కూరగాయల నుంచి మెడిసిన్ వరకు... అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ధరల పెరుగుదలతో (Price Hike) ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడు సామాన్యులకు కాస్త ఊరటనిచ్చేలా కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వంట నూనెల ధరలు (Cooking Oil Prices) భారీగా తగ్గుతున్నాయి. కొంతకాలంగా వంట నూనెల ధరలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో సన్‌ఫ్లవర్ ఆయిల్ (Sunflower Oil) సరఫరా, ఇండోనేషియా నిషేధంతో పామాయిల్ ఎగుమతులు స్తంభించాయి. దీంతో వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఎడిబుల్ ఆయిల్ ధరలు కాస్త తగ్గడంతో భారతదేశంలో కూడా వంటనూనెల ధరలు తగ్గాయి. మరోవైపు ప్రభుత్వం ముడి పామాయిల్, సోయా ఆయిల్ యొక్క బేస్ దిగుమతి ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. 2024 వరకు సంవత్సరానికి 20 లక్షల మెట్రిక్ టన్నుల ముడి పొద్దుతిరుగుడు, సోయా నూనెను సుంకం లేకుండా దిగుమతికి అనుమతించింది. ఇలా ప్రభుత్వం కూడా ధరల్ని కిందకు తెచ్చేందుకు పలు నిర్ణయాలు తీసుకోవడంతో వంటనూనెల ధరలు తగ్గాయి.
EPFO Rules: ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులున్నాయా? ఈ పనిచేయకపోతే నష్టం తప్పదు
అదానీ విల్మర్, పతంజలి, మదర్ డెయిరీ, ఇమామి అగ్రోటెక్ లాంటి కంపెనీలన్నీ వంట నూనెల ధరల్ని తగ్గించాయి. లీటర్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు ధర తగ్గింది. ఫ్రీడమ్, జెమినీ బ్రాండ్లతో వంటనూనెల్ని అమ్మే జెమినీ ఎడిబిల్స్ అండ్ ఫ్యాట్స్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరను రూ.20 తగ్గించింది. దీంతో లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర రూ.200 కి తగ్గింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగినందున ప్రస్తుతానికి తగ్గిస్తున్నట్లు కంపెనీ ఇటీవల ప్రకటించింది. తగ్గిన ధరలతో సన్‌ఫ్లవర్ ఆయిల్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది.
ఇక మదర్ డైరీ కూడా ధార ఎడిబిల్ ఆయిల్స్ ధరల్ని తగ్గించింది. ఆవ నూనె, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరను లీటర్‌కు రూ.15 వరకు తగ్గించింది. ధార సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్ ధర ప్రస్తుతం రూ.235 ఉండగా, ఆవ నూనె రూ.210 గా ఉంది. కంపెనీ రూ.15 వరకు ధర తగ్గింది. తగ్గిన ధరలతో ఆవ నూనె, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ అందుబాటులోకి వచ్చింది.
Card Payments: ఇక ఆ పేమెంట్స్‌కి ఓటీపీ అవసరం లేదు... క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ రూల్స్ మారాయి
మరోవైపు అదానీ విల్మర్ కూడా ఫార్చ్యూన్ బ్రాండ్ ఆయిల్ ధరల్ని తగ్గించింది. లీటర్‌పై రూ.10 ధర తగ్గించింది. తగ్గిన ధరలతో ఫార్చ్యూన్ ఆయిల్ మార్కెట్లోకి వచ్చింది. లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర రూ.220 నుంచి రూ.210 కి తగ్గింది. ఫార్చ్యూన్ సోయాబీన్, ఆవననె ధర రూ.205 నుంచి రూ.195 కి తగ్గింది. పతంజలి ఆయుర్వేద్ కూడా వంట నూనెల ధరల్ని 7 శాతం నుంచి 10 శాతం తగ్గించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cooking oil, Edible Oil, Mustard Oil, Oil prices, Personal Finance, Sunflower oil