హోమ్ /వార్తలు /బిజినెస్ /

Interest Rates: ఎస్బీఐ ఎఫ్‌డీ vs పోస్టల్ డిపాజిట్లు vs కిసాన్ వికాస్ పత్ర.. బెస్ట్ వడ్డీ అందించే పథకం ఏదంటే..

Interest Rates: ఎస్బీఐ ఎఫ్‌డీ vs పోస్టల్ డిపాజిట్లు vs కిసాన్ వికాస్ పత్ర.. బెస్ట్ వడ్డీ అందించే పథకం ఏదంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌పై పోస్టాఫీసులు పెంచిన వడ్డీ రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీరేట్లను పోల్చి, ఏది మంచి ఆదాయాన్ని అందిస్తుందో చూద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను ఇటీవల మరోసారి పెంచింది. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల పాలసీల ప్రభావం, ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితితో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 5.90 శాతానికి చేరుకుంది. 2019 ఏప్రిల్ నుంచి ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఈ క్రమంలో అనేక బ్యాంకులు డిపాజిట్ రేట్లతో పాటు లోన్ రేట్లను కూడా పెంచుతున్నాయి. ప్రస్తుతం వివిధ బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. పోస్టాఫీసులు అందించే రెండేళ్లు, మూడేళ్ల టైమ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు పెరిగాయి. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌పై పోస్టాఫీసులు పెంచిన వడ్డీ రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీరేట్లను పోల్చి, ఏది మంచి ఆదాయాన్ని అందిస్తుందో చూద్దాం.

* కిసాన్ వికాస్ పత్ర

కిసాన్ వికాస్ పత్ర (KVP) టెన్యూర్, వడ్డీ రేట్లు రెండింటినీ ప్రభుత్వం తాజాగా సవరించింది. ప్రస్తుతం KVP కొత్త రేటు 7 శాతం, మెచూరిటీ పీరియడ్ 123 నెలలుగా మారింది. గతంలో వడ్డీ రేటు 6.9 శాతంగా, మెచూరిటీ వ్యవధి 124 నెలలుగా ఉండేది.

* పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లు

పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లపై తాజాగా వడ్డీరేట్లు పెరిగాయి. ప్రస్తుతం ఒక సంవత్సరం టర్మ్ డిపాజిట్ స్కీమ్‌పై త్రైమాసిక ప్రాతిపదికన 5.5 శాతం వడ్డీ రేటు ఉంది. గత మూడు నెలలుగా ఇదే రేటు కొనసాగుతోంది. అయితే రెండు సంవత్సరాల టర్మ్ డిపాజిట్‌ వడ్డీ రేటు 20 బేసిస్ పాయింట్లు పెరిగి 5.7 శాతానికి చేరుకుంది. తాజా సవరణ తర్వాత పోస్టాఫీసుల్లో మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై వడ్డీరేటు ప్రస్తుతమున్న 5.5 శాతం నుంచి 30 బేసిస్ పాయింట్లు పెరిగి 5.8 శాతానికి పెరిగింది. ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లపై 6.7 శాతం వడ్డీ పొందవచ్చు.

* స్టేట్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని చివరిసారిగా ఆగస్టు 13న సవరించారు. ఎస్బీఐ ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 2.90% నుంచి 5.65% వరకు, సీనియర్ సిటిజన్లకు 3.4% నుంచి 6.45% వరకు వడ్డీ రేటును అందిస్తోంది.

Post Office Accounts: పోస్టాఫీస్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. రెండేళ్ల తర్వాత పెరిగిన వడ్డీ రేట్లు..

PMJDY Bank Account: జన్ ధన్ ఖాతాదారులకు గమనిక.. ఈ ఖాతాతో రూ.2.30 లక్షల ప్రయోజనం.. వివరాలిలా..

* ఏది బెస్ట్ స్కీమ్?

ప్రస్తుతం ఈ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను పరిశీలిస్తే.. SBI ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అందించే తాజా వడ్డీ రేట్లతో పోలిస్తే, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ డిపాజిట్లు అందించే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ డిపాజిట్లలో దేనికవే ప్రత్యేకం కాబట్టి, మీ వద్ద నిధుల లభ్యత, భవిష్యత్తు అవసరాల ఆధారంగా పెట్టుబడి పెట్టాల్సిన పథకాన్ని ఎంచుకోవడం మంచిది. అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవాలి.

Published by:Kishore Akkaladevi
First published:

Tags: Interest rates, Kisan vikas patra, Sbi

ఉత్తమ కథలు