Home /News /business /

CONSUMER FORUM DIRECTS STATE BANK OF INDIA AND SBI LIFE INSURANCE TO PAY RS 120000 TO COMPLAINANT FOR CANCELLING INSURANCE POLICY HOME LOAN SS

SBI Home Loan: హోమ్ లోన్ తీసుకున్నవారికి కనువిప్పు కలిగించే సంఘటన ఇది... ఏం జరిగిందంటే

SBI Home Loan: హోమ్ లోన్ తీసుకున్నవారికి కనువిప్పు కలిగించే సంఘటన ఇది... ఏం జరిగిందంటే
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Home Loan: హోమ్ లోన్ తీసుకున్నవారికి కనువిప్పు కలిగించే సంఘటన ఇది... ఏం జరిగిందంటే (ప్రతీకాత్మక చిత్రం)

SBI Home Loan | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI హోమ్ లోన్ డిపార్ట్‌మెంట్‌తో పాటు ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీకి వినియోగదారుల ఫోరమ్ షాకిచ్చింది. బాధితులకు రూ.1,20,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అసలేం జరిగిందో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    సాధారణంగా ఎవరైనా హోమ్ లోన్ తీసుకుంటే హోమ్ లోన్‌తో పాటు ఇన్స్యూరెన్స్ కూడా ఇస్తాయి బ్యాంకులు, ఫైనాన్సింగ్ కంపెనీలు. హోమ్ లోన్ చెల్లిస్తున్న కాలంలో లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఇన్స్యూరెన్స్ ద్వారా తమ లోన్ క్లియర్ చేసుకోవచ్చన్న ఆలోచనతో ఇన్స్యూరెన్స్‌ ప్రీమియం వసూలు చేస్తాయి. ప్రస్తుతం అన్ని బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థలో హోమ్ లోన్‌తో పాటు ఇన్స్యూరెన్స్ కూడా బండిల్‌గా ఇస్తున్నాయి. ఇందుకోసం కస్టమర్ల నుంచి ప్రీమియం కూడా వసూలు చేస్తాయి. కస్టమర్లు కూడా బీమా లభిస్తుందన్న కారణంతో ప్రీమియం చెల్లించేందుకు అంగీకరిస్తారు. కానీ హైదరాబాద్‌లో ఓ సంఘటన హోమ్ లోన్ కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది. కనువిప్పు కలిగిస్తుంది.

    చిన్న వెంకట రమణ అనే వ్యక్తి 2011 ఆగస్ట్ 4న అప్పటి ఎస్‌బీఐ(గతంలో SBH) డబీర్‌పుర బ్రాంచ్‌లో రూ.8.38 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారు. ఇన్స్యూరెన్స్‌తో పాటు లోన్ రిస్క్ ఇన్స్యూరెన్స్ కవరేజీ కోసం సురక్ష లోన్ బీమా కూడా తీసుకున్నాడు. ఏడేళ్ల తర్వాత అంటే 2018 సెప్టెంబర్ 12న చిన్న వెంకట రమణ అనారోగ్యంతో చనిపోయారు. అప్పటి వరకు రెగ్యులర్‌గా ఈఎంఐలు చెల్లిస్తూ వచ్చాడు. ఆయన తీసుకున్న హోమ్ లోన్‌కు రిస్క్ ఇన్స్యూరెన్స్ కవరేజీ ఉంది కాబట్టి తర్వాతి ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. చిన్న వెంకట రమణ భార్య జే.సుజాత్ తన భర్త డెత్ సర్టిఫికెట్ సమర్పించి రిస్క్ కవరేజీలో భాగంగా ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్ మినహాయించాలని, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ రిలీజ్ చేయాలని బ్యాంకు అధికారులను కోరారు.

    SBI Credit Card Limit: మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ తక్కువ ఉందా? పెంచుకోండి ఇలా

    SBI: అలర్ట్... ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? ఈ కొత్త రూల్ అమల్లోకి వచ్చేసింది

    ఇక్కడే బ్యాంకు అధికారులు షాక్ ఇచ్చారు. లోన్ మాఫీ చేయలేదు. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇవ్వలేదు. దీంతో బాధితురాలు ఆర్‌టీఐ ద్వారా వివరాలు సేకరించారు. సురక్ష లోన్ ఇన్స్యూరెన్స్ పాలసీ క్యాన్సిల్ చేసినట్టు తమకు సమాచారం ఇవ్వలేదని తేలింది. సురక్ష ఇన్స్యూరెన్స్ కోసం మొదటి ఏడాది రూ.8,958 ప్రీమియం వసూలు చేసిన బ్యాంకు పాలసీ క్యాన్సిల్ చేసినట్టు తమకు సమాచారం ఇవ్వలేదంటూ వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. సురక్ష కవరేజీలో భాగంగా లోన్ మాఫీ చేయకుండా బ్యాంకు ప్రతినిధులు ఇంటికి వచ్చి లోన్ చెల్లించాలని తనను, తన పిల్లల్ని వేధిస్తున్నారని వినియోగదారుల ఫోరమ్‌కు ఫిర్యాదు చేశారు.

    ATM: ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందా? బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలు ఇవే

    PMSYM Scheme: మీ జీతం రూ.15,000 లోపేనా? ఈ పెన్షన్ స్కీమ్ మీకోసమే

    దీనిపై ఎస్‌బీఐ స్పందిస్తూ లోన్ తీసుకున్న వ్యక్తికి ఇన్స్యూరెన్స్ పాలసీ నిరాకరించినట్టు తెలుసని, ఆయన ఉద్దేశపూర్వకంగా లోన్ ఎగవేశారంటూ సమాధానమిచ్చింది. మరోవైపు ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ తమకూ, ఫిర్యాదుదారుకు ఎలాంటి సంబంధం లేదని స్పందించింది. అయితే సురక్ష ఇన్స్యూరెన్స్ కింద రూ.13,653 ఔట్‌స్టాండింగ్ అమౌంట్‌లో ఉన్నట్టు బెంచ్ విచారణలో తేలింది. అంటే పాలసీ ఉన్నట్టేనని బెంచ్ ధృవీకరించింది. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఒరిజినల్ టైటిల్ డీడ్ రిలీజ్ చేయడంతో బాటు బాధితురాలికి రూ.1,20,000 పరిహారం చెల్లించాలని బెంచ్ ఆదేశించింది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank loans, Home loan, Housing Loans, Hyderabad, Hyderabad news, Insurance, Sbi, State bank of india, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు