CORONA KAVACH AND CORONA RAKSHAK POLICIES WILL GIVE COVERAGE FOR COVID 19 TREATMENT KNOW ABOUT THESE POLICY DETAILS SS
Covid-19: కరోనా చికిత్స కోసం ఇన్స్యూరెన్స్ కావాలా? బెస్ట్ పాలసీలు ఇవే
COVID-19: కరోనా చికిత్స కోసం ఇన్స్యూరెన్స్ కావాలా? బెస్ట్ పాలసీలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
Covid-19 Policy | కోవిడ్ 19 చికిత్స కోసం ప్రత్యేకంగా ఓ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారా? రెండు పాలసీలు (Covid Policy) అందుబాటులో ఉన్నాయి. ఈ పాలసీలు తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి.
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron Cases) విజృంభిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజల్లో మళ్లీ భయాందోళనలు కనిపిస్తున్నాయి. గతేడాది కరోనా వైరస్ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభించిన రోజులు గుర్తొస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తుండటంతో హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ (Health Insurance) తీసుకోవాలన్న ఆలోచన పెరుగుతోంది. ఇప్పటికే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉన్నవారికి ఇబ్బంది లేదు. ఐఆర్‌డీఏఐ నిబంధనల ప్రకారం ఇప్పటికే హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ ఉన్నవారికి కోవిడ్ 19 సంబంధిత ఆస్పత్రి ఖర్చులన్నీ అందులోనే కవర్ అవుతాయి.
ఇక ఉద్యోగులకు కంపెనీ ఇచ్చే హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో కూడా కోవిడ్ 19 కవరేజీ ఉంటుంది. ఎంప్లాయర్ ఇచ్చే హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలో ముందే ఉన్న వ్యాధులకు ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ ఉండదు. పీపీఈ కిట్స్, హోమ్ ట్రీట్మెంట్ లాంటివి కూడా కవర్ అవుతాయి. ఒకసారి పాలసీ డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని నిర్థారించుకోవాలి.
హెల్త్ ఇన్స్యూరెన్స్ లేనివాళ్లు కరోనా చికిత్స కోసం ప్రత్యేక పాలసీ గురించి ఆలోచిస్తున్నారు. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) కోవిడ్ 19 చికిత్స కోసం ప్రత్యేకంగా కరోనా కవచ్, కరోనా రక్షక్ పేరుతో రెండు పాలసీలను ప్రకటించింది. ఈ రెండూ షార్ట్ టర్మ్ పాలసీలు. గరిష్టంగా 9.5 నెలలు మాత్రమే ఈ పాలసీ పనిచేస్తుంది. కేవలం కోవిడ్ 19 కారణంగా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యేవారికి మాత్రమే కవరేజీ ఉంటుంది.
కరోనా కవచ్
కరోనా కవచ్ షార్ట్ టర్మ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ. ఆస్పత్రిలో 24 గంటల కన్నా ఎక్కువగా అడ్మిట్ అయితే ఆస్పత్రి ఖర్చుల్ని రీఇంబర్స్ చేస్తుంది. ఇందులో రూమ్ రెంట్ లిమిట్ ఉండదు. పీపీఈ కిట్స్, మాస్కులు, ఇతర ఛార్జీలు కవర్ అవుతాయి. ముందే ఇతర వ్యాధులతో బాధపడేవారికి కూడా హాస్పిటలైజేషన్ కవరేజీ ఉంటుంది. ప్రతీ ఇన్స్యూరెన్స్ కంపెనీ కరోనా కవచ్ పాలసీని అందిస్తోంది. అయితే పాలసీ తీసుకున్న మొదటి 15 రోజుల్లో క్లెయిమ్ చేసుకోలేరు.
కరోనా రక్షక్ షార్ట్ టర్మ్ సప్లిమెంటరీ పాలసీ. ఒకరికి రూ.2,50,000 వరకు ఫిక్స్‌డ్ క్యాష్ బెనిఫిట్ లభిస్తుంది. కోవిడ్ 19 పాజిటీవ్‌తో చికిత్స పొందినవారు క్లెయిమ్ చేసుకోవచ్చు. 72 గంటల కన్నా ఎక్కువ ఆస్పత్రిలో ఉంటేనే కవరేజీ లభిస్తుంది.
వీటిలో ఏ పాలసీ తీసుకున్నా కోవిడ్ లక్షణాలు తక్కువగా ఉండి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటే కవరేజీ వర్తించదు. వైద్యపరంగా అవసరమై ఆస్పత్రిలో చేరితేనే కవరేజీ ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. హోమ్ క్వారెంటైన్ కూడా కవర్ కాదు. ఆస్పత్రుల్లో బెడ్స్ లేని సందర్భాల్లో ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటే హోమ్ క్వారెంటైన్‌కు కవరేజీ లభిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.