హోమ్ /వార్తలు /బిజినెస్ /

Buying a House: కొత్త ఇంటిని కొనాలనుకుంటున్నారా? అయితే, ఈ నిపుణుల సూచనలను తప్పక తెలుసుకోండి

Buying a House: కొత్త ఇంటిని కొనాలనుకుంటున్నారా? అయితే, ఈ నిపుణుల సూచనలను తప్పక తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కొత్త ఇంటిని కొనుగోలు చేయడంపై అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఇంటిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారు ఈ కింది విషయాలను పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కరోనా, లాక్‌డౌన్ పరిస్థితుల తరువాత సొంతిటి విలువ ప్రజలకు తెలిసి వచ్చింది. దీంతో ఉద్యోగాలు చేసేవారు చాలామంది ఇల్లు కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో ఆర్థిక సంస్థలు సైతం తక్కువ వడ్డీకే హోమ్ లోన్లు అందించేందుకు ముందుకు వచ్చాయి. గతంలో ఎప్పుడూ లేనంత తక్కువ వడ్డీకి హోమ్‌లోన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంటి నిర్మాణం లేదా కొనుగోళ్లకు వడ్డీ రేట్ల తగ్గుదలనే ప్రామాణికంగా తీసుకోకూడదు అంటున్నారు నిపుణులు. గత కొన్ని నెలలుగా ప్రైవేట్, ప్రభుత్వ రంగ రుణదాతలు హోమ్ లోన్ వడ్డీ రేట్లను రికార్డు స్థాయిలో తగ్గించాయి. బ్యాంకుల్లో ఈ లోన్లపై వడ్డీ పదేళ్ల కనిష్టానికి చేరుకుంది. అయితే ఈ రేట్లలో ఒక శాతం తేడా కూడా కొత్త ఇల్లు కొనాలనే వారికి కలిసివస్తుంది. కొనుగోలుదారులకు కొన్ని సంస్థలు అదనపు ప్రోత్సాహకాలు సైతం అందిస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజుపై రాయితీలు లేదా మినహాయింపులు వంటి ప్రయోజనాలతో పాటు డెవలపర్లు ఇచ్చే డిస్కౌంట్లు సైతం లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుస్తాయి. అయితే కొందరు మాత్రం గృహ రుణాల వడ్డీ రేట్లు మరింత తగ్గే వరకూ వేచిచూసే ధోరణిలో ఉన్నారు.

Gas Cylinder offer: డబ్బులు లేకపోయినా గ్యాస్ సిలిండర్ బుకింగ్... రూ.900 క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా

వాస్తవానికి హోమ్ లోన్ రేట్లు మరింత తగ్గే అవకాశాలను కొట్టిపారేయలేం. దీనికి తోడు మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయినా కూడా కరోనా వంటి అనిశ్చిత పరిస్థితులు, కష్ట సమయాల్లో కొత్త ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు వంటివి పెద్ద నిర్ణయాలేనని ఆర్థిక సలహాదారులు చెబుతున్నారు. కొనుగోలుదారులు ముందు కొన్ని అంశాలపై స్పష్టత తెచ్చుకున్న తరువాతే ఇల్లు లేదా ఆస్తి కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

ముందు ఇల్లు ఉన్న ప్రదేశం, అది ‘రెడీ టూ మూమ్‌’ స్థితిలో ఉందా, రెరా ఆమోదం, చట్టపరమైన అంశాలు, వ్యక్తుల ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగాల స్థిరత్వం, క్యాష్‌ ఫ్లో వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. దీంతో పాటు దీర్ఘకాలం ఆర్థిక నిబద్ధత పాటించే సామర్థ్యం ఉందో లేదో అంచనా వేసుకోవాలి. ఈ ప్రకారం చూస్తే, కేవలం వడ్డీ రేట్ల తగ్గుదల మాత్రమే.. ఇల్లు లేదా ఆస్తి కొనుగోలుకు ప్రామాణికం కాదని నిపుణులు చెబుతున్నారు.

పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు..

ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఇంటిని సొంతం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉండవచ్చు. కానీ లబ్ధిదారులు తమ నిర్ణయంలో లాభ నష్టాలను విశ్లేషించుకోవాలి. ఈ విషయంలో కుటుంబ ఆర్థిక ప్రణాళికను దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా కుటుంబానికి దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించే చర్యలకు హోమ్ లోన్ అవరోధంగా మారకూడదు. దీంతో పాటు ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, పిల్లల ఉన్నత చదువులు, భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు నిధుల కేటాయింపు.. వంటి ప్రణాళికలకు హోమ్ లోన్ ఏమాత్రం అడ్డంకిగా మారదని నిర్ధారించుకున్న తరువాతే వాటిని ఎంచుకోవచ్చు.

First published:

Tags: House, House loan, Low cost house, Real estate, Real estate in Hyderabad

ఉత్తమ కథలు