• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • CORONAVIRUS LOCKDOWN INDIA POST EXTENDS INSURANCE PREMIUM PAYMENT DEADLINE TILL JUNE 30 SS

India Post: పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఉన్నవారికి ఊరట

India Post: పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఉన్నవారికి ఊరట

ప్రతీకాత్మక చిత్రం

India Post | పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీలు ఉన్నవారికి ఊరట కల్పించింది ఇండియా పోస్ట్.

  • Share this:
    మీరు పోస్ట్ ఆఫీస్‌లో ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకున్నారా? ప్రీమియం చెల్లించాల్సి ఉందా? గడువు దాటిపోయిందా? ఇండియా పోస్ట్ ఊరట కల్పించింది. ప్రీమియం చెల్లించే గడువును జూన్ 30 వరకు పొడిగించింది. కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో ప్రీమియం చెల్లించే పరిస్థితి లేదు. దీంతో పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం చెల్లించడానికి జూన్ 30 వరకు గడువు పొడిగిస్తూ ఇండియా పోస్ట్ ప్రకటన జారీ చేసింది. 2020 మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ప్రీమియం చెల్లించాల్సినవారు 2020 జూన్ 30 లోగా ఎప్పుడైనా పేమెంట్ చేయొచ్చు. గడువు దాటిపోయినా ఎలాంటి పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ ప్రకటించింది. కస్టమర్లు పీఎల్ఐ కస్టమర్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకొని ప్రీమియం పేమెంట్ చేయొచ్చని ఇండియా పోస్ట్ సూచించింది.

    అధికారిక డేటా ప్రకారం మార్చి నాటికి 64.65 లక్షల పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీలు, 2.5 కోట్ల రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీలు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ లాభాలను ప్రభుత్వ ఉద్యోగులు పొందొచ్చు. ఇటీవల 2017 అక్టోబర్ నాటికి ఉద్యోగులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీ ఉద్యోగులకు ఈ లాభాలను ప్రకటించారు.

    ఇవి కూడా చదవండి:

    Gold Price: పసిడి ప్రేమికులకు షాక్... రూ.50,000 వైపు పరుగులు తీస్తున్న బంగారం

    LIC: కరోనావైరస్ ఎఫెక్ట్... ఎల్ఐసీ నుంచి 5 కీలక ప్రకటనలు

    TRAI: సెట్ టాప్ బాక్సులు వాడేవారికి త్వరలో శుభవార్త
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు