హోమ్ /వార్తలు /బిజినెస్ /

CNG Price Hike: మళ్లీ గ్యాస్‌పై బాదుడు.. సీఎన్జీ ధర 1కేజీపై రూ.2 పెంపు.. వారం వ్యవధిలో రూ.4 హైక్

CNG Price Hike: మళ్లీ గ్యాస్‌పై బాదుడు.. సీఎన్జీ ధర 1కేజీపై రూ.2 పెంపు.. వారం వ్యవధిలో రూ.4 హైక్

సీఎన్జీ ధర పెంపు

సీఎన్జీ ధర పెంపు

దేశంలో ఇంధన ధరల భగభగలు కొనసాగుతున్నాయి. ఎల్పీజీ సిలిండర్‌ ధరల బాదుడుకుతోడు తాజాగా వాహనాలకు వాడే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ-CNG) రేటు సైతం పెరిగింది. వివరాలివే..

దేశంలో ఇంధన ధరల భగభగలు కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు నెలన్నరగా పైసా తగ్గకపోగా, వంట గ్యాస్ ధరలు ఇటీవల రెండు సార్లు పెరిగాయి. గృహావసరాలకు వినియోగించే, కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధరల బాదుడుకుతోడు తాజాగా వాహనాలకు వాడే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ-CNG) రేటు సైతం పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో సీఎన్జీ ధరలు వారం రోజుల వ్యవధిలో మళ్లీ పెరిగాయి. సీఎన్జీ ధర 1కేజీకి గత వారమే రూ.2 వడ్డించగా, మళ్లీ ఇవాళ మరో రూ.2 భారంమోపారు. దీంతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.75.61కి చేరింది.

Petrol Diesel Prices: అప్పటిదాకా ఇంధన ధరలు తగ్గేదేలే? -దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇలా..


నోయిడా, గ్రేటర్‌ నోయిడా, ఘజియాబాద్‌లో రూ.78.17, ముజఫర్‌నగర్‌, మీరట్‌, షామ్లీ రూ.82.84, గురుగ్రామ్‌ రూ.83.94, రెవారి రూ.86.07, కర్నాల్‌, కైతాల్‌ రూ.84.27, కాన్పూర్‌, హమిర్‌పూర్‌, ఫతేహ్‌పూర్‌ రూ.87.40, అజ్మీర్‌, పాలి, రాజ్‌సమండ్‌ రూ.85.88కు చేరాయి.

Gold Silver Rates: పసిడి ప్రియులకు భారీ షాక్ -మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..


పెట్రోల్, డీజిల్ ధరల విషయానికి వస్తే, ఆయిల్ కంపెనీలు వరుసగా 45వ రోజూ రేట్లను పెంచలేదు. మే నెల తొలి పక్షంలో ఇంధన డిమాండ్ పెరిగింది. కాగా, ఆయిల్ కంపెనీలు పెట్రోల్‌లో 10.5 శాతం ఇథనాల్‌ను కలుపుతుండగా, దానిని వచ్చే ఏడాది(2023) ఏప్రిల్ 1 నాటికి 20 శాతానికి పెంచాలనే లక్ష్యం పెట్టుకున్నారు.

First published:

Tags: CNG, Delhi, Fuel prices

ఉత్తమ కథలు