హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gas Cylinder : గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

Gas Cylinder : గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gas Cylinder : ఏప్రిల్ 1 రాగానే.. కొత్త ఆర్థిక సంవత్సరం కారణంగా... కొన్నింటి ధరలు పెరుగుతాయి.. కొన్నింటి ధరలు తగ్గుతాయి. ఐతే.. దానితో సంబంధం లేకుండా.. గ్యాస్ సిలిండర్ ధర తగ్గడం ఒకింత ఉపశమనం కలిగించే అంశం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

దేశవ్యాప్తంగా వాణిజ్య (Commercial) గ్యాస్ సిలిండర్ల ధర భారీగా తగ్గింది. ఏప్రిల్ 1 నుంచి ధరను తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అందువల్ల ఇవాళ్టి నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వస్తుంది. ఈ ప్రకారం చూస్తే... 19 కేజీల LPG సిలిండర్‌ ధర రూ.91.50 తగ్గింది. ఈ తగ్గింపు దేశవ్యాప్తంగా ఉంటుంది. ఐతే.. గ్యాస్ సిలిండర్ల ధర మాత్రం దేశవ్యాప్తంగా ఒకే రకంగా ఉండదు. తగ్గింపును లెక్కలోకి తీసుకుంటే.. ఢిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ రేటు ఇప్పుడు రూ.2,028 అయ్యింది.

బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. 14.2 కేజీల ఇళ్లలో వాడుకునే గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఏ మార్పూ చెయ్యలేదు. పనిలో పనిగా ఇళ్లలో సిలిండర్ ధర కూడా కాస్త తగ్గించి ఉంటే.. కోట్ల మంది ఆనందం వ్యక్తం చేసేవారు. మీకు గుర్తుండే ఉంటుది. మార్చిలో వాణిజ్య సిలిండర్‌పై రూ.350.50, ఇళ్లలో సిలిండర్‌పై రూ.50 పెంచారు. అప్పట్లోనే చాలా మంది ముందుగా బుక్ చేసుకొని ఉంటే రూ.50 కలిసొచ్చేదని ఎంతో బాధపడ్డారు. అదే ఇప్పుడు ధర తగ్గి ఉంటే.. వారంతా ఆనందపడేవారు.

First published:

ఉత్తమ కథలు