కేంద్ర ప్రభుత్వం కొత్త కార్మిక చట్టాలను (New Labour Laws) అమలు చేయనుంది. వీటికి పలు రాష్ట్రాల ఆమోదముద్ర పడాల్సి ఉంది. కొత్త కార్మిక చట్టాలు అమలు చేస్తే ప్రైవేట్ రంగ ఉద్యోగులకు (Private Sector Employees) సంబంధించి అనేక అంశాల్లో మార్పులు రానున్నాయి. టేక్ హోమ్ సాలరీ, ప్రావిడెంట్ ఫండ్‌కు కంట్రిబ్యూషన్, పనివేళలు... ఇలా అనేక అంశాల్లో మార్పులు వస్తాయి. కొత్త లేబర్ కోడ్స్‌లో ఉన్న ప్రతిపాదనలు అమల్లోకి వస్తే రిటైర్మెంట్ కార్పస్ కూడా పెరగనుంది. దీంతోపాటు గ్రాట్యుటీ మొత్తం కూడా పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాలను సమీక్షించి, వాటిని కలిపి కేవలం నాలుగు లేబర్ కోడ్స్ మాత్రమే రూపొందించిన సంగతి తెలిసిందే.
గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972 ప్రకారం, 10 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులు ఉన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి, ఐదేళ్లపాటు నిరంతరం సేవలు అందించిన తర్వాత గ్రాట్యుటీ ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇవే రూల్స్ అమల్లో ఉన్నాయి. అయితే ఫిక్స్డ్ టర్మ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక ఏడాది సర్వీస్ అందించిన తర్వాత గ్రాట్యుటీ క్లెయిమ్ చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేస్తోందన్న వార్తలొస్తున్నాయి. త్వరలో అమలుచేయబోయే కొత్త లేబర్ చట్టాల్లో ఈ మార్పులు ఉన్నట్టు తెలుస్తోంది.
Free Petrol: 53 లీటర్ల పెట్రోల్ ఉచితం... ఈ క్రెడిట్ కార్డ్‌పై ఆఫర్
ఈ వార్తలు నిజమైతే కొత్త లేబర్ చట్టాలు అమలులోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ ఉద్యోగులు ఒక ఏడాది సర్వీస్ పూర్తి కాగానే గ్రాట్యుటీని క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ కంపెనీ సాధారణ పేరోల్స్‌లో ఉన్నవారికి, గ్రాట్యుటీ నిబంధనలు ప్రస్తుతం ఉన్నట్టుగానే ఉంటాయి. కొత్త సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాల కోడ్ ప్రకారం, ఫిక్స్డ్-టర్మ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లింపుల కోసం ఐదేళ్ల సర్వీస్ రూల్‌ను సడలించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఫిక్స్డ్-టర్మ్ ఉద్యోగులు అంటే కాంట్రాక్టు వ్యవధి ముగియడంతో వారి ఉద్యోగం ముగుస్తుంది.
కాంట్రాక్టు ఉద్యోగులకు గ్రాట్యుటీ ప్రయోజనాలను విస్తరించడం ద్వారా, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు సామాజిక భద్రతను విస్తృతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఎక్కువగా కార్మికులు, ఫ్యాక్టరీ ఆపరేటర్లు, సహాయకులు, డ్రైవర్లు లాంటి తక్కువ స్థాయి సిబ్బంది ఉంటారు. అయితే, రెగ్యులర్ ఉద్యోగులు కంపెనీలో ఐదేళ్ల నిరంతర సర్వీసు తర్వాతే గ్రాట్యుటీ పొందడానికి అర్హులు అవుతారు.
Save Money: ప్రతి నెలా రూ.500 ఇన్వెస్ట్మెంట్... రూ.2.5 లక్షలకుపైగా రిటర్న్స్... పూర్తి వివరాలు ఇవే
ప్రస్తుత చట్టం ప్రకారం, బేసిక్ వేతనం, డియర్నెస్ అలవెన్స్ ఆధారంగా గ్రాట్యుటీ లెక్కించబడుతుంది. ప్రతీ సర్వీస్ ఇయర్‌కు 15 రోజుల బేసిక్ పే, డియర్నెస్ అలవెన్సును గ్రాట్యుటీగా చెల్లిస్తారు. చివరి వేతనంలోని బేసిక్ పే, డియర్నెస్ అలవెన్సును పరిగణలోకి తీసుకుంటారు. గ్రాట్యుటీ లెక్కించడం కోసం 26 రోజుల్ని ఒక నెలగా లెక్కిస్తారు. గరిష్టంగా రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీ పొందవచ్చు. ఇక కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం మొత్తం వేతనంలో 50 శాతం బేసిక్ పే ఉండాలి. బేసిక్ పే పెరుగుతుంది కాబట్టి గ్రాట్యుటీ కూడా పెరుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EPFO, New Labour Codes, Personal Finance, Retirement