Train Ticket Cancellation: రైలు టికెట్ ఫ్రీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు... ఈ యాప్‌లో ట్రై చేయండి

Confirmtkt Free Cancellation Protection | మీరు ఎప్పుడైనా రైలు టికెట్ క్యాన్సిల్ చేశారా? రైలు టికెట్ క్యాన్సిల్ చేసినందుకు ఛార్జీలు చెల్లించారా? ఇకపై ఇలా క్యాన్సలేషన్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదంటోంది బెంగళూరుకు చెందిన స్టార్టప్.

news18-telugu
Updated: February 14, 2020, 12:27 PM IST
Train Ticket Cancellation: రైలు టికెట్ ఫ్రీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు... ఈ యాప్‌లో ట్రై చేయండి
Train Ticket Cancellation: రైలు టికెట్ ఫ్రీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు... కొత్త యాప్ వచ్చేసింది (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఒక్కసారి రైలు టికెట్ బుక్ చేసుకున్నాక క్యాన్సిల్ చేస్తే క్యాన్సలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి. మీరు క్యాన్సిల్ చేసే సమయాన్ని బట్టి క్యాన్సలేషన్ ఛార్జీలు ఉంటాయి. అంటే రైలు బయల్దేరడానికి ఎంత సేపటి ముందు మీరు టికెట్ క్యాన్సల్ చేస్తారో దాన్ని బట్టి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ రూల్స్ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. అయితే రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తే తప్పనిసరిగా ఛార్జీలు చెల్లించాల్సిందే. కానీ బెంగళూరుకు చెందిన ఆన్‌లైన్ టికెటింగ్ సంస్థ Confirmtkt ఉచితంగానే క్యాన్సలేషన్ ప్రొటెక్షన్ అందిస్తోంది. అంటే మీరు రైలు టికెట్లను ఉచితంగానే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ ప్రొటెక్షన్ ఎంచుకున్న యూజర్లకు ఫుల్ రీఫండ్ వస్తుంది. ఫ్రీ క్యాన్సలేషన్ ప్రొటెక్షన్ ఎంచుకున్న ప్రయాణికులు రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు వరకు లేదా చార్ట్ ప్రిపరేషన్ లోగా టికెట్ క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. తత్కాల్ ప్రయాణికులు కూడా ఫ్రీ క్యాన్సలేషన్ ప్రొటెక్షన్ ఎంచుకోవచ్చు. రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తే ఫుల్ రీఫండ్ పొందొచ్చు. కరెంట్ బుకింగ్ టికెట్లకు ఫ్రీ క్యాన్సలేషన్ ప్రొటెక్షన్ వర్తించదు.

ప్రయాణాల్లో మార్పులు జరిగినప్పుడు రైలు టికెట్లను క్యాన్సిల్ చేసిన అనుభవాలు మన అందరికీ ఉన్నవే. అలాంటి సమయాల్లో క్యాన్సలేషన్ ఛార్జీలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. ఎంత ఆలస్యంగా రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తే అంత ఎక్కువగా ఛార్జీలు ఉంటాయి. కానీ కొత్తగా ప్రారంభించిన ఫ్రీ క్యాన్సలేషన్ ప్రొటెక్షన్‌ ఎంచుకుంటే రైలు టికెట్ క్యాన్సలేషన్ ఛార్జీలను మేము వసూలు చేయము. మొత్తం రీఫండ్ పొందొచ్చు.

దినేష్ కుమార్ కొత్త, కో-ఫౌండర్ & సీఈఓ, Confirmtkt


రైలు టికెట్ బుకింగ్‌లో యూజర్లకు సేవలు అందించేందుకు ఐఆర్‌సీటీసీతో ఒప్పందం కుదుర్చుకొని 2015 లో Confirmtkt ప్రారంభమైంది. ప్రయాణికులకు రైలు టికెట్ కన్ఫామ్ చేయడమే ఈ ప్లాట్‌ఫామ్ లక్ష్యం. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్లు కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయో చెప్పడంతో పాటు ప్రత్యామ్నాయ ప్రయాణ వివరాలను కూడా సూచిస్తుంది. రైలు టికెట్ బుకింగ్‌లో ప్రయాణికులకు సేవలు అందిస్తున్న Confirmtkt ఇప్పుడు ఉచితంగా క్యాన్సలేషన్ ప్రొటెక్షన్ ప్రారంభించింది. రైలు టికెట్ బుకింగ్‌పై ఉచితంగా క్యాన్సలేషన్ అందిస్తున్న ఏకైక ప్లాట్‌ఫామ్ కూడా ఇదే. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్‌కు 50 లక్షల మంది యూజర్లు ఉన్నారు. రోజుకు 30,000 టికెట్స్ బుక్ చేస్తున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మరాఠీ, మళయాళం, బెంగాళీ భాషల్లో Confirmtkt యాప్ ఉపయోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

IRCTC Kashi Mahakal Express: శివరాత్రి సందర్భంగా ఐఆర్‌సీటీసీ ప్రైవేట్ రైలు ప్రారంభం

IRCTC Tour: ఐఆర్‌సీటీసీ నుంచి అరకు, సింహాచలం టూర్ ప్యాకేజీIRCTC: హైదరాబాద్ నుంచి సౌత్ ఇండియా టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: February 14, 2020, 12:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading