ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్(Reliance) రిటైల్ సంస్థ సెలూన్ వ్యాపారంలోకి అడుగుపెట్టే యోచనలో ఉందని ఇటీవల ఐటీ నివేదిక వెల్లడైందని.. ఈ మేరకు చెన్నైకి చెందిన నాచురల్స్ సెలూన్ అండ్ స్పాలో దాదాపు 49 శాతం వాటా కొనేందుకు చర్చలు చివరి దశకు వచ్చాయని సోషల్ మీడియాలో(Social Media) వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ నిరాధారమైనవిగా కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. సెలూన్ల వ్యాపారంలోకి రిలయన్స్ ప్రవేశిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాయి. చెన్నై కు చెందిన నేచురల్స్ సెలూన్(Salon) అండ్ స్పా లో రిలయన్స్(Reliance) కొనుగోలు చేయనున్నట్లు కొన్ని వార్తలు రావడంతో తెలంగాణలో కొన్ని చోట్ల క్షౌర వృత్తి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే ఇవి కేవలం ఊహాజనితమైన వార్తలు మాత్రమే అని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.
నేచురల్స్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సీకే కుమరవేల్ లింక్డ్ ఇన్ లో ఈ మేరకు పోస్టు చేసినట్లు .. ఒక బహుళజాతి దిగ్గజం సెలూన్ పరిశ్రమలోకి ప్రవేశించబోతోంది అన్న దాంట్లో ఎలాంటి ఆధారం లేదని కుమరవేల్ తెలిపారు. తమ కంపెనీలో వాటాలను రిలయన్స్ కు అమ్మలేదని స్పష్టతనిచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. 2000ల సంవత్సరం తొలినాళ్లల్లో కార్యకలాపాలు ప్రారంభించిన నేచురల్స్ దేశవ్యాప్తగా 700 సెలూన్ లు ఉన్నాయి. వాటిని 2025 నాటికి 3000లకు పెంచుకోవాలని యోచిస్తోంది. కానీ.. దీని కోసం రిలయన్స్ కు వాటాలు అమ్మిందని వస్తున్న వార్తలు అవాస్తవమని సీఈఓ తెలిపారు. రిలయన్స్ రిటైల్ అనేది రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. ఇది ఆర్ఐఎల్ గ్రూప్ కింద ఉన్న అన్ని రిటైల్ కంపెనీల హోల్డింగ్ కంపెనీ. ఆర్ఆర్వీఎల్ మార్చి 31, 2022తో ముగిసిన సంవత్సరానికి దాదాపు రూ.2లక్షల కోట్ల కాన్సాలిడేటెడ్ టర్నోవర్ ని నివేదించింది.
దీర్ఘకాల లక్ష్యాల దిశగా అడుగులు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) దీర్ఘకాల లక్ష్యాల దిశగా అడుగులు వేస్తోంది. గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను సాధించడంలో భాగంగా కంపెనీ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. కాలిఫోర్నియాకు చెందిన సోలార్ ఎనర్జీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ డెవలపర్ సెన్స్‌హాక్ (SenseHawk) ఇంక్‌లో 79.4 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ (Mukesh Amban) ఇటీవల ఒక ప్రకటన చేశారు. ‘సెన్స్‌హాక్ డైనమిక్ బృందాన్ని మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి RIL కట్టుబడి ఉంది. 2030 నాటికి 100 GW (గిగావాట్ల) సౌరశక్తిని ప్రారంభించాలనేది మా లక్ష్యం. ఈ రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు సెన్స్‌హాక్ తోడ్పడుతుందని నమ్ముతున్నాం’ అని చెప్పారు.
సెన్సహాక్, రిలయన్స్ మధ్య జరిగిన ఒప్పందం మొత్తం లావాదేవీ విలువ $32 మిలియన్లకు (సుమారు రూ.255.5 కోట్లు)గా రిలయన్స్ సంస్థ పేర్కొంది. దీనికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు పూర్తయ్యాయి. సెన్స్‌హాక్ సోలార్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ సోలార్ అసెట్ లైఫ్సైకిల్స్ ఎండ్-టు-ఎండ్ మేనేజ్మెంట్ను అందిస్తుందని రిలయన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. న్యూ ఎనర్జీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇతర పెట్టుబడులతో పాటు, సెన్స్‌హాక్ వినియోగదారులకు ప్రత్యేకమైన పరిష్కారాలను అందజేస్తుందని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fact Check, Reliance, Reliance group