హోమ్ /వార్తలు /బిజినెస్ /

ప్రపంచ కుబేరుల సంపదను మింగేసిన కరోనా...ఎంత నష్టపోయారో తెలిస్తే షాకే

ప్రపంచ కుబేరుల సంపదను మింగేసిన కరోనా...ఎంత నష్టపోయారో తెలిస్తే షాకే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచంలో ఉన్న ఫార్చూన్‌ 500 బిలీయనీర్స్‌ సంపద కూడా అంతర్జాతీయ మార్కెట్ల పతనంతో 444 బిలియన్‌ డాలర్లు తగ్గింది.

కరోనా వైరస్‌ ప్రభావంతో స్టాక్‌ మార్కెట్‌లు పతనం కొనసాగుతోంది. ప్రపంచంలో ఉన్న ఫార్చూన్‌ 500 బిలీయనీర్స్‌ సంపద కూడా అంతర్జాతీయ మార్కెట్ల పతనంతో 444 బిలియన్‌ డాలర్లు తగ్గింది. అమెరికా స్టాక్‌ మార్కెట్‌ డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ సూచీ 12 శాతానికిపైగా పడిపోయింది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత వరుసగా ఒక వారంలో మార్కెట్లు పడిపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ప్రపంచ మార్కెట్లలో 6 ట్రిలియన్‌ డాలర్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. బ్లూమ్‌బర్గ్‌ బిలీయనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటిదాక 500 బిలియనీర్లు ఆర్జించిన 78 బిలియన్‌ డాలర్ల సంపద కూడా ఆవిరైపోయింది. ప్రపంచ కుబేరుల్లో మొదటి మూడుస్థానాల్లో ఉన్న అమేజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌, ఎల్‌వీఎంహెచ్‌ చైర్మన్‌ బెర్నాడ్‌ అర్నాల్ట్‌ల సంపదలో 30 బిలియన్‌ డాలర్లు తగ్గాయి. ప్రపంచ కుబేరుల్లో 25వ స్థానంలో ఉన్న రాకెట్‌ మ్యాన్‌ ఎలాన్‌ మస్క్‌ టెస్లా కంపెనీ ఈ వారంలో 9 బిలియన్‌ డాలర్లను కోల్పోయింది.

First published:

Tags: Business, Stock Market

ఉత్తమ కథలు