LIC: కరోనావైరస్ ఎఫెక్ట్... ఎల్ఐసీ నుంచి 5 కీలక ప్రకటనలు

Life insurance corporation of India announcements | కరోనా వైరస్ ప్రభావం కారణంగా ప్రీమియం చెల్లించలేకపోతున్న, కొత్త పాలసీలు తీసుకోలేకపోతున్నవారికి శుభవార్త చెప్పింది ఎల్ఐసీ.

news18-telugu
Updated: April 13, 2020, 10:03 AM IST
LIC: కరోనావైరస్ ఎఫెక్ట్... ఎల్ఐసీ నుంచి 5 కీలక ప్రకటనలు
LIC: కరోనావైరస్ ఎఫెక్ట్... ఎల్ఐసీ నుంచి 5 కీలక ప్రకటనలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా? ప్రీమియం చెల్లించాలా? కరోనా వైరస్ ప్రభావంతో ఎల్ఐసీ పాలసీ రెన్యువల్స్ విషయంలో సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎల్ఐసీ ఆఫీసులన్నీ పరిమిత సిబ్బందితో నడుస్తున్నాయి. ఇతర ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అందుకే పాలసీహోల్డర్లకు ఊరట కలిగించేందుకు, ఇబ్బందులు తొలగించేందుకు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రీమియం పేమెంట్, కొత్త పాలసీ తీసుకోవడం, ఇతర సేవల కోసం కొన్ని ప్రకటనలు చేసింది. అవేంటో తెలుసుకోండి.

1. మీరు ఫిబ్రవరి ప్రీమియంలు చెల్లించాలా? మార్చి 22 లోపు మీ పాలసీ ఎక్స్‌పైరీ అయిందా? అయితే మీరు ఏప్రిల్ 15 లోగా ప్రీమియంలు చెల్లించొచ్చు. అంతేకాదు. మార్చి, ఏప్రిల్‌లో చెల్లించాల్సిన ప్రీమియంలకు మరో 30 రోజుల గడువు ఇచ్చింది ఎల్ఐసీ. ఉదాహరణకు మీ పాలసీ గడువు ఏప్రిల్ 15న ముగుస్తున్నట్టైతే మీరు మే 15 వరకు ప్రీమియం చెల్లించొచ్చు. ఎలాంటి జరిమానాలు చెల్లించాల్సిన అవసరం లేదు.

2. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు అందుబాటులో లేకపోయినా పాలసీలను రెన్యువల్ చేయొచ్చు.

3. ఎల్ఐసీ పాలసీహోల్డర్లు డిజిటల్ పద్ధతుల్లో ప్రీమియంలు చెల్లించొచ్చు. ఎలాంటి సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎల్ఐసీ పే డైరెక్ట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రీమియం చెల్లించొచ్చు. ఎల్ఐసీ వెబ్‌సైట్‌లో పాలసీ ప్రీమియం చెల్లించాలనుకుంటే పాలసీ హోల్డర్స్ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం బేసిక్ డీటెయిల్స్ వెల్లడించి నేరుగా పేమెంట్ చేయొచ్చు.

4. అన్ని ఐడీబీఐ, యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లు, బ్లాక్ స్థాయిలోని కామన్ సర్వీస్ సెంటర్లలో కూడా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు. దీంతో పాటు నెట్‌బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే లాంటి పేమెంట్ యాప్స్ ద్వారా ఎల్ఐసీ పాలసీ ప్రీమియం చెల్లించొచ్చు.

5. ఇక ఐదు పాలసీలను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది ఎల్ఐసీ. టెక్ టర్మ్, జీవన్ శాంతి యాన్యుటీ ప్లాన్, క్యాన్సర్ కవర్, ఎస్ఐఐపి, నివేష్ ప్లస్ ప్లాన్స్‌ని మీరు ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లు వాయిదా వేస్తున్నారా? ఈ నష్టం తప్పదు

Good News: ఈ స్కీమ్స్‌లో సేవింగ్స్ చేస్తున్నవారికి గుడ్ న్యూస్

Online Transactions: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లో డబ్బులు పోయాయా? ఇలా చేయండి
Published by: Santhosh Kumar S
First published: April 13, 2020, 10:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading