హోమ్ /వార్తలు /బిజినెస్ /

Income Tax Return: డెట్ ఫండ్స్‌పై క్యాపిటల్ గెయిన్స్‌ ఎలా వెల్లడించాలో తెలియట్లేదా..? ఈ వివరాలు మీకోసమే..!

Income Tax Return: డెట్ ఫండ్స్‌పై క్యాపిటల్ గెయిన్స్‌ ఎలా వెల్లడించాలో తెలియట్లేదా..? ఈ వివరాలు మీకోసమే..!

డెట్ ఫండ్స్‌పై క్యాపిటల్ గెయిన్స్‌ ఎలా వెల్లడించాలో తెలియట్లేదా..?

డెట్ ఫండ్స్‌పై క్యాపిటల్ గెయిన్స్‌ ఎలా వెల్లడించాలో తెలియట్లేదా..?

డెట్ ఫండ్స్‌పై షార్ట్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌, పెట్టుబడిదారుడి ట్యాక్సబుల్‌ ఇన్‌కమ్‌ పరిధిలోకి వచ్చే ఆదాయానికి యాడ్‌ అవుతుంది. పెట్టుబడిదారుడి ట్యాక్స్‌ స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈక్విటీ ఫండ్‌కు 15 శాతం చొప్పున పన్ను విధిస్తారు.

ఇంకా చదవండి ...

డెట్ ఫండ్స్‌పై షార్ట్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌, పెట్టుబడిదారుడి ట్యాక్సబుల్‌ ఇన్‌కమ్‌ పరిధిలోకి వచ్చే ఆదాయానికి యాడ్‌ అవుతుంది. పెట్టుబడిదారుడి ట్యాక్స్‌ స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈక్విటీ ఫండ్‌కు 15 శాతం చొప్పున పన్ను విధిస్తారు. మరోవైపు డెట్ ఫండ్స్‌పై లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌పై ఇండెక్సేషన్ తర్వాత 20 శాతం పన్ను విధిస్తారు. ఈక్విటీ ఫండ్లపై 10 శాతం పన్ను ఉంటుంది. ఒకసారి ఆర్థిక సంవత్సరంలో లాభం మొత్తం రూ.1 లక్ష దాటితే ఇవి వర్తిస్తాయి.

ఈక్విటీ- బేస్డ్‌ లేదా డెట్-ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్ (MF) స్కీమ్‌ల యూనిట్‌లను విక్రయించినప్పుడు లేదా రీడీమ్ చేసినప్పుడు, అది క్యాపిటల్‌ గెయిన్స్‌ లేదా లాస్‌ ఇస్తుంది. షార్ట్‌ టర్మ్‌ అయినా లేదా లాంగ్‌ టర్మ్‌ అయినా ఇదే జరుగుతుంది. డెట్ ఫండ్‌లు, షార్ట్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌(STCG) కోసం హోల్డింగ్ వ్యవధి 36 నెలల వరకు, ఈక్విటీ ఫండ్స్‌కు 12 నెలల వరకు ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్ నుంచి వచ్చిన లాభాలను బహిర్గతం చేయడంపై ITR ఫారమ్‌లలో (ITR-2, ITR-3) స్పష్టంగా పేర్కొన్నారు. డెట్‌ ఓరియెంటెడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లను విక్రయించిన లాభాలను వెల్లడించడానికి ఏ ఆప్షన్‌ ఎంచుకోవాలనే దానిపై పన్ను చెల్లింపుదారులలో గందరగోళం ఉంది.

ఇదీ చదవండి: మీకు చుండ్రు పెద్ద సమస్యగా మారిందా..? అయితే, ఈ ఆయిల్ ట్రై చేయండి.. బెస్ట్ రిజల్ట్ గ్యారెంటీ..!


* డెట్‌ ఓరియెంటెడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌లను అలా వర్గీకరించలేం..

ఈ విషయంపై ఆర్‌ఎస్‌ఎం ఇండియా వ్యవస్థాపకుడు డాక్టర్ సురేష్ సురానా మాట్లాడుతూ.. ‘భవిష్యత్తులో ఆదాయ పన్ను అధికారుల నుంచి ఎటువంటి పొటెన్షియల్‌ ఎంక్వైరీ లేకుండా ప్రతి పన్ను చెల్లింపుదారుడు తమ పన్ను రిటర్న్‌ను సరిగ్గా ఫైల్ చేయడం చాలా ముఖ్యం. డెట్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే ఏదైనా షార్ట్‌ టర్మ్‌ గెయిన్స్‌కు సంబంధించి, పన్ను చెల్లింపుదారులు క్యాపిటల్ గెయిన్స్ షెడ్యూల్‌లో ‘ఫ్రమ్‌ సేల్‌ ఆఫ్‌ అసెట్స్‌ అదర్‌ దేన్‌ ఆల్‌ ది ఎబో లిస్టెడ్‌ ఐటమ్స్‌’ ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. డెట్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్‌లను భూమి లేదా భవనంగా వర్గీకరించలేం. వాటిని ఈక్విటీ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్‌లుగా వర్గీకరించలేం (ఈక్విటీ ఓరియెంటెడ్ ఫండ్‌లు తమ పోర్ట్‌ఫోలియోలో 65 శాతాన్ని ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి). షార్ట్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌గా చూపడానికి 12 నెలల థ్రెషోల్డ్ పీరియడ్‌ ఉంటుంది. ఓరియెంటెడ్ ఫండ్స్ థ్రెషోల్డ్ హోల్డింగ్ వ్యవధి 36 నెలలు. బాండ్‌లు లేదా డిబెంచర్లు, ఈక్విటీ షేర్, జీడీఆర్‌ తదితర అందుబాటులో ఉన్న కేటగిరీ కింద వాటిని వర్గీకరించలేం.’ అని వివరించారు.

అందువల్ల డెట్‌ ఓరియెంటెడ్‌- మ్యూచువల్ ఫండ్స్ నుంచి షార్ట్‌ టర్మ్‌ గెయిన్స్ డిస్‌క్లోజ్ చేయడానికి అత్యంత అనుకూలమైన ఆప్షన్‌ ‘ఫ్రమ్‌ సేల్‌ ఆఫ్‌ అసెట్స్‌ అదర్‌ దేన్‌ ఆల్‌ ది ఎబో లిస్టెడ్‌ ఐటమ్స్‌’ అని డాక్టర్ సురానా అన్నారు.

* CBDT మార్పులు తీసుకురావాలి..

క్యాపిటల్‌ గెయిన్స్‌ లాభాల మొత్తాలను ఉంచడానికి పేజీని నమోదు చేసిన తర్వాత కూడా, ఆ పేజీలో కూడా డెట్ ఫండ్‌లు లేదా డెట్-బేస్డ్‌ మ్యూచువల్ ఫండ్‌ల ప్రస్తావన లేకపోవడంతో కన్‌ఫ్యూజన్‌ మొదలవుతుంది. ఇక్కడ కూడా డెట్ ఫండ్‌లు కోట్ చేయని షేర్లు కావు కాబట్టి ‘అసెట్‌ అదర్‌ దేన్‌ అన్‌క్వోటెడ్‌ షేర్స్‌’ అనే ఆప్షన్‌ ద్వారా వివరాలు ఎంటర్‌ చేయాలి. పన్ను చెల్లింపుదారులను గందరగోళానికి గురిచేసి, అసమ్షన్స్‌ ఆధారంగా నిర్ణయాలు తీసుకునేలా వారిని బలవంతం చేసే బదులు, విషయాలను మెరుగుపరచడానికి క్యాపిటల్‌ గెయిన్స్‌ పేజీలో డడెట్‌ ఓరియెంటెడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు స్పష్టమైన స్పేస్‌ను CBDT కల్పించాలని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

First published:

Tags: Income tax, IT Returns, ITR, Savings

ఉత్తమ కథలు