Home /News /business /

CONSUMER RIGHTS WATCHDOG NOTICES TO OLA UBER OVER 3200 COMPLAINTS IN 1 MONTH HERE DETAILS NS GH

Uber, Ola get notices: ఓలా, ఉబర్ సంస్థలకు నోటీసులు.. 15 రోజుల్లో స్పందించాలని ఆదేశం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓలా, ఉబర్ సంస్థకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ షాక్ ఇచ్చింది. వ్యాపార నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు వినియోగదారుల హక్కులను నిర్లక్ష్యం చేస్తోందన్న ఆరోపణల కింద నోటీసులు జారీ చేసింది.

ఓలా, ఉబర్ సంస్థకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ షాక్ ఇచ్చింది. వ్యాపార నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు వినియోగదారుల హక్కులను నిర్లక్ష్యం చేస్తోందన్న ఆరోపణల కింద నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా వినియోగదారుల ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వ్యవస్థ లేకపోవడం, సేవల్లో లోపాలు, అధికమొత్తంలో క్యాన్సిలేషన్ చార్జీలు విధించడం, అధిక చార్జీల మోత వంటి అంశాలను ఓలా, ఉబర్ సంస్థకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. అన్యాయమైన వాణిజ్య విధానాలను అనుసరించడం తో పాటు వినియోగదారుల హక్కుల్ని ఉల్లంఘిస్తుండటంపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం రెండు సంస్థలకూ నోటీసులు జారీ చేసినట్లు పేర్కింది. తాము ఇచ్చిన నోటీసులకు 15 రోజుల్లోపు సమాధానం ఇవ్వాలని గడువును నిర్దేశించింది. ఓలా ఉబర్ సంస్థలకు మేం నోటీసులు జారీ చేశామని సీసీపీఏ ముఖ్య కమిషనర్ నిధి ఖారే తెలిపారు. అలాగే గత ఏడాది కాలంలో వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో చాలా వరకు సేవల్లో లోపాలు, అన్యాయమైన వాణిజ్య విధానాలకు సంబంధించినవే ఉన్నాయని ఆయన వెల్లండించారు.

రీఫండ్‌ చేయలేదని ఓలాపై 521 ఫిర్యాదులు..
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి మే 1వ తేదీ వరకు ఓలాపై మొత్తం 2,482 ఫిర్యాదులు అందాయి. అందులో క్యాబ్స్‌పై సేవా లోపాల కింద 1340 ఫిర్యాదులు, చెల్లించిన మొత్తాన్ని తిరిగి రిఫండ్ చేయకపోవడం కింద 521 ఫిర్యాదులు, అన్‌ఆథరైజ్డ్ ఛార్జీల కింద 174, ఎంఆర్పీ కంటే అధిక మొత్తంలో చార్జీలు చేస్తున్నందుకు 139, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని వినియోగదారుల నుంచి 62 ఫిర్యాదులు, ఎకౌంట్ రద్దు చేయడం, సేవలు అందించకపోవడం వంటి సమస్యలను లేవనెత్తుతూ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి 50 ఫిర్యాదులు అందాయి. ఇదే కాకుండా సేవల్లో జాప్యం లేదా సేవలు అందించకపోవడం వంటి సమస్యల కింద 31 ఫిర్యాదులు, లబ్ధిదారులకు అందాల్సిన మొత్తం అందకపోవడం కింద 29 ఫిర్యాదులు, మోసపూరితమైన తప్పిదాలు పేరుతో 12 ఫిర్యాదులు, సెక్టార్ ఎంక్వైరీ పేరిట 72 ఫిర్యాదులు, ఇతర నేరాల కింద 52 ఫిర్యాదులు అందినట్టు నేషనల్ కన్సూమర్ హెల్ప్ లైన్ వెల్లడించింది.

ఉబర్‌పై మొత్తం 770..
ఉబర్ క్యాబ్స్‌పై మొత్తం 770 ఫిర్యాదుల అందాయి. అందులో సేవా లోపాల కింద 473 ఫిర్యాదులు, చెల్లించిన మొత్తాన్ని తిరిగి రిఫండ్ చేయకపోవడం కింద 105 ఫిర్యాదులు, ఎంఆర్పీ కంటే అధిక మొత్తంలో చార్జీలు చేస్తున్నందుకు 37, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదంటూ వినియోగదారుల నుంచి 18 ఫిర్యాదులు, అన్‌ఆథరైజ్డ్ ఛార్జీల కింద 38, సేవల్లో జాప్యం లేదా సేవలు అందించకపోవడం వంటి సమస్యల కింద 17 ఫిర్యాదులు, ఎకౌంట్ రద్దు చేయడం, సేవలు అందించకపోవడం వంటి సమస్యలను లేవనెత్తుతూ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి 50 ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అలాగే లబ్ధిదారులకు అందాల్సిన మొత్తం అందకపోవడం కింద 7 ఫిర్యాదులు, మోసపూరితమైన తప్పిదాలు కింద 11 ఫిర్యాదులు, సెక్టార్ ఎంక్వైరీ పేరిట 30 ఫిర్యాదులు, ఇతర నేరాల కింద 20 ఫిర్యాదులు అందినట్టు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ స్పష్టం చేసింది.

ఈ మొత్తం ఫిర్యాదుల్లో ఓలాపై 54 శాతం, ఉబర్ పై 64 శాతం ఫిర్యాదులు కేవలం సేవల లోపాలకు సంబంధించనవే కావడం గమనార్హం. ఇటీవల క్యాబ్ అగ్రిగేటర్స్ సంస్థలతో సమావేశమైన కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ వినియోగదారుల ఫిర్యాదుల్ని పరిష్కరించే అంశంలో మెరుగుపడకపోతే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Ola, Uber

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు