Home /News /business /

CORONAVIRUS CRISIS STATE BANK OF INDIA SBI SHARES SAFETY TIPS TO AVOID NEW CYBER FRAUDS SS

SBI: ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? ఈ 7 విషయాలు గుర్తుంచుకోండి

SBI: ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? ఈ 7 విషయాలు గుర్తుంచుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

SBI: ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? ఈ 7 విషయాలు గుర్తుంచుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

SBI Safety Tips | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ హోల్డర్లకు హెచ్చరికలు జారీ చేసింది బ్యాంకు. అవేంటో తెలుసుకోండి.

    మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? ఎస్‌బీఐ అకౌంట్‌తో లావాదేవీలు జరుపుతుంటారా? అయితే జాగ్రత్త అంటోంది బ్యాంకు. ఓవైపు ప్రపంచమంతా కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కొంటూ ఉంటే సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలతో టార్గెట్ చేస్తున్నారని హెచ్చరిస్తోంది. ఇటీవల కొత్త మోసాలు బయటపడుతుండటంతో బ్యాంకు అప్రమత్తమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహాయ నిధి పీఎం కేర్స్ పేరుతో నకిలీ యూపీఐ సృష్టించి సైబర్ మోసగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్న విషయం బయటపడ్డ సంగతి తెలిసిందే. ఇలాంటి కొత్త మోసాలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది ఎస్‌బీఐ. ఏదైనా క్లిక్ చేసేముందు జాగ్రత్త అంటూ 7 సేఫ్టీ టిప్స్ సూచిస్తోంది. అవేంటో తెలుసుకోండి.


    SBI Safety Tips: ఎస్‌బీఐ 7 సేఫ్టీ టిప్స్ ఇవే...


    1. విరాళాల పేరుతో క్రియేట్ చేసిన నకిలీ యూపీఐ ఐడీలతో జాగ్రత్త. విరాళాలు ఇచ్చేముందు ఓసారి ఆలోచించండి.
    2. మీరు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేముందు ఎవరికి పంపుతున్నారో చెక్ చేసుకోండి.
    3. ఇ-కామర్స్ సైట్లల్లో మీ కార్డు వివరాలు సేవ్ చేయొద్దు.
    4. ఇమెయిల్స్‌లో ఎలాంటి సున్నితమైన సమాచారాన్ని ఇవ్వకూడదు.
    5. కరోనా వైరస్ సమాచారం, వార్తల పేరుతో వచ్చే లింక్స్‌ని క్లిక్ చేయకూడదు.
    6. విశ్వసనీయమైన సోర్స్ నుంచి సేకరించిన వాస్తవాలనే షేర్ చేయండి.
    7. ఏవైనా మోసాలను గుర్తిస్తే కంప్లైంట్ చేయండి.

    మీరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇవి కూడా చదవండి:

    Arogya Sanjeevani Policy: గుడ్ న్యూస్... ఆరోగ్య సంజీవని పాలసీ వచ్చేసింది

    Work From Home: ఈ గ్యాడ్జెట్స్, యాప్స్ ఉంటే మీ ఇల్లే ఆఫీస్‌గా మారిపోతుంది

    Moratorium on EMI: మీరు చెల్లించాల్సిన ఈఎంఐ వాయిదా వేయండి ఇలా
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank, Bank account, Banking, CYBER CRIME, Sbi, State bank of india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు