• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • CORONAVIRUS LIKELY TO IMPACT INDIAS MARCH QTR GDP GROWTH BY 02 REPORT MK

కరోనా ఎఫెక్ట్ దేశ జీడీపీపై ఎంత పడుతుందో తెలుసా...?

కరోనా ఎఫెక్ట్ దేశ జీడీపీపై ఎంత పడుతుందో తెలుసా...?

ప్రతీకాత్మక చిత్రం

మన దేశంలో సైతం ఎలక్ర్టానిక్స్‌, ఫార్మాస్యూటికల్స్‌, ఆటోమొబైల్స్‌ వంటి రంగాలు కరోనా వైరస్‌తో దెబ్బతింటాయని, ఫలితంగా ఆర్థిక వృద్ధి మందగిస్తుందని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ నివేదిక స్పష్టం చేసింది.

  • Share this:
    దేశంలోని పలు నగరాల్లో కరోనా కేసులు వెలుగుచూడటంతో దాని ఆర్థిక వ్యవస్ధపై ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా ఎఫెక్ట్‌తో మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 0.20 శాతం​ మేరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక మందగమనంతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. దీంతో మన దేశంలో సైతం ఎలక్ర్టానిక్స్‌, ఫార్మాస్యూటికల్స్‌, ఆటోమొబైల్స్‌ వంటి రంగాలు కరోనా వైరస్‌తో దెబ్బతింటాయని, ఫలితంగా ఆర్థిక వృద్ధి మందగిస్తుందని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ నివేదిక స్పష్టం చేసింది. 2020 మార్చి క్వార్టర్‌లో జీడీపీ వృద్ధి రేటు 0.20 శాతం తగ్గవచ్చని తాము అంచనా వేస్తున్నామని ఈ నివేదిక వెల్లడించింది. ఇక 2020-21లో భారత ఎకానమీ 5.6 శాతమే వృద్ధి సాధిస్తుందని, మరుసటి ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు కోలుకోవచ్చని యూబీఎస్‌ నివేదిక అంచనా వేసింది.
    Published by:Krishna Adithya
    First published: