• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • COCA COLA TESTING 100 PERCENT RECYCLED PLASTIC BOTTLES SU GH

Coca Cola Paper Bottles: పేపర్ బాటిళ్లు వాడనున్న కోకాకోలా.. కాలుష్యం తగ్గించేందుకు కొత్త ఆలోచన..

Coca Cola Paper Bottles: పేపర్ బాటిళ్లు వాడనున్న కోకాకోలా.. కాలుష్యం తగ్గించేందుకు కొత్త ఆలోచన..

ప్రతీకాత్మక చిత్రం

ప్లాస్టిక్ వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా దాన్ని తగ్గించేందుకు ప్రయత్నించేవారు తక్కువే.

  • Share this:
ప్లాస్టిక్ వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా దాన్ని తగ్గించేందుకు ప్రయత్నించేవారు తక్కువే. మన జీవన విధానంలో ఒక భాగంగా మారిన ఈ ప్లాస్టిక్ మహమ్మారి నుంచి పర్యావరణాన్ని రక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రముఖ సంస్థలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కోకాకోలా కంపెనీ కూడా చేరింది. తమ కంపెనీ విడుదల చేసే కూల్‌డ్రింక్స్‌ ప్లాస్టిక్ బాటిల్స్‌లో కాకుండా పేపర్ బాటిల్స్‌లో అందించేందుకు ఆ సంస్థ ప్రయోగాలు మొదలు పెట్టింది. ప్రపంచంలో అత్యధికంగా ప్లాస్టిక్ వ్యర్థాలకు కారణమవుతున్న సంస్థగా కోకాకోలాకు పేరుంది. ప్లాస్టిక్ వ్యర్థాలపై ‘బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్’అనే స్వచ్ఛంద సంస్థ చేసిన అధ్యయనంలో ప్లాస్టిక్ వ్యర్థాలకు కారణమవుతున్న సంస్థగా కోకాకోలాకు మొదటి స్థానం దక్కింది. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్లాస్టిక్ బాటిళ్ల స్థానంలో పేపర్ బాటిల్స్‌ను వాడతామని ఆ సంస్థ ప్రకటించింది. ఇందుకు పొబొకో అనే మరో సంస్థతో ఒప్పందం చేసుకుంది.

కోకాకోలా కంపెనీ ప్యాకేజింగ్ ఇన్నోవేషన్ మేనేజర్ స్టిజన్ ఫ్రాన్సెన్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. రీసైక్లింగ్ చేయగలిగే పేపర్ లేదా ఇతర పదార్థాలతో బాటిళ్లను రూపొందించేందుకు తమ సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెప్పారు. భవిష్యత్తులో ప్యాకేజింగ్ కోసం రీసైక్లింగ్ చేయగలిగే పేపర్‌ వాడకం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి పేపర్ బాటిల్ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. ఇలాంటి కొత్త బాటిళ్ల బయటి పొరను కాగితంతోనే తయారు చేస్తారు. కానీ దీని లోపలి పొరను ప్లాస్టిక్‌తోనే రూపొందించాల్సి ఉంటుంది. ఈ పొర బయటివైపు ఉన్న కాగితం దెబ్బతినకుండా, బాటిల్ పాడవ్వకుండా కాపాడుతుంది. దీని మూత, క్లోజర్ భాగాలను కూడా ప్లాస్టిక్‌తోనే తయారు చేస్తారు.



ఈ ఫస్ట్ జనరేషన్ పేపర్ బాటిల్ ప్రోటోటైప్ ప్లాస్టిక్ లైనర్, ప్లాస్టిక్ క్లోజర్‌తోనే వస్తుంది. అయితే వీటిని కూడా వందశాతం రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్‌తోనే తయారు చేస్తామని స్టిజన్ చెప్పారు. దీన్ని ఉపయోగించిన తరువాత మళ్లీ రీసైకిల్ చేయవచ్చని తెలిపారు. సాధారణ పేపర్ల మాదిరిగా.. పూర్తిగా రీసైకిల్ చేయగల పేపర్ బాటిల్‌ను తయారు చేసేందుకు కృషి చేస్తామని వివరించారు. ఆ తరువాత దశలో ప్లాస్టిక్ లైనర్ లేకుండా బాటిల్‌ను సృష్టించేందుకు ప్రయోగాలు చేస్తామన్నారు. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల శీతల పానీయాలను తయారు చేస్తోంది. 2030 నాటికి కంపెనీ అమ్మిన అన్ని ప్లాస్టిక్ బాటిళ్లను తిరిగి సేకరించి, వాటిని రీసైక్లింగ్ చేయాలని కోకాకోలా లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల కొత్త ప్లాస్టిక్‌ను తయారు చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా ప్లాస్టిక్ కాలుష్యం చాలా వరకు తగ్గిపోతుంది.
Published by:Sumanth Kanukula
First published:

అగ్ర కథనాలు