమ దాదాపు రూ.22,500 కోట్ల నష్టాలను చవిచూసింది. ఫిబ్రవరి మొదటి వారంలో చికెన్‌, గుడ్లు తింటే కరోనా వస్తుందని వ్యాపించిన వదంతుల వల్ల కోళ్ల పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది.

  • Share this:
    కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించడంతో అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇక కరోనా కారణంగా పూర్తిగా కుదేలైన రంగం ఏదైనా ఉందంటే పౌల్ట్రీ అనే చెప్పాలి. కరోనా కేసులు చైనాలో ప్రారంభమైనప్పటి నుంచే మన దేశంలో పౌల్ట్రీ రంగం ప్రత్యక్షంగా నష్టపోవడం ప్రారంభమైంది. ఫిబ్రవరి ప్రారంభం నుంచి దేశంలోని కోళ్ల పరిశ్రమ దాదాపు రూ.22,500 కోట్ల నష్టాలను చవిచూసింది. ఫిబ్రవరి మొదటి వారంలో చికెన్‌, గుడ్లు తింటే కరోనా వస్తుందని వ్యాపించిన వదంతుల వల్ల కోళ్ల పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని ఆల్‌ ఇండియా పౌల్ట్రీ బ్రీడర్స్‌ అసోసియేషన్‌ (ఏఐపీబీఏ) వైస్‌ ప్రెసిడెంట్‌ సురేశ్‌ చిట్టూరి పేర్కొన్నారు. లాక్‌డౌన్‌తో చికెన్‌, గుడ్ల రవాణా నిలిచిపోయిందని ఇది పరిశ్రమకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందన్నారు. నష్టాల్లో కూరుకుపోయిన పరిశ్రమను ఆదుకోవడానికి కేంద్రం జోక్యం చేసుకుని రుణాల పునర్‌వ్యవస్థీకరణ వంటి చర్యలు తీసుకోవాలని అసోసియేషన్‌ కోరిందని చెప్పారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. పరిశ్రమను ఆదుకునే ప్యాకేజీని ప్రకటించాలని కోరినట్లు సురేశ్‌ వెల్లడించారు.
    Published by:Krishna Adithya
    First published: