ITR Filing: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి

ITR Filing | ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలా వద్దా అన్న డైలమాలో ఉన్నారా? అయితే ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: October 20, 2020, 5:12 PM IST
ITR Filing: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి
ITR Filing: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి
  • Share this:
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడంపై చాలా మందికి అవగాహన ఉండదు. తమ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందా? లేదా? అనే సందేహాలు మనలో చాలా మందికి వస్తుంటాయి. అయితే, పన్నులు చెల్లించడం మరియు ఐటిఆర్ దాఖలు చేయడం రెండూ ఒకటే అనుకుంటారు చాలా మంది. వాస్తవానికి ఈ రెండు వేర్వేరు, ఈ రెండింటినీ ఒకేలా భావించకూడదు. ఈ కింది అంశాల ద్వారా మీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందా? మీరు ఐటీఆర్ దాఖలు చేయాలా వద్దా అనే విషయాలను తెలుసుకోండి.

ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే స్థూల ఆదాయం ఎక్కువగా ఉంటే



మీ మొత్తం సంవత్సర ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే ఎక్కువగా ఉంటే, మీరు ఐటీఆర్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే, మీరు సెక్షన్ 80 సి, 80 సిసిడి, 80 డి, 80 టిటిఎ, 80 టిటిబిల కింద టాక్స్ ఎక్సెంప్షన్ను పొందే వెసులుబాటు ఉంటుంది. హోం లోన్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం మరియు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ఈపిఎఫ్, పిపిఎఫ్ మరియు ఎన్పిఎస్ అకౌంట్లు, బ్యాంకుల వడ్డీలు, పిల్లల ట్యూషన్ ఫీజు మొదలైన వాటితో మీరు ఆదాయ పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు.

iPhone: మీ పాత ఫోన్ ఇచ్చేసి రూ.10 వేలకే ఐఫోన్ కొనండి ఇలా

SBI Debit Card: షాపింగ్‌కు డబ్బులు లేవా? రూ.1,00,000 వరకు ఇస్తున్న ఎస్‌బీఐ

మినహాయింపు పరిమితి


రూ .2.5 లక్షల సంవత్సర ఆదాయం ఉన్న 60 ఏళ్లలోపు వారు, రూ. 3 లక్షల సంవత్సర ఆదాయం ఉన్న 60 నుంచి 80 ఏళ్ల వయసు ఉన్న వారు, రూ.5 లక్షల సంవత్సర ఆదాయం ఉన్న 80 ఏళ్లు పైబడిన వారు మాత్రమే ఆదాయ పన్ను పరిధిలోకి వస్తారు. వివిధ మినహాయింపులు వర్తింపజేసిన తర్వాత మీ ఆదాయం 2.5 లక్షల కన్నా తక్కువగా ఉన్న సందర్భంలో మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఐటిఆర్ మాత్రం దాఖలు చేయాల్సి ఉంటుంది.

దీర్ఘకాలిక మూలధన లాభాలు


మీ లిస్టెడ్ ఈక్విటీ షేర్లు మరియు ఈక్విటీ ఓరియెంటెడ్ యూనిట్ల అమ్మకంపై వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలు ఇన్కమ్ టాక్స్ ఎక్సెంప్షన్ పరిధిలో ఉన్నప్పటికీ, ఐటిఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే, మీకు సెక్షన్ 10 (38) కింద ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వబడింది.

Dussehra Special Trains: ప్రయాణికులకు శుభవార్త... దసరా ప్రత్యేక రైళ్ల వివరాలు వెల్లడించిన సౌత్ సెంట్రల్ రైల్వే

Flash Sale: ఫ్లాష్ సేల్‌లో స్మార్ట్ టీవీ, స్మార్ట్‌ఫోన్ ఒక్క రూపాయికే

ఇతర దేశాల్లో ఆస్తులు కలిగి ఉంటే


భారత పౌరుడై, పన్ను పరిధిలోకి రానటువంటి వారు, ఇతర దేశాల్లో ఆస్తులు కలిగి ఉంటే, అతను ఐటిఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా, ఆ వ్యక్తికి వేరే దేశంలో ఏదైనా బ్యాంకు ఖాతా కలిగి ఉంటే, అతను కూడా ఐటిఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. బ్యాలెన్స్తో సంబంధం లేకుండా ఇతర దేశాల్లో బ్యాంకు ఖాతా ఉన్న వారికి ఇది వర్తిస్తుంది.
Published by: Santhosh Kumar S
First published: October 20, 2020, 5:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading