బయోకాన్ నుంచి మరో కరోనా మందు విడుదల..ఈ సారి ఇంజెక్షన్ రూపంలో...

కరోనా చికిత్సలో బయోలిజుమాబ్ ఇటోలిజుమాబ్ ఇంజెక్షన్‌ డాక్టర్ సిఫార్సుపై ఇచ్చేందుకు అనుమతించింది. DCGI ప్రకారం, ఈ ఇంజెక్షన్ కరోనాతో తీవ్రమైన అనారోగ్యం ఎదుర్కొంటున్న రోగులకు చికిత్స చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

Krishna Adithya | news18-telugu
Updated: July 12, 2020, 6:38 PM IST
బయోకాన్ నుంచి మరో కరోనా మందు విడుదల..ఈ సారి ఇంజెక్షన్ రూపంలో...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ప్రముఖ ఫార్మా కంపెనీ BIOCON నుంచి కరోనా మందు Itolizumab Injectionకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డిసిజిఐ అనుమతి ఇచ్చింది. కరోనా చికిత్సలో బయోలిజుమాబ్ ఇటోలిజుమాబ్ ఇంజెక్షన్‌ డాక్టర్ సిఫార్సుపై ఇచ్చేందుకు అనుమతించింది. DCGI ప్రకారం, ఈ ఇంజెక్షన్ కరోనాతో తీవ్రమైన అనారోగ్యం ఎదుర్కొంటున్న రోగులకు చికిత్స చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. క్లినికల్ ట్రయల్స్ తరువాత కరోనా రోగులపై ఈ ఇంజెక్షన్ ద్వారా సంతృప్తికరమైన ఫలితాలు కనిపించాయి. సిరోసిస్ ఉన్న రోగులకు చికిత్స చేయడానికి ఈ ఇంజెక్షన్లు గత కొన్నేళ్లుగా ఉపయోగిస్తున్నారు.

ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ ఇంజెక్షన్ ఎటోలిజుమాబ్‌ను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించేలా DCGI ఆమోదించింది. కరోనా ఉన్న రోగులపై ఈ ఇంజెక్షన్ వాడకం ప్రయత్నించారు. మంచి ఫలితాలు వచ్చిన తర్వాతే ఈ ఇంజెక్షన్ వాడాలని నిర్ణయించారు.

ఎయిమ్స్ సహా ఇతర ఆసుపత్రుల నుండి శ్వాసకోశ నిపుణులు, ఫార్మసిస్ట్‌లు, ఔషధ నిపుణుల కమిటీ కోవిడ్ -19 రోగులపై ఈ ఇంజెక్షన్ యొక్క క్లినికల్ ట్రయల్స్‌ను పరిశీలించినట్లు ఒక అధికారి తెలిపారు. ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నట్లు కనుగొన్న తర్వాత ఈ ఇంజెక్షన్ వాడకం ఆమోదించారు. అయితే, వైద్యులు దీనిని ఉపయోగించే ముందు రోగికి సమాచారం ఇవ్వవలసి ఉంటుంది దీని ఆమోదం కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
Published by: Krishna Adithya
First published: July 12, 2020, 6:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading