హోమ్ /వార్తలు /బిజినెస్ /

Maruti Cars: పెట్రోల్, డీజిల్ ధరలతో భయపడుతున్నారా...అయితే 5 లక్షల్లోపు CNG కార్లు ఇవే..

Maruti Cars: పెట్రోల్, డీజిల్ ధరలతో భయపడుతున్నారా...అయితే 5 లక్షల్లోపు CNG కార్లు ఇవే..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

పెట్రోల్, డీజిల్ కార్ల కన్నా కూడా ధరల విషయంలో CNG కార్ల ధర చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మారుతి సుజుకి కార్లు ఈ రేంజిలో మీకు చక్కటి ఆప్షన్ గా ఉంటాయి.

  ప్రస్తుత కాలంలో కార్లకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో చాలా మంది CNG వర్షన్ కార్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకుంటే డీజిల్ కార్లను మెయిన్ టైన్ చేయడం కూడా కాస్త ఖరీదైన విషయం. అయితే  ఇటువంటి పరిస్థితిలో సి‌ఎన్‌జి కార్లు మీకు చక్కటి ఎంపిక. పెట్రోల్, డీజిల్ కార్ల కన్నా కూడా ధరల విషయంలో CNG కార్ల ధర చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మారుతి సుజుకి కార్లు ఈ రేంజిలో మీకు చక్కటి ఆప్షన్ గా ఉంటాయి. అలాగే Maruti Alto 800, WagonR, Celerio, S-Presso లాంటి కార్లు ప్రస్తుతం మార్కెట్లో కేవలం రూ.5 లక్షల లోపే లభిస్తున్నాయి. అయితే వాటి ఫీచర్స్ కూడా చాలా వరకూ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఏ కారు ఏ ధరకు అందుబాటులో ఉందో, వాటి  ఫీచర్స్ ఏంటో చూద్దాం…

  Maruti Alto 800 :

  మారుతి సుజుకి ఆల్టో ప్రస్తుతం నెంబర్ వన్ సేల్స్ లో దూసుకుపోతోంది. అయితే ఇందులోని CNG వేరియంట్ కొనాలనుకుంటే, మీరు ఈ కారును కేవలం  రూ 4.30 లక్షలకు కొనుగోలు చేసుకునే వీలుంది. ఈ కారు ఒక కిలో సిఎన్‌జితో 31.59 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది కాకుండా ఈ కారు సి‌ఎన్‌జి కిట్ లీక్ ప్రూఫ్ డిజైన్. ఈ కారు గత 16 సంవత్సరాలుగా అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది.  మారుతి సుజుకి ఆల్టో  800 కారు అత్యంత ప్రజాదరణ పొందిన వాహనంగా ఉంది.

  Maruti Celerio :

  మారుతి సుజుకి సెలెరియో కారు సిఎన్‌జి వెరీఎంట్ 30.47 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ కారులో కూడా సిఎన్‌జి కిట్‌ను కంపెనీ అందిస్తోంది. దీని సిఎన్‌జి కిట్ కూడా లీక్ ప్రూఫ్ డిజైన్. అంతే కాకుండా భద్రత విషయంలో కూడా ఈ కారు చాలా బాగుంది. మారుతి సుజుకి సెలెరియో కారు సి‌ఎన్‌జి కిట్  సామర్ధ్యం 10 కిలోలు. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర ఢీల్లీలో రూ.5.60 లక్షలు.

  Maruti WagonR :

  మారుతి సుజుకి వాగన్ఆర్ చాలా కాలంగా భారతదేశ మధ్యతరగతికి ప్రజలకి ఇష్టమైన కారు. మీరు ఈ కారును ఎక్స్-షోరూమ్ ధర రూ.5.25 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఈ కారు ఎస్-సిఎన్‌జి టెక్నాలజీలో వస్తుంది. దీని సిఎన్‌జి ట్యాంక్ లీక్‌ప్రూఫ్ డిజైన్‌. దీని డ్రైవింగ్ అనుభవం, పికప్ చాలా అద్భుతమైనది.

  Maruti S Presso

  మారుతి సుజుకి కస్టమర్లకు ఎస్-ప్రెస్సో కారు దాదాపు అదే బడ్జెట్‌లో మంచి ఎంపిక. దీని ప్రారంభ ధర రూ.4.84 లక్షలు. ఈ కారు మైలేజ్ పరంగా కూడా చాలా బాగుంది. ఒక కిలో సిఎన్‌జిపై 31.2 కిలోమీటర్లు మైలేజ్ వస్తుంది.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Automobiles, Cars

  ఉత్తమ కథలు