హోమ్ /వార్తలు /బిజినెస్ /

Common ITR Form: తగ్గనున్న పన్ను చెల్లింపుదారుల కష్టాలు.. త్వరలో కొత్త సేవలు!

Common ITR Form: తగ్గనున్న పన్ను చెల్లింపుదారుల కష్టాలు.. త్వరలో కొత్త సేవలు!

 Common ITR Form: తగ్గనున్న పన్ను చెల్లింపుదారుల కష్టాలు.. త్వరలో కొత్త సేవలు!

Common ITR Form: తగ్గనున్న పన్ను చెల్లింపుదారుల కష్టాలు.. త్వరలో కొత్త సేవలు!

పన్ను చెల్లింపుదారుల పనిని సులభతరం చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) కామన్‌ ఇన్‌కమ్ ట్యాక్స్‌ రిటర్న్‌(ITR) ఫారమ్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఫారం-7 మినహా అన్ని ఐటీఆర్ ఫారమ్‌లను విలీనం చేయాలని CBDT భావిస్తోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

చాలా మంది తమ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ ఫైల్‌ చేసేందుకు నిపుణుల సాయం తీసుకుంటారు. తక్కువ మందే తమంతట తాముగా ఐటీఆర్‌ ఫైల్‌ చేస్తారు. అయితే ఇప్పుడు పన్ను చెల్లింపుదారుల పనిని సులభతరం చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) కామన్‌ ఇన్‌కమ్ ట్యాక్స్‌ రిటర్న్‌(ITR) ఫారమ్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఫారం-7 మినహా అన్ని ఐటీఆర్ ఫారమ్‌లను విలీనం చేయాలని CBDT భావిస్తోంది. దీని సాయంతో పన్ను చెల్లించే ప్రాసెస్ ఇకపై సులభతరం కానుంది.

కామన్‌ ITR ఫారమ్ ప్రపోజల్‌పై CBDT ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపోజ్డ్‌డ్రాఫ్ట్‌ ITR, రిటర్న్‌ ఫైలింగ్ సిస్టమ్‌ అంతర్జాతీయ అత్యుత్తమ పద్ధతులకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ITR-7 మినహా ప్రస్తుతం ఉన్న అన్ని ఆదాయ రిటర్న్‌లను విలీనం చేసి కామన్‌ ITRని ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. అయితే ప్రస్తుత ITR-1, ITR-4 కొనసాగుతాయని, పన్ను చెల్లింపుదారులకు ITR-1 లేదా ITR-4 లేదా కామన్‌ ITRలో వారి సౌలభ్యం ప్రకారం రిటర్న్‌ను ఫైల్ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.

రూ.140 పొదుపుతో రూ.21 లక్షలు.. మీ పిల్లల్ని ధనవంతుల్ని చేయండిలా!

ప్రస్తుతం ఇలా..

ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులు సోర్స్, లెవల్‌, ఇన్‌కం నేచర్‌ వంటి అంశాలపై ఆధారపడి ITR-1 నుంచి ITR-7 వరకు ఫారమ్‌లను ఎంచుకోవాలి. ప్రస్తుత ITRలు నిర్దేశిత ఫారమ్‌ల రూపంలో ఉంటాయి. ఇందులో నిర్దిష్ట షెడ్యూల్ వర్తిస్తుందా లేదా అనే దానితో సంబంధం లేకుండా పన్ను చెల్లింపుదారు తప్పనిసరిగా అన్ని షెడ్యూల్‌ల ద్వారా వెళ్లవలసి ఉంటుంది. ఇది ఐటీఆర్‌లను ఫైల్ చేయడానికి పట్టే సమయాన్ని పెంచుతుంది.

కామన్‌ ITR ఫారమ్ స్కీమ్‌

కామన్‌ ITR ఫారమ్‌లో ప్రాథమిక సమాచారం (భాగాలు A నుంచి E వరకు ఉంటుంది), మొత్తం ఆదాయం గణన కోసం షెడ్యూల్ (షెడ్యూల్ TI), పన్ను గణన కోసం షెడ్యూల్ (షెడ్యూల్ TTI), బ్యాంక్ ఖాతాల వివరాలు, పన్ను చెల్లింపుల షెడ్యూల్ (షెడ్యూల్ TXP) పన్ను చెల్లింపుదారులందరికీ వర్తిస్తుంది.

పన్ను చెల్లింపుదారులు సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్నల ఆధారంగా షెడ్యూల్‌లతో ITRను కస్టమైజ్‌ చేశారు.

ఆడ పిల్ల పుట్టిందా? ఈ స్కీమ్‌తో రూ.25 లక్షలు పొందండిలా!

ఏదైనా ప్రశ్నకు సమాధానం 'లేదు' అయితే, ఈ ప్రశ్నకు లింక్ అయిన ఇతర ప్రశ్నలు పన్ను చెల్లింపుదారులకు కనిపించవు. షెడ్యూల్‌లకు సంబంధించిన ఆదేశాలతో రిటర్న్‌ను దాఖలు చేయడంలో సహాయపడటానికి సూచనలు అందుబాటులో ఉంటాయి. ప్రతి రోలో ఒక ప్రత్యేక విలువ మాత్రమే ఉండే విధంగా ప్రపోజ్డ్‌ ITR ఉంటుంది. ఇది రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియను సులభతరం చేస్తుంది.షెడ్యూల్ వర్తించే ఫీల్డ్‌లు మాత్రమే కనిపించే విధంగా ITR యుటిలిటీ రూపొందుతుంది. అవసరమైన చోట, ఫీల్డ్‌ల సెట్ ఒకటి కంటే ఎక్కువసార్లు కనిపిస్తుంది.

కామన్‌ ఐటీఆర్‌ యూజర్‌ ఫ్రెండ్లీ

MyFundBazaar సీఈవో, వ్యవస్థాపకుడు వినిత్ ఖండారే లైవ్ మింట్ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. రిటర్న్‌లను దాఖలు చేసే సమయాన్ని తగ్గించే లక్ష్యంతో, ITR సమర్థవంతమైన అమరిక, యూజర్ ఫ్రెండ్లీ పద్ధతిలో అందుబాటులోకి వస్తోందని వివరించారు. పన్ను చెల్లింపుదారులు అందించిన సమాచారం మరింత సంక్షిప్తంగా, కచ్చితంగా ఉంటుందని అన్నారు.

కామన్‌ ఐటీఆర్‌ గురించి డెలాయిట్ ఇండియా భాగస్వామి అలోక్ అగర్వాల్ లైవ్‌మింట్‌తో మాట్లాడుతూ.. ప్రభుత్వం కొన్ని సంబంధిత వివరాలను ITRలో ఆటోమేటిక్‌గా వచ్చేలా చేయడంతో పన్ను చెల్లింపుదారుల పని సులభం అయిందని చెప్పారు. కామన్‌ ITR పన్ను చెల్లింపుదారులకు మరింత సహాయపడవచ్చని అభిప్రాయపడ్డారు. ఇది ఎంత మేరకు పన్నును సులభతరం చేస్తుందనేది డిపార్ట్‌మెంట్ యుటిలిటీని విడుదల చేసిన తర్వాత తెలుస్తుందని చెప్పారు.

First published:

Tags: Cbdt, Income tax, ITR, ITR Filing

ఉత్తమ కథలు