CNBC-TV18: ఈ రోజే ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్ 2020 కార్యక్రమం

CNBC-TV18 India Business Leader Awards | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పూరి నేతృత్వంలోని జ్యూరీ విజేతలను ఎంపిక చేయడం విశేషం.

news18-telugu
Updated: February 28, 2020, 11:41 AM IST
CNBC-TV18: ఈ రోజే ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్ 2020 కార్యక్రమం
CNBC-TV18: ఈ రోజే ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్ 2020 కార్యక్రమం
  • Share this:
భారతదేశంలోనే నెంబర్ 1 బిజినెస్ ఛానెల్ సీఎన్‌బీసీ-టీవీ18 ప్రతీ ఏటా నిర్వహించే ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్-IBLA 2020 కార్యక్రమం ఫిబ్రవరి 28న సాయంత్రం 6 గంటలకు జరగనుంది. సీఎన్‌బీసీ-టీవీ18 ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇది 15వ సారి. భారతదేశంలోని కార్పొరేట్ రంగంలో అత్యుత్తమ నాయకుల్ని, మార్గదర్శకంగా నిలిచేవారిని సత్కరించే కార్యక్రమం ఇది. సమానమైన ఆర్థిక వృద్ధిని తీసుకురావడంతో పాటు లాభదాయకమైన, స్థిరమైన, సామాజిక స్పృహ కలిగిన వ్యాపారాలను నిర్మిస్తున్న బిజినెస్ లీడర్స్‌ని గుర్తించి సత్కరించనుంది.

గత 20 ఏళ్లుగా వ్యాపార, ఆర్థిక వార్తల్ని అందించడంలో, కొత్త మార్గాలను విస్తరించడంలో సీఎన్‌బీసీ-టీవీ18 అనేక సవాళ్లను ఎదుర్కొంది. భారతదేశ అపారమైన ఆర్థిక వృద్ధి కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్న బిజినెస్ లీడర్స్‌ని గుర్తించి సత్కరించడం కోసం ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్ కార్యక్రమం తోడ్పడుతోంది. ఈ ఏడాది ఐబీఎల్ఏ 15వ కార్యక్రమం కోసం అద్భుతమైన జ్యూరీ ఉండటం విశేషం. 2020 సంవత్సరానికి అత్యుత్తమ బిజినెస్ లీడర్స్‌ని గుర్తిస్తామని విశ్వసిస్తున్నాం.
షిరీన్ భాన్, మేనేజింగ్ డైరెక్టర్, సీఎన్‌బీసీ-టీవీ18




హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పూరి నేతృత్వంలోని జ్యూరీ విజేతలను ఎంపిక చేయడం విశేషం. బ్రిటానియా మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ రజనీష్ కుమార్, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఎజెడ్‌బీ అండ్ పార్ట్‌నర్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ పార్ట్‌నర్ జియా మోడీ, ఐటీసీ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ సంజీవ్ పూరీ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సీఈఓ జరీన్ దారువాలా జ్యూరీలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

March Bank Holidays: మార్చిలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు... ప్లాన్ చేసుకోండి ఇలా

Luxury Trains: ఈ లగ్జరీ రైళ్లల్లో ప్రయాణం అద్భుతం... టికెట్ ధర తెలిస్తే షాకే

Save Money: మీకు రూ.1 కోటి కావాలంటే నెలనెలా జమ చేయండి ఇలా
First published: February 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading