హోమ్ /వార్తలు /బిజినెస్ /

Recharge Plans: మొబైల్ వినియోగదారులకు అలర్ట్.. అలాంటి మెసేజ్ లు వస్తే వెంటనే డిలీట్ చేయండి..

Recharge Plans: మొబైల్ వినియోగదారులకు అలర్ట్.. అలాంటి మెసేజ్ లు వస్తే వెంటనే డిలీట్ చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) మొబైల్ వినియోగదారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని రకాల మెసేజ్ లు వస్తే వాటిపై క్లిక్ చేయొద్దని సూచించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంటర్ నెట్, సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. టెలికాం సంస్థలు పోటీలు పడి ఆఫర్లు ఇస్తుండడంతో ఇంటర్ నెట్ చాలా చౌకగా లభించడం ఇందుకు ఓ కారణంగా చెప్పొచ్చు. అయితే సోషల్ మీడియా వాడకం పెరుగుతున్నా కొద్దీ ఫేక్ మెసేజ్ ల సంచారం సైతం అదే స్థాయిలో విపరీతంగా పెరుగుతోంది. కొంత మంది అదే పనిగా తప్పుడు సమాచారంతో కూడిన పోస్టులను సృష్టించి సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. దీంతో అనేక మంది ఇది నిజమని నమ్మి మోసపోతున్నారు. ఇలాంటి ఫేక్ మెసేజ్ ల కారణంగా డబ్బులు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. మీకు లాటరీ తగిలిందని.. కొంత డబ్బులు డిపాజిట్ చేస్తే ఆ లాటరీని సొంతం చేసుకోవచ్చని డబ్బులు కొట్టేసిన కేటుగాళ్లు కూడా ఉన్నారు. తాజాగా ఇటాంటి మెసేజ్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కోసం 10 కోట్ల మందికి ఉచితంగా రీచార్జ్ చేస్తుందని ఆ మెసేజ్ సారాంశం.

BSNL Recharge Plans: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఈ ప్లాన్లతో తక్కువ ధరకు ఎక్కువ డేటా.. వివరాలివే

Android Apps: అలర్ట్... మీ స్మార్ట్‌ఫోన్ నుంచి వెంటనే ఈ 8 యాప్స్ డిలిట్ చేయండి

అయితే ఈ విషయంపై సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) స్పందించింది. రూ. 10 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం రీచార్జ్ చేస్తుందని చక్కర్లు కొడుతున్న మెసేజ్ ఫేక్ అంటూ తేల్చి చెప్పింది. కేంద్రం ఇలాంటి ఉచిత రీచార్జ్ ప్లాన్ ను తీసుకురాలేదని స్పష్టం చేసింది. ఇలాంటి మెసేజ్ లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

మీ పేరు మీద ఎన్ని మొబైల్​ నంబర్లున్నాయో తెలుసా?.. మీ ఫస్ట్ మొబైల్ నెంబర్ గుర్తుందా? ఇక్కడ చెక్ చేసుకోండి..

అలాంటి లింక్ లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని సూచించింది. ఒక వేళ క్లిక్ చేసి వారు అడిగిన సమాచారానని నమోదు చేస్తే మోసపోయే అవకాశం ఉందని తెలిపింది COAI. ఇలాంటి మొసేజ్ లను ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేయవద్దని సూచించింది. అలాంటి మెసేజ్ లు రాగానే డిలీట్ చేయడం మేలని వివరించింది సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.

First published:

Tags: Fact Check, Fake news, Smartphone, Smartphones

ఉత్తమ కథలు