• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • CORONAVIRUS INSURANCE SCHEME NEW INDIA ASSURANCE CO WILL PROVIDE RS 50 LAKH INSURANCE COVER TO COVID 19 HEALTHCARE WORKERS SS

COVID-19 Insurance: కరోనా వైరస్ ఇన్స్యూరెన్స్ రూ.50 లక్షలు... ఎవరెవరికంటే

COVID-19 Insurance: కరోనా వైరస్ ఇన్స్యూరెన్స్ రూ.50 లక్షలు... ఎవరెవరికంటే

COVID-19 Insurance: కరోనా వైరస్ ఇన్స్యూరెన్స్ రూ.50 లక్షలు... ఎవరెవరికంటే (ప్రతీకాత్మక చిత్రం)

Coronavirus Insurance | కరోనా వైరస్‌పై పోరాడుతున్న వైద్య సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్ ప్రకటించింది.

  • Share this:
    కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా కరోనా వైరస్‌పై పోరాటంలో భాగస్వాములుగా ఉన్న హెల్త్ వర్కర్స్‌కు రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్ ప్రకటించింది కేంద్రం. 90 రోజుల పాటు ఈ ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది. ప్రజారోగ్య సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ లాంటి సుమారు 22.12 లక్షల మందికి ఈ ఇన్స్యూరెన్స్ వర్తిస్తుందని అంచనా. కరోనా వైరస్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వీరి సేవల్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సిబ్బంది సంరక్షణ కోసం ఈ ఇన్స్యూరెన్స్ స్కీమ్‌ను ప్రకటించింది. వైద్య సిబ్బంది కరోనా వైరస్ బారిన పడ్డా, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినా రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది.

    కరోనా వైరస్‌పై పోరాటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఎయిమ్స్, కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన ఆస్పత్రల్లో నియమించిన వైద్య సిబ్బందికి అందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది. కరోనా వైరస్ పేషెంట్లకు సేవలు అందించే ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది, రిటైర్డ్, వాలంటీర్, స్థానిక సంస్థలు, కాంట్రాక్ట్, దినసరి కూలీలు, అడ్‌హక్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఇన్స్యూరెన్స్ పొందొచ్చు. వీరు మాత్రమే కాదు వార్డ్ బాయ్స్, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లు, డాక్టర్లు, స్పెషలిస్టులు, ఇతర హెల్త్ వర్కర్లకు మెడికల్ ఇన్స్యూరెన్స్ స్కీమ్‌లో కవరేజీ లభిస్తుంది.

    న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ వీరికి రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్ కవరేజీ అందించనుంది. 2020 మార్చి 3 నుంచి 90 రోజుల వరకు రిస్క్ కవర్ ఉంటుంది.

    ఇవి కూడా చదవండి:

    Airtel: ఎయిర్‌‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్... బెనిఫిట్స్ ఇవే

    Driving Licence: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

    EPF Withdrawal: ఈపీఎఫ్ విత్‌డ్రా నిబంధనలు మారాయి... కొత్త రూల్స్ ఇదే
    Published by:Santhosh Kumar S
    First published: