• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • CORONA UPDATE ANANTHAPURAM KIA MOTORS COMPANY RE STARTS ITS PRODUCTION NK

అనంతపురం కియా ఫ్యాక్టరీలో కార్ల ఉత్పత్తి ప్రారంభం

అనంతపురం కియా ఫ్యాక్టరీలో కార్ల ఉత్పత్తి ప్రారంభం

ప్రతీకాత్మక చిత్రం

Corona Lockdown | Corona Update : ఇది నిజంగా ప్రజలకు ఊరట కలిగించే అంశమే. కియా పరిశ్రమ తిరిగి ప్రారంభం అవ్వడం... మిగతా పరిశ్రమలకు ఊతమిచ్చేదే.

  • Share this:
    Corona Lockdown | Corona Update : కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం లాక్‌డౌన్ 3లో వెసులుబాట్లు ఇవ్వడంతో... రూల్స్ ప్రకారం... అనంతపురం జిల్లా... పెనుకొండ మండలంలోని అంతర్జాతీయ కియా మోటర్స్ (KIA Motors) కార్ల పరిశ్రమలో ఉత్పత్తి మళ్లీ మొదలైంది. దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ... లాక్‌డౌన్ విధించిన మార్చి 25 తర్వాత మూతపడింది. ఉద్యోగులు విధులకు రావొద్దని తెలిపింది. దాంతో... చాలా మంది ఆందోళన చెందారు. తమ ఉద్యోగాలు పోతాయేమో అనుకున్నారు. కానీ... కియా కంపెనీ... తిరిగి ప్రారంభం కావడంతో... ఉద్యోగుల్లో కాన్ఫిడెన్స్ పెరిగింది. మొత్తం 42 రోజులు కంపెనీలో ఉత్పత్తి ఆగిపోయింది. ప్రస్తుతం 700 మందితో... ఈ నెల 7 నుంచి ఉత్పత్తి ప్రారంభించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

    లాక్‌డౌన్ సమయంలో... కియా కంపెనీ... తమిళనాడుకు తరలిపోతుందనీ, ఈ దిశగా చర్చలు జరుపుతోందనీ ప్రముఖ రాయిటర్స్ వార్తా సంస్థ ఓ కథనం ఇవ్వడం అప్పట్లో కలకలం రేగింది. అలాంటి ఉద్దేశం ఏదీ లేదనీ... తాము మరింత ఎక్కువ ఉత్పత్తి చేపట్టే దిశగా ప్లాన్స్ ఉన్నాయని కియా అప్పట్లో తెలిపింది. ఆ మాట నిలబెట్టుకుంటూ... ఇప్పుడు మళ్లీ జోరుగా కార్ల ఉత్పత్తి చేపడుతోంది.

    కియా చాలా పెద్ద కంపెనీ కాబట్టి... అది తిరిగి ప్రారంభం కావడం... మిగతా కంపెనీలకు కొంత ప్రోత్సాహంలా ఉంటుంది. ఆ కంపెనీలు కూడా తిరిగి ప్రారంభం అయ్యేందుకు ప్లాన్స్ వేసుకునేందుకు వీలవుతుంది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు