కరోనా ఎఫెక్ట్... లోన్ కావాలా అంటూ... కాల్ చెయ్యని బ్యాంకులు...

Corona Lockdown | Corona Update : కరోనా ఎఫెక్ట్ బ్యాంకులపై బాగా కనిపిస్తోంది. లోన్ కోసం చేసే ఫోన్ కాల్స్ ఆపేయడమే కాదు... క్రెడిట్ కార్డుల లిమిట్ కూడా తగ్గించేస్తున్నాయి బ్యాంకులు.

news18-telugu
Updated: April 29, 2020, 12:32 PM IST
కరోనా ఎఫెక్ట్... లోన్ కావాలా అంటూ... కాల్ చెయ్యని బ్యాంకులు...
కరోనా ఎఫెక్ట్... లోన్ కావాలా అంటూ... కాల్ చెయ్యని బ్యాంకులు... (File)
  • Share this:
Corona Lockdown | Corona Update : కరోనా లాక్‌డౌన్‌కి ముందు వరకు... దేశంలోని ప్రతి ఒక్కరికీ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి ఫోన్ కాల్స్ వస్తూనే ఉండేవి. పర్సనల్ లోన్ కావాలా, హౌస్ లోన్ కావాలా, కారుకు ఫైనాన్స్ కావాలా... ఇలా రకరకాల లోన్లు కావాలా అంటూ... బ్యాంకు ఉద్యోగుల నుంచి కాల్స్ వచ్చేది. రోటీన్‌గా చాలా మంది ఆ కాల్స్‌కి "నో" అని రిప్లై ఇచ్చేవారు. ఐతే... ఇండియాలో కరోనా లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి బ్యాంకులు ఈ కాల్స్ చెయ్యడం ఆపేశాయి. మిగతా వ్యాపారాల్లాగా బ్యాంకులు మూతపడ్డాయా అంటే అలాంటిదేమీ లేదు. తక్కువ మంది ఉద్యోగులతో, తక్కువ పని గంటలతో పనిచేస్తూనే ఉన్నాయి.

మరి కాల్స్ ఎందుకు చెయ్యట్లేదంటే... కారణం ఒకటే... లాక్‌డౌన్ టైమ్... ప్రజల దగ్గర డబ్బు లేదు. ఇలాంటి సమయంలో లోన్లు ఇస్తే... కడతారన్న గ్యారెంటీ లేదని బ్యాంకులు బావిస్తున్నాయి. ఇప్పటికే ఇంటి అద్దెలు, EMIలు కట్టేందుకే చేతిలో డబ్బు లేని ప్రజలకు లోన్లు ఇస్తే... వాటిని ఇన్‌స్టాల్‌మెంట్లలో తీర్చలేక... కరోనా వంక పెట్టి ఎగ్గొడతారని బ్యాంకులు బావిస్తున్నాయి. అందుకే... ఒక్కటంటే ఒక్కటీ కాల్ రావట్లేదు.

కానీ ప్రజలకు నిజంగా లోన్ కావాల్సింది ఇప్పుడే. మామూలు రోజుల్లో ఎలాగూ శాలరీలు వస్తాయి కాబట్టి... అప్పుడు లోన్ అవసరాలు ఏముంటాయి? ఇప్పుడు నిజంగానే డబ్బు లేనప్పుడు లోన్లు ఇస్తే... అదే కదా అసలైన సాయం అంటే. కానీ బ్యాంకులు ఇప్పుడు అతి తెలివి లెక్కలు వేసుకుంటూ... తమ బిజినెస్, తమ లాభం, తమ స్వార్థం తాము చూసుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

ఇదే కాదు... క్రెడిట్ కార్డుల లిమిట్ కూడా తగ్గించేస్తున్నాయి. ఎవరైనా లాక్‌డోన్ కారణం చెప్పి... బిల్లు చెల్లించకుండా మారటోరియం ఆప్షన్ ఎంచుకునే కస్టమర్లకు కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డ్ లిమిట్ తగ్గించేస్తున్నాయన్న కంప్లైంట్లు ఆన్‌లైన్‌లో వస్తున్నాయి. కొందరి క్రెడిట్ కార్డ్ లిమిట్ ఏకంగా 80% తగ్గిపోయిందన్నది ఓ కంప్లైంట్ సారాంశం. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా క్రెడిట్ కార్డు బిల్లులపై మూడు నెలల మారటోరియం ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. ఈ మారటోరియం ఆప్షన్ ఎంచుకున్నవారికి రూల్ ప్రకారం క్రెడిట్ కార్డ్ లిమిట్ ఏమాత్రం తగ్గకూడదు. కానీ బ్యాంకులు తగ్గించేస్తున్నాయన్నది వినిపిస్తున్న మాట.

ఇలా బ్యాంకులు ఆపద కాలంలో ప్రజలకు తోడుగా ఉండాల్సింది పోయి... మరిన్ని సమస్యలు సృష్టిస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.
First published: April 29, 2020, 12:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading