కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. పాత పన్ను విధానాన్ని అలాగే ఉంచుతూ కొత్త సిస్టమ్‌ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అయితే పన్ను చెల్లింపుదారుల్లో అయోమయం నెలకొంది. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలా? లేక పాత విధానంలోనే కొనసాగాలా? ఏ ట్యాక్స్ సిస్టమ్ ద్వారా లాభం ఉంటుంది? అన్న సందేహాలున్నాయి. ట్యాక్స్పేయర్స్లో ఈ సందేహాలు తీర్చేందుకు, గందరగోళాన్ని తగ్గించేందుకు ఆదాయపు పన్ను శాఖ ఇ-క్యాల్క్యులేటర్ను తయారు చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్ https://www.incometaxindiaefiling.gov.in/home ఓపెన్ చేసి కొత్త ట్యాక్స్ క్యాల్క్యులేటర్ చూడొచ్చు.
Income Tax Calculator FY 2020-21: ఐటీ డిపార్ట్మెంట్ ఇ-క్యాల్క్యులేటర్ వాడుకోండి ఇలా...
ముందుగా
https://www.incometaxindiaefiling.gov.in/home వెబ్సైట్ ఓపెన్ చేయండి.
ఎడమ వైపు Tax Calculator FY 2020-21 ట్యాబ్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి.
కొత్త పేజీలో మీ వయస్సు ఆదాయ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
Age సెక్షన్లో మీ వయస్సు, Estimated Annual Income సెక్షన్లో మీ వార్షికాదాయం ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత Exemptions / Deductions సెక్షన్లో మినహాయింపులు, తగ్గింపులు మొత్తం కలిపి ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత Compare Tax under Existing & New Regime పైన క్లిక్ చేయాలి.
ప్రస్తుత, కొత్త పన్ను విధానాల్లో మీరు ఎంత పన్ను చెల్లించాలో తెలుస్తుంది.
అంతేకాదు... కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే మీరు ఎంత ఆదా చేయొచ్చో కూడా తెలుసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ట్యాక్స్ శ్లాబ్స్ చూస్తే రూ.2,50,000 నుంచి రూ.5,00,000 వరకు 5% పన్ను, రూ.5,00,000 నుంచి రూ.7,50,000 వరకు 10% పన్ను, రూ.7,50,000 నుంచి రూ.10,00,000 వరకు 15% పన్ను, రూ.10,00,000 నుంచి రూ.12,50,000 వరకు 20% పన్ను, రూ.12,50,000 నుంచి రూ.15,00,000 వరకు 25% పన్ను, రూ.15,00,000 కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారికి 30% పన్ను చెల్లించాలి. ట్యాక్స్ పేయర్స్ కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే ఎలాంటి మినహాయింపులు, తగ్గింపులు ఉండవు.
ఇవి కూడా చదవండి:
Income Tax: జీతం ఎక్కువైనా పన్ను కట్టేది తక్కువే... కొత్త విధానాన్ని అర్థం చేసుకోండి ఇలా
SBI: బ్యాంకులో డబ్బులు దాచుకున్నవారికి ఎస్బీఐ షాక్
Auto Sweep: ఈ టెక్నిక్ తెలిస్తే... మీ బ్యాంక్ అకౌంట్లోకి డబుల్ వడ్డీ