కరోనా దెబ్బకు టీవీల ధరలు జూమ్...స్మార్ట్ టీవీలు కొనాలంటే ఇక చుక్కలే...

Coronavirus | భారత్‌లో టెలివిజన్ ప్యానళ్లలో చైనా ఉత్పత్తుల వాటా అధికం. ఫలితంగ టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చైనాలో ప్యానళ్ల ఉత్పత్తి కుటుపడటంతో వాటి ధరలు కనీసం 20 శాతం పెరిగే అవకాశం ఉంది.

news18-telugu
Updated: February 21, 2020, 9:49 PM IST
కరోనా దెబ్బకు టీవీల ధరలు జూమ్...స్మార్ట్ టీవీలు కొనాలంటే ఇక చుక్కలే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కరోనా దెబ్బకు చైనా ప్రజలు ఇళ్లను వదిలి బయకు రావడంలేదు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. మార్కెట్ డిమాండ్ భారీగా పతనమవడంతో అనేక రంగాల వృద్ధి రేటు తిరోగమనంలో పయనిస్తోంది. ముఖ్యంగా కార్ల విక్రయాలపై ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా దెబ్బకు కార్ల అమ్మకాలు 92 శాతం మేర పతనమయ్యాయని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. గత ఏడాది ఇదే సీజన్‌లో 59,930 కార్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది ఏకంగా 4,909కి పడిపోయింది. అమ్మకాలు భారీగా పడిపోవడంతో డీలర్లు షోరూమ్‌లకు తాళాలు వేస్తున్నారు. అటు ఎలక్ట్రానిక్స్ రంగం కూడా కరోనా వైరస్ ప్రభావం పడుతోంది. భారత్‌కు దిగుమతయ్యే టెలివిజన్ ప్యానెళ్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. భారత్‌లో టెలివిజన్ ప్యానళ్లలో చైనా ఉత్పత్తుల వాటా అధికం. ఫలితంగ టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చైనాలో ప్యానళ్ల ఉత్పత్తి కుటుపడటంతో వాటి ధరలు కనీసం 20 శాతం పెరిగే అవకాశం ఉంది. అటు టీవీల ధరలు కూడా 10 శాతం అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు